జయంతి పాపారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయంతి పాపారావు

జయంతి పాపారావు కథారచయితగా, నవలారచయితగా, సాహిత్యవిమర్శకుడిగా ప్రసిద్ధుడు. ఇతడు విశాఖపట్నం జిల్లా, మాకవరపాలెంమండలం, సీతన్న అగ్రహారంలో జన్మించాడు. 1956లో విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేశాడు. తరువాత కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రధాన కార్యాలయంలో కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు హిందీ, ఇంగ్లీషు, మలయాళ భాషలలోకి అనువాదమయ్యాయి. ఇతని రచనలపై రమావత్ కుసుమకుమారి అనే పరిశోధకురాలు ఎం.ఫిల్.పట్టాకై పరిశోధన చేసింది.

రచనలు[మార్చు]

  1. ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కథలు
  2. కథను వెంటాడుతూ...గతంలోకి
  3. నిలిచే నవలలు ఏవి? (ప్రముఖుల ప్రత్యేక నవలా విశ్లేషణలు) - సంపాదకత్వం
  4. జయంతి పాపారావు కథలు
  5. నూరేళ్లు నూరుగురు కథకులు నూరు కథలు
  6. సంఘర్షణ
  7. వెదుకుతూ... వెంటాడుతూ... వేటాడుతూ... (నవల)
  8. రావిశాస్త్రి సామాజిక రాజకీయ తాత్వికత (రావిశాస్త్రి నవలలపై విశ్లేషణ)
  9. రాచకొండ విశ్వనాథశాస్త్రి కథానికాయాత్ర - తత్త్వదర్శనం
  10. ప్రాచీన కథ - ప్రస్థానం