జయశ్రీ రాచకొండ
జయశ్రీ రాచకొండ | |
---|---|
జననం | అక్టోబరు 12 కరీంనగర్, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
విద్య | బి.ఏ., ఎల్ఎల్‌బి., ఎల్‌ఎల్‌ఎమ్., పిజిడిఐపిఆర్ |
ప్రసిద్ధి | న్యాయవాది, సినిమా నటి |
తండ్రి | రాచకొండ నర్సింగరావ్ |
తల్లి | రాచకొండ విజయలక్ష్మి |
జయశ్రీ రాచకొండ న్యాయవాది, సినిమా నటి. ఎక్స్‌టెండెడ్ వారంటీ అనే షార్ట్ ఫిలింలో నటించిన జయశ్రీ, సీతా ఆన్ ది రోడ్ , అ!, మల్లేశం, బుర్రకథ, వాళ్ళిద్దరి మధ్య వంటి చిత్రాలలో నటించింది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]జయశ్రీ, అక్టోబరు 12న తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో రాచకొండ నర్సింగరావ్, విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. తండ్రి అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎఫ్‌సిఐ, రామగుండంలో పనిచేశాడు, తల్లి గృహిణి. పదవతరగతి వరకు రామగుండంలోని ఎఫ్‌సీఐ స్కూల్‌లో చదువుకుంది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉండగానే పంచాయితీరాజ్ ఇంజనీర్ తో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె . కూతురు పుట్టిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేసి, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎమ్, పిజిడిఐపిఆర్ చేసింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తోంది. భర్త పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్నాడు.[2]
సినిమారంగం
[మార్చు]2018లో ఎఫ్‌సీఏ స్కూల్ రీయూనియన్ కార్యక్రమంలో జయశ్రీ హావభావాలు గమనించిన తన సహచర విద్యార్థి ప్రణీత్ సీతా ఆన్ ది రోడ్ అనే ఫీచర్ ఫిల్మ్‌లో అవకాశం ఇచ్చాడు. అదిచూసి నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ! సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత మాయం సినిమాలో మల్లేశం సినిమాలో డాక్టర్‌గా, వాళ్ళిద్దరి మధ్య సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది. [3]
నటించినవి
[మార్చు]చిన్నసినిమాలు
[మార్చు]- ఎక్స్‌టెండెడ్ వారంటీ
సినిమాలు
- సీత ఆన్ ది రోడ్
- అ! (దేవి)
- మాయం
- మల్లేశం (డాక్టర్)
- బుర్రకథ (2019) (హీరోయిన్ తల్లి)
- వాళ్ళిద్దరి మధ్య (సుజాత, హీరోయిన్ తల్లి)[4]
- విఠల్ వాడి (హీరో తల్లి)
వెబ్ సిరీస్
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, మూవీ (27 February 2020). "ఆనంద తరంగం". www.prajasakti.com. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
- ↑ సాక్షి, సినిమా (11 March 2020). "అన్నిపాత్రల్లో వి'జయ'మే." Sakshi. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
- ↑ యాక్టింగ్ రాకపోవడం నుండే యాక్టింగ్ మొదలు, వి6 వెలుగు లైఫ్, 25 మే 2020, పుట. 5.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 June 2020). "వాళ్ళిద్దరి మధ్య... లవ్వింతే!". www.andhrajyothy.com. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
- ↑ The Hans India, Entertainment (4 March 2020). "Chadarangam is an inexplicable experience: Jayasri Rachakonda". www.thehansindia.com (in ఇంగ్లీష్). Vyas. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.