జయ సీల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయ సీల్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జీవిత భాగస్వామిబిక్రమ్ ఘోష్[1]

జయ సీల్, అస్సాం రాష్ట్రానికి చెందిన నటి, నర్తకి.[2] ఇందిరా పిపి బోరా వద్ద ఐదు సంవత్సరాల పాటు భరతనాట్యం నేర్చుకున్న జయ, నాటకాలలో, అస్సామీ టెలివిజన్‌ సీరియళ్ళలో, సినిమాలలో నటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి, 1977లో మూడేళ్ళ కోర్సును పూర్తిచేసింది.

జీవిత విషయాలు[మార్చు]

జయ అస్సాంలోని గౌహతిలో జన్మించింది. బొంబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ నటీమణులలో ఒకరిగా ఎదిగింది. అనేక యాడ్ కమర్షియల్‌లలో నటించడమే కాకుండా 8 భాషలలో 19 సినిమాలలో నటించింది. వెనిస్, పుస్సాన్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జయ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. బుద్ధదేబ్ దాస్‌గుప్తా రూపొందించిన ఉత్తర సినిమాలో నటించి 2000 సంవత్సరంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. 2004లో వచ్చిన ' కహానీ ఘర్ ఘర్ కీ'లో పాపులర్ సీరియల్‌లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. చల్, ఎక్స్‌క్యూస్ మీ (హిందీ), ప్రభుదేవాతో పెన్నిమనాతైతొట్టు (తమిళం), విక్రమ్ తో సరసన సమురాయ్ (తమిళం), శివరాజ్ కుమార్ తో బహలా చన్నా గిదే (కన్నడ) సినిమాలలో నటించింది. ముంబైలో ఉన్న సమయంలో లాస్య అకాడమీలో గురు వైభవ్ అరేకర్, గురు రాజశ్రీ షిర్కే దగ్గర శిక్షణ పొంది, ఆ తర్వాత నరేష్ పిళ్లై దగ్గర శిక్షణ తీసుకుంది. కోల్‌కతాకు వచ్చి 2005లో గురు తంకమణి కుట్టి మార్గదర్శకత్వంలోని కళామండలం చేరొ, బిదుషి రమా వైద్యనాథన్ దగ్గర తన శిక్షణను కొనసాగిస్తోంది. అనేక ప్రతిష్టాత్మక వేదికలలో నృత్య కళాకారిణిగా రాణించింది. నాటకరంగ కళాకారిణి ఉషా గంగూలీతో కలిసి ఆమె నిర్మించిన ఛండాలికలో ప్రధాన కథానాయికగా నటించింది. అపర్ణా సేన్ దర్శకత్వంలో ఆర్షినగర్ సినిమాలో, దీప్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన జాతీయ అవార్డు పొందిన అలీఫా సినిమాలో నటించింది.

అవార్డులు[మార్చు]

  • 2014లో వచ్చిన ష్రింహోల్ అనే అస్సామీ సినిమాలో నటించి అస్సాం ప్రాగ్ సినీ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
  • లోనావాలా ఫిల్మ్ ఫెస్టివల్ (లిఫ్ట్)లో అలీఫా చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
  • 2018లో హైదరాబాద్ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలీఫా చిత్రానికిగానూ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[3][4]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
1999 అమృత హిందీ
2000 పెన్నిన్ మనతై తొట్టు సునీత తమిళం
2000 శేష్ తికాన శ్రీరాధ బెంగాలీ
2000 ఉత్తరా ఉత్తరా
2001 కలకలప్పు తిలగా తమిళం
2001 బహలా చెన్నగిదే కన్నడ
2002 మగునిరా శగడ ఒడియా
2002 సమురాయ్ కవిత తమిళం
2002 ఎవరే అతగాడు స్నేహ తెలుగు
2002 తిలాదానం
2002 మగునిరా శగడ ఒడియా
2002 ఛల్ పద్మిని హిందీ
2002 దేశ్ దేవి గాయత్రి
2003 ఎక్స్‌క్యూస్ మీ మోనికా ఖురానా
2003 ఎక్స్‌క్యూస్ మీ స్వాతి దీక్షిత్ కన్నడ
2004 హోతాత్ నీరర్ జోన్యో రాణి బెంగాలీ
2011 కటకుటి సుధేష్ణ
2012 క్వార్టెట్ 1 హిందీ
2014 శృంగఖాల్ అంబిక అస్సామీ ఉత్తమ నటిగా ప్రాగ్ సినీ అవార్డులు
2015 అర్షినగర్ మధు మిత్ర బెంగాలీ
2016 వన్ లిటిల్ ఫింగర్ ఆంగ్లం
2018 అలీఫా ఫాతిమా బెంగాలీ
2018 దౌశోభుజ- ఏ దుర్గాచిత్ర అతిధి పాత్ర
టెలివిజన్
  • కహానీ ఘర్ ఘర్ కీ (స్వాతి)
  • రిష్టే – ఎపిసోడ్ 79

మూలాలు[మార్చు]

  1. "Without discussing with Bickram, I don't take any financial decision: Jaya Seal Ghosh - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 12 October 2020. Retrieved 2022-02-23.
  2. "Jaya Seal Ghosh to perform at ICCR - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2019. Retrieved 2022-02-23.
  3. "Assam: Party not over for Alifa, Jaya Seal yet". NORTHEAST NOW. Archived from the original on 3 July 2018. Retrieved 2022-02-23.
  4. "Jaya Seal Ghosh's big win - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-23.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జయ_సీల్&oldid=4092763" నుండి వెలికితీశారు