జలీల్ ఖాన్
జలీల్ ఖాన్ | |
---|---|
శాసనసభ్యులు, విజయవాడ పశ్చిమ, ఆంధ్ర ప్రదేశ్ | |
In office 2014–2019 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | తారాపేట,విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ | 1954 డిసెంబరు 10
రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్ |
నివాసం | విజయవాడ,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
వెబ్‌సైట్ | http://www.jaleelkhan.com |
జలీల్ ఖాన్ (జ.1954 డిసెంబరు 10)[1] భారత దేశ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనససభ్యునిగా 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు.[2]
అతను 2014 అంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి వి.శ్రీనివాస్ పై తక్కువ మెరజార్టీతో గెలుపొందాడు.[2] [3] 2016 లొ అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. [4] అతను 1999 లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ జేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[3]
అతను మంత్రివర్గ మార్పులలో భాగంగా తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవిని ఆశించినప్పటికీ అది లభించలేదు.[5] అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అతనికి ఎపి వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ప్రతిపాదించాడు. ఇది ముస్లిం మైనారిటీలలో చాలా ప్రముఖ స్థానం.
వివాదాలు
[మార్చు]23 ఏప్రిల్ 2016 న, విజయవాడలోని తారాపేటలో జరిగిన సమావేశంలో మసీదు కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగినప్పుడు చిత్రాలు తీసినందుకు ఒక దినపత్రిక విలేకరిపై దాడి చేయాలని అతను తన అనుచరులను ఆదేశించాడు[6].
27 డిసెంబర్ 2016 న, ఆన్‌లైన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను బి.కామ్‌లో భౌతికశాస్త్రం అభ్యసించానని చెప్పాడు[7]. ఇంటర్వ్యూ లోని ఈ భాగం వైరల్ అయ్యింది. ఒక రాత్రి లో అతను ప్రాచుర్యం పొందాడు. ఈ వీడియోలోని ఆ భాగం, స్పూఫ్‌లు చాలా రోజులు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అతనిపై ఈ రోజు అరకు బి.కాం.ఫిజిక్స్ పై చాలా జోకులు వచ్చాయి.[8] తెలుగు దేశం పార్టీ ఆయనను ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమించింది[9].
మూలాలు
[మార్చు]- ↑ "Jaleel Khan untold Biography". TelanganaNewsPaper. 2016-12-28. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-28.
- ↑ 2.0 2.1 "Vijayawada West Assembly 2014 Election Results". Elections.in. Retrieved 11 October 2014.
- ↑ 3.0 3.1 "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1999". Elections.in. Retrieved 11 October 2014.
- ↑ "Another YSR Congress Legislator Joins TDP In Andhra Pradesh".
- ↑ http://www.deccanchronicle.com/nation/politics/060217/chandrababu-naidu-may-induct-ysrc-turncoats-into-his-cabinet.html
- ↑ "MLA Jaleel Khan in controversy, again! - Times of India".
- ↑ iDream News (3 January 2017). "B.Comలో మ్యాథ్స్, ఫిజిక్స్ రెండు ఉంటాయి - జలీల్ ఖాన్ -- Talking Politics With iDream" – via YouTube.
- ↑ "Vijayawada TD MLA Jaleel Khan's 'B.com physics' video amuses all". 28 December 2016.
- ↑ Telugu Desam Party: Jaleel Khan named new Waqf board ... - https://timesofindia.indiatimes.com › ...