జవహర్‌నగర్ డంపింగ్ యార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు
Typeడంపింగ్ యార్డు
Areas served
ప్రాంతాల సేవలు
Parentజిహెచ్ఎంసీ

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు అనేది తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం, జవహర్‌నగర్‌ లో ఉన్న డంపింగ్ యార్డు. ఈ డంపింగ్‌ యార్డులో దాదాపు 130 ఎకరాల మేర పేరుకుపోయిన చెత్తగుట్ట నుంచి వెలువడే దుర్గంధం, పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చెత్తను క్యాపింగ్‌ చేసి సైంటిఫిక్‌ ల్యాండ్‌ఫిల్‌గా మార్చుతున్నారు.[1] ఈ డంపింగ్ యార్డు చెత్త కుప్పల నుంచి రీ సైస్టెనబులిటీ సంస్థ రోజూ 5 టన్నుల సీఎన్‌జీ బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తుండగా,[2] ఇక్కడినుండి వచ్చే కాలుష్య కారక వ్యర్థ జలాలను జవహర్‌నగర్ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారంలో శుద్ధి చేస్తున్నారు.

ఏర్పాటు, నిర్వహణ[మార్చు]

ఈ డంపింగ్ యార్డు కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 339 ఎకరాల స్థలాన్ని కేటాయించి, హైదరాబాదు నగరంలో నిత్యం వెలువడుతన్న వ్యర్థాలను అక్కడికి తరలించింది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్‌, ట్రాన్స్‌ఫర్‌ పాయింట్స్‌ (ఎస్‌సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తారు. 2007 నుంచి 2012 వరకు సరైన నిర్వహణ లేకపోవడంతో దాదాపు 125 ఎకరాల్లో చెత్త ఏర్పడింది. దీని నిర్వహణ కోసం 2009లో ఓ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్న పలు కారణాలతో 2012 వరకు అమలులోకి రాలేదు. ఆ తరువాత 2012 నుండి వ్యర్థాల నిర్వహణ మొదలైంది.[3]

వ్యర్థాల లీకేజీ[మార్చు]

2012కి ముందు పేరుకుపోయిన చెత్త నుండి దుర్వాసన, హానికర ద్రవ్య వ్యర్థాలు (లీచెట్‌) రావడంతో అక్కడి స్థానికులు అనారోగ్యం బారిన పడ్డారు. అంతేకాకుండా వర్షాకాలంలో చెత్త గుట్టలోకి వరద నీరు చేరడంతో లీచెట్‌ మరింతగా పెరిగి, భూగర్భంతోపాటు పరిసర ప్రాంతాల్లోని చెరువులు కలుషితమయ్యాయి . దాంతో వ్యర్థాలను బయో మైనింగ్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) సూచించింది.[3]

పునరుద్ధరణ[మార్చు]

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ద్వారా 6,500 టన్నుల పైబడి చెత్తతో పాటు, చుట్టూ ప్రక్కల వున్న 17 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా ప్రతిరోజూ 600 టన్నుల చెత్తతో మొత్తం 7వేల టన్నుల వ్యర్థాలు ఇక్కడికి తరలించబడుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత డంపింగ్ యార్డు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులోని మొత్తం 4.44 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 3.40 లక్షల చదరపు మీటర్ల మేర మట్టి పొరను వేశారు.[4]

విద్యుత్తు ఉత్పత్తి[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇక్కడి చెత్తతో తొలి దశలో రోజుకు 1,200 టన్నుల లేదా 19.8 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. రెండవ దశలో సామర్థ్యాన్ని మరో 1,200 టన్నుల లేదా 28 మెగావాట్లకు విస్తరించే అవకాశం కలిగించింది. దక్షిణ భారతదేశంలోని మొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌గా ఇది గుర్తింపు పొందింది.

ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు, జవహర్‌నగర్‌ సమీపంలోని మల్కారం సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేయబడింది. దాదాపు 53,000 టన్నుల వ్యర్థాలను వినియోగించి 2020 ఆగస్టు నుండి 2021 నవంబరు నాటికి 5.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆర్డీఎఫ్‌ (రెఫ్యూస్‌ డెరివుడ్‌ ఫ్యూయల్‌) వ్యర్థాలను వినియోగించి, 185 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయబడింది.[5]

సీఎన్‌జీ బయోగ్యాస్‌[మార్చు]

ఇక్కడి చెత్త కుప్పల నుంచి రీ సైస్టెనబులిటీ సంస్థ రోజూ 5 టన్నుల సీఎన్‌జీ బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తుండగా, అందులో రెండు టన్నుల గ్యాస్‌ను భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ సంస్థకు విక్రయించి, మిగిలిన గ్యాస్‌ను పలు ఇండ్లకు సరఫరా చేస్తున్నది. భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ కంపెనీతో రోజుకు 2 టన్నుల విక్రయానికి సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకొని, చెత్త నుంచి గ్యాస్‌ ఉత్పత్తికి దాదాపు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఒప్పందం మేరకు కేజీ గ్యాస్‌ను రవాణాతో కలిపి రూ. 46 కు విక్రయిస్తున్నది. భారతదేశంలోని మొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌గా ఇది గుర్తింపు పొందింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2023-03-23). "Hyderabad | చెత్త నుంచి బయోగ్యాస్‌ తయారీలో జీహెచ్‌ఎంసీ రికార్డు.. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి రోజూ 5 టన్నుల సీఎన్‌జీ ఉత్పత్తి". www.ntnews.com. Archived from the original on 2023-03-23. Retrieved 2023-08-30.
  2. Correspondent, Special (2021-10-27). "Biogas plant at Jawaharnagar". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2021-10-27. Retrieved 2023-08-30.
  3. 3.0 3.1 ABN (2022-11-18). "Jawaharnagar Dumping Yard: బయో మైనింగ్‌కు బ్రేక్‌!". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-18. Retrieved 2023-08-30.
  4. Correspondent, Special (2018-06-17). "Jawaharnagar dumping yard revamp under way". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2018-06-17. Retrieved 2023-08-30.
  5. Today, Telangana (2020-11-05). "Waste-to-energy plant soon at Jawaharnagar dump yard". Telangana Today. Archived from the original on 2020-11-04. Retrieved 2023-08-30.
  6. "'వేస్ట్‌ టు వెల్త్‌'లో హైదరాబాద్‌ మరో ముందడుగు". Sakshi. 2021-10-27. Archived from the original on 2021-10-27. Retrieved 2023-08-30.
  7. "First-of-a-kind biogas plant begins ops at Jawaharnagar dumpyard". The New Indian Express. 2021-10-27. Archived from the original on 2021-10-27. Retrieved 2023-08-30.