జవహర్‌నగర్ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవహర్‌నగర్ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం
Typeశుద్ధి కర్మాగారం
Foundersతెలంగాణ ప్రభుత్వం
Areas served
ప్రాంతాల సేవలు
Productsచక్కెర
Parentజిహెచ్ఎంసీ

జవహర్‌నగర్ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం అనేది తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం, జవహర్‌నగర్‌ లో ఉన్న వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కర్మాగారంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుండి వచ్చే కాలుష్య కారక వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు.

నిర్మాణం[మార్చు]

నగరంలో కొన్నేండ్లుగా పేరుకుపోయిన లిక్విడ్‌ వేస్ట్‌ (లీచెట్‌) శుద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్‌) శుద్ధి ప్లాంట్‌ను 250 కోట్ల రూపాయలతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్‌డీల సామర్థ్యంతో 2020లో నిర్మాణం ప్రారంభించి, 2022 చివర్లో పూర్తిచేసింది.

2017లో ప్రారంభించిన మొబైల్‌ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2వేల కిలోలీటర్ల కెపాసిటీతో పాక్షిక ట్రీట్‌మెంట్‌ పరిషారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రోజుకు 4వేల కిలోలీటర్లకు పెంచారు. ఆ తరువాత వ్యర్థ జలాలు నిండిన మలారం చెరువులోని దాదాపు 11.67 లక్షల కిలోలీటర్ల నీటిని శుద్ధి ప్రారంభమై, చెరువులోని వ్యర్థ జలాలు పొంగిపొర్లకుండా సుమారు 4 కోట్ల 35 లక్షలతో స్ట్రామ్‌ వాటర్‌ డైవర్షన్‌ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది.[1]

ప్రారంభం[మార్చు]

2023 ఏప్రిల్ 15న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలోని ఈ కర్మాగారాన్ని ప్రారంభించాడు. ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖామంత్రి సిహెచ్ మల్లారెడ్డి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, కార్పోరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.[2]

ఫలితాలు[మార్చు]

సంవత్సరకాలంగా జరిగిన పనుల్లో భాగంగా మలారం చెరువు 43% శుద్ధి పూర్తయింది. మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేయగా, పేరుకుపోయిన మురికిని శుద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "Jawahar Nagar woes will end in 1 year: KT Rama Rao on new leachate plant in Hyderabad". The Times of India. 2023-04-16. ISSN 0971-8257. Archived from the original on 2023-04-16. Retrieved 2023-04-18.
  2. telugu, NT News (2023-04-15). "Minister KTR | జవహర్‌నగర్‌ దుర్గంధానికి చెక్‌.. డంపింగ్‌ యార్డ్‌లో లిక్విడ్‌ వేస్ట్‌ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-18.
  3. "KTR to launch new treatment plant at Jawaharnagar today". www.deccanchronicle.com. 2023-04-15. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-18.