జవ్వాది రామారావు
స్వరూపం
జవ్వాది రామారావు | |
---|---|
జననం | 1941 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు |
తల్లిదండ్రులు | హనుమయ్య, ఆదెమ్మ |
జవ్వాది రామారావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు. 1960లో రాఘవ కళానిలయం అనే నాటక సంస్థ ను స్థాపించి అనేక నాటక, నాటికలను ప్రదర్శించి బహుమతులను అందుకున్నాడు.[1]
జననం
[మార్చు]రామారావు 1941లో హనుమయ్య, ఆదెమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి లో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]ఉద్ధరింపు నాటికతో చిన్న వయసులోనే రంగస్థల ప్రవేశం చేసిన రామారావు, 1960లో రాఘవ కళానిలయం అనే నాటక సంస్థను స్థాపించి పతిత, కళ్లు, ప్రశ్న, నూటపదహారు, అన్వేషణ వంటి నాటక, నాటికలను ప్రదర్శించి బహుమతులను అందుకున్నాడు. 1972లో నిడదవోలు లో కోడూరి అచ్చయ్య కళామందిరం పేరుతో ఒక ఆరుబయట రంగస్థలాన్ని నిర్మించాడు. రాఘవ కళానియలం వార్షికోత్సవ సందర్భంలో ప్రతి సంవత్సరం కళాకారులను సత్కరించారు.
సన్మానాలు - సత్కారాలు
[మార్చు]- రంగస్థల కృషివలుడు పురస్కారం (1996) - చిలకలూరిపేట సాంస్కృతిక సంస్థ
- కళాసాగర్ (1977) పురస్కారం - మద్రాస్
- గరికపాటి రాజారావు పురస్కారం - మద్రాస్ తెలుగు అకాడమీ
- కళాభారతి సత్కారం - మద్రాస్
- జూలూరు వీరేశలింగం పురస్కారం (1985) - శ్రీకళానికేతన్, హైదరాబాద్
- నటరత్న పురస్కారం - యువకళావాహిని, హైదరాబాద్
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.526.