Jump to content

జహంగీర్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
జహంగీర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ జహంగీర్ ఖాన్
పుట్టిన తేదీ(1910-02-01)1910 ఫిబ్రవరి 1
బస్తీ ఘుజాన్, జలంధర్, పంజాబ్
మరణించిన తేదీ1988 జూలై 23(1988-07-23) (వయసు 78)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 3)1932 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 4 111
చేసిన పరుగులు 39 3,327
బ్యాటింగు సగటు 5.57 22.32
100లు/50లు 0/0 4/7
అత్యధిక స్కోరు 13 133
వేసిన బంతులు 606 8,314
వికెట్లు 4 328
బౌలింగు సగటు 63.75 25.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 4/60 8/33
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 82/–
మూలం: ESPNCricinfo, 2020 మే 9

డా. మొహమ్మద్ జహంగీర్ ఖాన్ (1910 ఫిబ్రవరి 1 – 1988 జూలై 23) స్వతంత్ర్యానికి పూర్వం భారతదేశానికి క్రికెట్ అడాడు. స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్‌లో క్రికెట్ నిర్వాహకుడిగా పనిచేసాడు.[1] అతను లాహోర్ లోని ఇస్లామియా కాలేజీ నుండి గ్రాడ్యుయేషను చేసాడు.

క్రికెట్ కెరీర్

[మార్చు]

పష్టూన్ కుటుంబానికి చెందిన జహంగీర్ ఆరడుగుల ఎత్తు మనిషి. మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. అతను ప్రసిద్ధ క్రికెట్ కుటుంబం నుండి వచ్చాడు. పాకిస్తాన్ కెప్టెన్లు బాకా జిలానీ, ఇమ్రాన్ ఖాన్, జావేద్ బుర్కీ, మాజిద్ ఖాన్‌లను తయారు చేసాడు. మాజిద్ ఖాన్‌ అతని కుమారుడే. మాజిద్ కుమారుడు బాజిద్ ఖాన్ కూడా 2005లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. హెడ్లీస్ తర్వాత వరుసగా మూడు తరాల టెస్ట్ క్రికెటర్లను కలిగి ఉన్న కుటుంబం ఇది. బాకా జిలానీ డాక్టర్ మొహమ్మద్ జహంగీర్ ఖాన్‌కు బావ. అతను కూడా టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

జహంగీర్ ఫస్ట్ క్లాస్ ప్రవేశం చేసిన మ్యాచ్‌లో 108 పరుగులు చేసి, మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. అతను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొట్టమొదటి టెస్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పర్యటన తర్వాత, అతను తిరిగి ఇంగ్లాండ్‌లో ఉండి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ తీసుకున్నాడు. అతను మిడిల్ టెంపుల్ నుండి ఫైనల్ బార్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఆ సమయంలో అతను నాలుగేళ్ల పాటు క్రికెట్‌లో కేంబ్రిడ్జ్ బ్లూ. అతను జెంటిల్‌మెన్ v ప్లేయర్స్ మ్యాచ్‌లలో కూడా రెండుసార్లు ఆడాడు. 1935లో భారత జింఖానా తరఫున ఆడిన అతను రెండు నెలల్లో 70 సగటుతో 1380 పరుగులు చేశాడు.

1936లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు జట్టులో చేరి మూడు టెస్టుల్లోనూ ఆడాడు. అతను కేంబ్రిడ్జ్‌లో ఉన్న సమయంలో అతని అత్యుత్తమ బౌలింగ్ ఛాంపియన్ కౌంటీ యార్క్‌షైర్‌పై 58 పరుగులకు 7 వికెట్లు సాధించడం. తిరిగి భారతదేశంలో, అతను 1939లో బాంబే పెంటాంగ్యులర్‌లో ఆడాడు. జహంగీర్ 1940-41లో సిలోన్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అది యుద్ధం కారణంగా రద్దైంది.[2]

సెలెక్టరుగా

[మార్చు]

జహంగీర్ 1939-40, 1941-42 మధ్య సెలెక్టరుగా ఉన్నారు. 1947 లో పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత, అక్కడ సెలెక్టరుగా పనిచేశాడు. 1960-1961లో భారత్‌లో పర్యటించిన జట్టుకు మెనేజరుగా ఉన్నాడు. అతను కళాశాల ప్రిన్సిపాలుగా పదవీ విరమణ ఏఛ్సే ముందు పాకిస్తాన్‌లో విద్యా డైరెక్టర్‌గా పనిచేశాడు. 1983లో జలంధర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ జరిగినపుడు, జహంగీర్‌ను మ్యాచ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అతని చిన్న రోజుల్లో, అతను భారతదేశంలో ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ కూడా. అతను 1932లో AAA, 1934లో లండన్‌లో జరిగిన బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

లార్డ్స్ పిచ్చుక

[మార్చు]

ఖాన్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ తరపున క్రికెట్ ఆడాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 1936 జూలై 26 న M.C.Cతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అతను టామ్ పియర్స్‌కి ఒక డెలివరీని వేశాడు. అది గాల్లో వెళ్తూ ఒక పిచ్చుకకు తగిలగా, అది చచ్చిపోయింది. ఆ పిచ్చుకను, బంతినీ ఒక స్తంభంపై అమర్చి, ఇప్పుడు M.C.C మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. M.C.C లో హెరిటేజ్ కలెక్షన్స్ హెడ్ అయిన నీల్ రాబిన్సన్, "ప్రజలు మ్యూజియంలో బంతులు, బ్యాట్లు, చేతి తొడుగులు చూడాలని ఆశిస్తారు, పిచ్చుకను కాదు" అని అంటూ "ఈ కథ తెలియని వారికి ఇది ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది." అన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Jahangir Khan". ESPN Cricinfo. Retrieved 9 May 2020.
  2. Indian Express, 25 July 1988