జాతీయ గణిత దినోత్సవం
జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రారంభం[మార్చు]
2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.
కార్యక్రమాలు[మార్చు]
డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు.[1]
గుర్తింపు[మార్చు]
సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.[2] 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ C Jaishankar (27 December 2011). "Ramanujan's birthday will be National Mathematics Day". The Hindu. Retrieved 22 December 2018.
- ↑ "PM's speech at the 125th Birth Anniversary Celebrations of ramanujan at Chennai". Prime Minister's Office, Government of India. Archived from the original on 29 జూలై 2012. Retrieved 22 డిసెంబరు 2018.
- ↑ "Math park set up government school to innovate teaching techniques" by Neel Kamal, The Times of India, 22 December 2018