జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (న్యాక్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ మదింపు , గుర్తింపు సంస్థ
సంస్థ అవలోకనం
స్థాపనం 1994; 30 సంవత్సరాల క్రితం (1994)
అధికార పరిధి  India
ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
నినాదం శ్రేష్ఠత • విశ్వసనీయత • ఔచిత్యం
మాతృ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ
Parent Agency యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం)

జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (ఆంగ్లం: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)) అనేది భారతదేశంలోని ఒక ప్రభుత్వ సంస్థ, ఇది ఉన్నత విద్యా సంస్థలను (HEIs) మదింపు చేసి, తగిన గుర్తింపులనిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇది ఒక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ.[1]

చరిత్ర

[మార్చు]

జాతీయ విద్యా విధానం - 1986 సిఫార్సులకు అనుగుణంగా 1994లో NAAC స్థాపించబడింది. ఈ విద్యా విధానం "విద్యా నాణ్యతలో క్షీణత సమస్యలను పరిష్కరించడం" పైన దృష్టి సారించి, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ (POA-1992) స్వతంత్ర జాతీయ అక్రిడిటేషన్ బాడీని ఏర్పాటు చేయడంతో సహా నూతన విద్యా విధానాల కోసం వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించింది. తత్ఫలితంగా, 1994లో బెంగళూరులో NAAC ప్రధాన కార్యాలయం స్థాపించబడింది.[2][3]

గ్రేడింగ్

[మార్చు]

NAAC ఎనిమిది పాయింట్స్ గ్రేడింగ్ ద్వారా ఇన్‌స్టిట్యూట్‌లను గ్రేడ్ చేస్తుంది:[4]

సంస్థాగత CGPA పరిధి లెటర్ గ్రేడ్ పనితీరు వివరణ
3.51 – 4.05 A++ గుర్తింపు పొందింది
3.26 – 3.50 A+ గుర్తింపు పొందింది
3.01 – 3.25 A గుర్తింపు పొందింది
2.76 – 3.00 B++ గుర్తింపు పొందింది
2.51 – 2.75 B+ గుర్తింపు పొందింది
2.01 – 2.50 B గుర్తింపు పొందింది
1.51 – 2.00 C గుర్తింపు పొందింది
≤ 1.50 D గుర్తింపు పొందలేదు

గుర్తింపులు

[మార్చు]

2021 డిసెంబరు నాటికి, 655 విశ్వవిద్యాలయాలు, 13316 కళాశాలలు NAACచే గుర్తింపు పొందాయి.

ఫలితాలు

[మార్చు]

ప్రముఖ కళాశాలల గుర్తింపు వివరాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.

ప్రముఖ గుర్తింపు పొందిన కళాశాలలు
విశ్వవిద్యాలయం/కళాశాల రాష్ట్రం CGPA గుర్తింపు చెల్లు చివరి తేదీ
ప్రభుత్వ మోహింద్రా కళాశాల పంజాబ్ 3.86 18/02/2021
బి.ఎమ్.ఎస్. ఇంజనీరింగ్ కళాశాల కర్ణాటక 3.83 27/03/2024
సుబోధ్ కళాశాల రాజస్థాన్ 3.82 29/10/2024
న్యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్, అహ్మద్‌నగర్ మహారాష్ట్ర 3.79 29/10/2022
KTHM కళాశాల, నాసిక్ మహారాష్ట్ర 3.79 29/10/2024
St. జోసెఫ్ కళాశాల, బెంగళూరు కర్ణాటక 3.79 29/10/2024
St. జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా పశ్చిమ బెంగాల్ 3.77 22/01/2024
కాటన్ కాలేజ్, గౌహతి అస్సాం 3.76 04/11/2021
St. జోసెఫ్ కళాశాల, దేవగిరి కేరళ 3.76 15/09/2023
హోలీ క్రాస్ కళాశాల, తిరుచిరాపల్లి తమిళనాడు 3.75 13/02/2027
దేవగిరి కళాశాల, ఔరంగాబాద్ మహారాష్ట్ర 3.75 16/03/2021
VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తెలంగాణ 3.73 15/08/2023
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్ తెలంగాణ 3.14 29/08/2027
లయోలా కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కేరళ 3.72 09/12/2021
St. ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంగళూరు కర్ణాటక 3.71 09/12/2021

మూలాలు

[మార్చు]
  1. "NAAC - Home". www.naac.gov.in. Retrieved 2020-12-12.
  2. "NAAC - An Overview", National Assessment and Accreditation Council, archived from the original on 2012-03-25, retrieved 2012-04-10
  3. "Higher Education in India". Government of India Ministry of Human Resource Development Department of Higher Education. Archived from the original on 2011-07-18.
  4. "Assessment Outcome". www.naac.gov.in.