వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్
నినాదం | వంద పువ్వులు వికసించనీ, వంద ఆలోచనలు విరజిల్లనీ |
---|---|
రకం | ప్రభుత్వ డిగ్రీ కళాశాల |
స్థాపితం | 1966 |
ప్రధానాధ్యాపకుడు | డా. జి సుకన్య |
స్థానం | విద్యానగర్, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
అనుబంధాలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విజిడిసి) , హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల విద్యానగర్ ప్రాంతంలో ఉంది. ఇది హైదరాబాద్‌లోని పురాతన ఉన్నత విద్యా సంస్థలలో ఒకటి.
చరిత్ర
[మార్చు]ఈ కళాశాల 1966 సంవత్సరంలో స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ (ఎస్ వి ఇ ఎస్) తెలుగు కళాశాల పేరుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షతన స్థాపించబడింది. ఎస్ వి ఇ ఎస్, తెలుగు కలశాల అనేది ఆర్ట్స్, కామర్స్‌లలో పియుసి, యుజి కోర్సులను అందించే ఒక మిశ్రమ కళాశాల. ఇది 1982లో ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళాక ఎస్ వి ఇ ఎస్ ప్రభుత్వ తెలుగు కళాశాల (సాయంత్రం) గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా, కళాశాలను 1990లో ఉదయపు కళాశాలగా మార్చి, వివేకానంద ప్రభుత్వ కళాశాల, విద్యానగర్ అని పేరు పెట్టారు. 2002లో, పియుసి రెండుగా విభజించబడటం వలన, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చి, బిఎస్సి, లైఫ్సైన్సెస్ కోర్సులను చేర్చారు. 1970లో యూజీసీ చట్టంలోని 2 (ఎఫ్), 12 (బి) ప్రకారం కళాశాలకు ప్రభుత్వ గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఇది దాదాపు 1700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి అవసరమయిన సౌకర్యాలను అందిస్తుంది.[1]
న్యాక్ గుర్తింపు
[మార్చు]కళాశాలకు 2022 సంవత్సరంలో న్యాక్ చే 'A' గ్రేడ్‌లో 3.14 సీజీపీఏతో గుర్తింపు లభించింది.
ప్రస్తుత సౌకర్యాలు
[మార్చు]కళాశాల, విశాలమైన ఆట మైదానం కలిగి, భవనం మూడు బ్లాకులలో తరగతి గదులు, ప్రయోగశాలలు, రీడింగ్ రూమ్, ఇ-కార్నర్‌తో కూడిన లైబ్రరీ, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ (టిఎస్ కేసి), మన టివి, ఎన్ ఎస్ ఎస్ వంటివి కలిగి ఉంది.[2]
కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్
[మార్చు]రెండు కంప్యూటర్ లాబ్స్ కలిగి ఉంది . ఆరుగురు టీచింగ్ స్టాఫ్ ఉన్నారు .
కోర్సులు
[మార్చు]కళాశాల 2016-17 విద్యా సంవత్సరం నుండి ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ని స్వీకరించింది. 2018-19 విద్యా సంవత్సరంలో బిఎ, బికాం, బీఎస్సి, లైఫ్ సైన్సెస్ లలో కొత్త యుజి ప్రోగ్రామ్‌లను ప్రవేశ పెట్టారు. 2019-20లో, మూక్స్ కోర్సుతో పాటు బీబీఏ కూడా ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం కళాశాల బిఎ, బికాం, బిఎస్సిలలో యూజీ ప్రోగ్రామ్‌లను, సహ-పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలు, విలువ ఆధారిత, నైపుణ్యం-ఆధారిత విద్యను విద్యార్థులకు అందిస్తుంది.
కళాశాల సిబ్బంది
[మార్చు]ఒక ప్రిన్సిపాల్, 36 మంది టీచింగ్ స్టాఫ్, ఒక లైబ్రేరియన్, ఒక ఫిజికల్ డైరెక్టర్, 23 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రస్తుతం ఈ కళాశాలలో పనిచేస్తున్నారు.
కళాశాల నినాదం
[మార్చు]"వంద పువ్వులు వికసించనీ, వంద ఆలోచనలు విరజిల్లనీ"[3]
మూలాలు
[మార్చు]- ↑ "వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర". vivekanandagdc.in. Archived from the original on 2021-11-04. Retrieved 2021-11-04.
- ↑ "వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల". ఫేస్ బుక్ పేజీ.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల". జాలగూడు. Archived from the original on 2021-11-04. Retrieved 2021-11-04.