జాతీయ రహదారి 716జి
National Highway 716G | ||||
---|---|---|---|---|
కదిరి–జమ్మలమడుగు రోడ్డు కదిరి–హిందూపురం రోడ్డు | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 172.5 కి.మీ. (107.2 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | ముద్దనూరు | |||
కదిరి | ||||
పశ్చిమం చివర | హిందూపురం | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | పులివెందుల, కదిరి, గోరంట్ల | |||
Municipalities | కదిరి | |||
రహదారి వ్యవస్థ | ||||
State Highways in | ||||
|
జాతీయ రహదారి 716జి (ఎన్‌హెచ్ 716జి) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. తూర్పు ముగింపు కడప జిల్లాలోని చిన్న పట్టణమైన ముద్దనూరులో ఎన్‌హెచ్ 716 వద్ద, పశ్చిమ ముగింపు హిందూపూర్ సమీపంలో ఎన్‌హెచ్ 544ఇ వద్ద ఉన్నాయి. కదిరి నుండి ఉద్భవించిన రెండు రాష్ట్ర రహదారుల - ఎస్‌హెచ్ 60: కదిరి-జమ్మలమడుగు రోడ్డు, ఎస్‌హెచ్ 61: కదిరి-హిందూపూర్ రోడ్డు - కలయికతో ఈ జాతీయ రహదారి రూపొందింది.[1]
మార్గం
[మార్చు]ఇది పులివెందుల, కదిరి (ఎన్‌హెచ్ 42 తో కూడలి), ఓబులదేవరచెరువు, గోరంట్ల, పాలసముద్రం గుండా వెళుతుంది.
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 716 ముద్దనూరు వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 42 కదిరి వద్ద
- ఎన్‌హెచ్ 544E హిందూపురం వద్ద ముగింపు
నిర్మాణం
[మార్చు]ఎన్‌హెచ్ 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించడానికి ₹ 1080.91 కోట్ల బడ్జెట్‌తో మంజూరైంది.[2]
బి. కొత్తపల్లి జంక్షన్ నుండి గోరంట్ల (కదిరి బైపాస్ మినహా) వరకు నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ, పునర్నిర్మాణం (ముద్దనూరు-హిందూపూర్) కోసం ₹ 839.98 కోట్లను మంజూరు చేసారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Khan, Patan. "List of state highways in Andhra Pradesh" (PDF). Archived from the original (PDF) on 20 September 2018.
- ↑ Khan, Patan. "Upgradation of nh 716g to six lane".
- ↑ Khan, patan. "Upgradation of road to four lane".