బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI)
పొడవు518 కి.మీ. (322 మై.)
Existed2026/27[1]–present
ముఖ్యమైన కూడళ్ళు
West చివర1. ఎన్‌హెచ్-44, బెంగళూరు, కర్ణాటక
2. కోడికొండ, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్
East చివర1. ఎన్‌హెచ్-16, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
2. అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుKarnataka, Andhra Pradesh
Districtsకర్ణాటక: బెంగళూరు పట్టణ జిల్లా, బెంగళూరు గ్రామీణ జిల్లా, చిక్కబళ్ళాపుర జిల్లా
ఆంధ్రప్రదేశ్: శ్రీ సత్యసాయి జిల్లా, బాపట్ల జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా,ఎన్.టి.ఆర్ జిల్లా[2]
Townsబెంగళూరూ,చిక్కబళ్ళాపూర్,కోడికొండ,గోరంట్ల, పులివెందుల, మైదుకూరు, కడప, మల్లేపల్లె, వంగపాడు, అద్దంకి, గుంటూరు, మంగళగిరి, అమరావతి, విజయవాడ[3]
రహదారి వ్యవస్థ

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే, నిర్మాణంలో ఉన్న 518 కి.మీ. (322 మై.) -పొడవైన, ఆరు-వరుసల యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడ నగరాల మధ్య ఉంటుంది. దీన్ని దీనిని బెంగళూరు-కడప-విజయవాడ (BKV) ఎక్స్‌ప్రెస్‌వే అనీ, NH-544G అనీ కూడా అంటారు. ఇది కర్ణాటకలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల గుండా వెళ్తుంది. ఇది బెంగళూరు నుండి వచ్చే జాతీయ రహదారి 44 (NH-44) లో, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ వద్ద బయలుదేరి, రాయలసీమ ప్రాంతం గుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద జాతీయ రహదారి 16 (NH-16) వద్ద ముగుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు సుమారు 624 కి.మీ. (388 మై.) . దీన్ని భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) నిర్మించి నిర్వహిస్తుంది. కడప గుండా వెళ్ళడం వలన ఈ రహదారిని బెంగళూరు కడప విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే (BKV ఎక్స్‌ప్రెస్‌వే) అని కూడా అంటారు.[4]

ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు బ్రౌన్‌ఫీల్డ్, ఒక గ్రీన్‌ఫీల్డ్ విభాగం ఉంటాయి. వీటిలో 343 కి.మీ. (213 మై.) ఉన్నాయి -కొడికొండ నుండి అద్దంకి వరకు పొడవైన ప్రధాన భాగం గ్రీన్‌ఫీల్డ్‌ విభాగం. బెంగళూరు-కోడికొండ, అద్దంకి-విజయవాడ భాగాలు, బ్రౌన్‌ఫీల్డ్‌ విభాగాలు. ఈ ప్రాజెక్టు భారతమాల రెండవ దశలో భాగం. ఎక్స్‌ప్రెస్‌వే యొక్క మొత్తం 14 ప్యాకేజీలను 2023 ఫిబ్రవరిలో కాంట్రాక్టర్‌లకు అప్పగించిన తర్వాత, ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు 2023 మార్చి నుండి కొనసాగుతున్నాయి. 2024 మార్చి 11న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేసాడు. ఇది 2026/27 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులలో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, హైవేల పరిమిత సామర్థ్యాల కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి తూర్పు, ఈశాన్య భారతదేశాలకు మంచి రవాణా సౌకర్యం అవసరం ఉంది. బెంగళూరు నుండి తూర్పు ఈశాన్య ప్రాంతాలకు వెళ్ళేందుకు, చెన్నై ద్వారా లేదా జాతీయ రహదారి 16 (NH-16) ద్వారా విజయవాడ చేరుకోవడానికి ప్రస్తుతం 12-13 గంటల సమయం పడుతుంది. అందువల్ల, 2021 లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెంగళూరు, విజయవాడలను కలుపుతూ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించింది. అదే సంవత్సరం ఆగస్టులో ఈ ప్రణాళికను భారత ప్రభుత్వం ఆమోదించింది.[5] ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా 360 కి.మీ. (220 మై.) దూరం సరికొత్త రహదారి కాగా, మిగిలినది ప్రస్తుత జాతీయ రహదారుల ద్వారా వెళ్తుంది. దీన్ని 10 వేల కోట్ల అంచనాతో నిర్మిస్తారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 3 గంటలు, దూరం కనీసం 75 కి.మీ. (47 మై.) తగ్గుతుంది. 2022 సెప్టెంబరులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తొలి ప్రణాళికను సవరించి, దీన్ని జాతీయ రహదారి 544G (NH-544G) గా ప్రకటించి, 2022 డిసెంబరులో దీని నిర్మాణానికి టెండర్‌లను ఆహ్వానించడం ప్రారంభించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు 19,320 crore (US$2.4 billion) అంచనా వ్యయంతో నిర్మిస్తారు. మొత్తం నిడివి 624 కి.మీ. (388 మై.) ఉంటుంది. దీనిలో 518 కి.మీ. (322 మై.) ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ విభాగంగా ఉంటుంది, మిగిలిన బ్రౌన్‌ఫీల్డ్ భాగాలు ప్రస్తుత జాతీయ రహదారుల గుండా వెళ్తాయి.[6][7]

2023 ఫిబ్రవరి నాటికి గ్రీన్‌ఫీల్డ్ విభాగంలో మొత్తం 14 ప్యాకేజీలు విడుదల చేసారు. 2023 మార్చి నుండి సన్నాహక పనులు మొదలయ్యాయి. 2024 మార్చి 11న ప్రధాని నరేంద్ర మోదీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ 14 వేల కోట్లుగా సవరించారు. ఇది 2026/27 నాటికి పూర్తవుతుందని అంచనా వేసారు.

మార్గం

[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ వద్ద, జాతీయ రహదారి 44 (NH-44) నుండి మొదలౌతుంది. అక్కడి నుండి, రాయలసీమ, ప్రకాశం జిల్లా పొదిలి గుండా వెళ్ళి, ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద, విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 16 (NH-16) తో కలుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల లోని క్రింది పట్టణాల గుండా వెళుతుంది.

కర్ణాటక

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని 14 ప్యాకేజీలుగా విభజించింది. ఈ ప్యాకేజీల్లో కొడికొండ నుండి అద్దంకి వరకు 343 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ విభాగం మాత్రమే ఉంది. 2022 సెప్టెంబరులో నిర్మాణం కోసం NHAI, బిడ్‌లను ఆహ్వానించింది. 2023 జనవరిలో, మొదటి నాలుగు ప్యాకేజీల కోసం పాల్గొన్న 13 మంది బిడ్డర్‌లలో, దిలీప్ బిల్డ్‌కాన్, రాజ్ పథ్ ఇన్‌ఫ్రాకాన్‌లు గెలుచుకున్నాయి. వీటిలో దిలీప్ బిల్డ్‌కాన్ మొదటి. నాల్గవ ప్యాకేజీల టెండర్‌లను గెలుచుకోగా, రాజ్ పథ్ ఇన్‌ఫ్రాకాన్ రెండవ, మూడవ ప్యాకేజీలు సాధించింది. 2023 ఫిబ్రవరిలో చివరి ప్యాకేజీకి సంబంధించిన చివరి టెండరు మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కి దక్కింది. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతం యొక్క స్థలాకృతి ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు-కొడికొండ నుండి అద్దంకి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఒకటి కాగా, బెంగళూరు విజయవాడల మధ్య ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ జాతీయ రహదారి రెండవది. ఎక్స్‌ప్రెస్ వేలో లేన్‌లు 3.75 మీ. (12.3 అ.) వెడల్పుతో ఉంటాయి. ఇరువైపులా 3 మీ. (9.8 అ.) పక్కా రోడ్డు గాని, 2 మీ. (6 అ. 7 అం.) కచ్చా రోడ్డు గానీ ఉంటుంది. మధ్యలో 19.5 మీ. (64 అ.) వెడల్పుతో, పల్లంగా ఉండే మీడియన్ ఉంటుంది. ఈ హైవేని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో నిర్మిస్తారు. 2024 మార్చి నాటికి, నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు జరుగుతున్నాయి.పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కింది పట్టిక ప్యాకేజీలు, కాంట్రాక్టర్లు, ప్రస్తుత స్థితిని చూపిస్తుంది.[7][8][9][10]

ప్యాకేజీలు మార్గం [a] కాంట్రాక్టర్ స్థితి
ప్యాకేజీ-1 కోడూర్ నుండి వనవోలు శ్రీ సత్యసాయి జిల్లా style="background:#FFB;vertical-align:middle;text-align:center; " class="table-partial"|Under construction
ప్యాకేజీ-2 వనవోలు నుండి వంకరకుంట, శ్రీ సత్యసాయి జిల్లా style="background:#FFB;vertical-align:middle;text-align:center; " class="table-partial"|Under construction
ప్యాకేజీ-3 వంకరకుంట నుండి ఒడుళపల్లి,కడప జిల్లా style="background:#FFB;vertical-align:middle;text-align:center; " class="table-partial"|Under construction
ప్యాకేజీ-4 ఒడుళపల్లి నుండి నల్లచెరువుపల్లి style="background:#FFB;vertical-align:middle;text-align:center; " class="table-partial"|Under construction
ప్యాకేజీ-5 నల్లచెరువుపల్లి నుండి ఎర్రగుడిపాడు మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-6 యెర్రగుడిపడు నుండి ఆడిరెడ్డిపల్లె మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-7 ఆడిరెడ్డిపల్లె నుండి మల్లెపల్లి దిలీప్ బిల్డ్కాన్ భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-8 మల్లెపల్లి నుండి కవులకుంట్ల మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-9 కావులకుంట్ల నుండి నారాయణపేట,నెల్లూరు జిల్లా మాక్స్ ఇన్ఫ్రా (బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-10 నారాయణపేట నుండి చంద్రశేఖరపురం,ప్రకాశం జిల్లా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-11 చంద్రశేఖరపురం నుండి పోలవరం ప్రకాశం జిల్లా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-12 పోలవరం నుండి మర్రిపూడి ప్రకాశం జిల్లా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-13 మర్రిపూడి నుండి సోమవరప్పాడు, బాపట్ల జిల్లా కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ భూసేకరణ పూర్తయింది.
ప్యాకేజీ-14 సోమవరప్పాడు నుండి ముప్పవరం మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎమ్. ఇ. ఐ. ఎల్.) భూసేకరణ పూర్తయింది.

ప్రాజెక్టు ప్రస్థానం

[మార్చు]
  • 2021: ఎక్స్‌ప్రెస్ వే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కి ప్రకటించింది.[5]
  • 2021 ఆగస్టు: ఎక్స్‌ప్రెస్‌వే ప్లాన్‌ను భారత ప్రభుత్వం ఆమోదించి, దీనిని భారతమాలలో చేర్చారు.
  • 2022 సెప్టెంబరు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎక్స్‌ప్రెస్ వే యొక్క తొలి ప్రణాళిక సవరించి, దీన్ని జాతీయ రహదారి 544G (NH-544G)గా ప్రకటించింది. దాని నిర్మాణానికి సాంకేతిక బిడ్‌లను ఆహ్వానించడం మొదలుపెట్టింది.
  • 2022 డిసెంబరు: నిర్మాణం లోని ప్రధాన ప్యాకేజీల కోసం NHAI బిడ్‌లను ఆహ్వానించింది. భూసేకరణ కూడా మొదలైంది.[7]
  • 2023 జనవరి: 13 మంది బిడ్డర్లలో, ఎక్స్‌ప్రెస్‌వే లోని మొదటి నాలుగు ప్యాకేజీలను దిలీప్ బిల్డ్‌కాన్, రాజ్ పథ్ ఇన్‌ఫ్రాకాన్‌లకు దక్కాయి.[8][9]
  • 2023 ఫిబ్రవరి: చివరి ప్యాకేజీ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)కి దక్కింది.[10]
  • 2023 మార్చి: ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం సన్నాహక పనులు ప్రారంభమయ్యాయి.
  • 2024 మార్చి: ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11 న ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసాడు. కొన్ని విభాగాలలో నిర్మాణం మొదలైంది. 2026/27 నాటికి పూర్తవుతుందని అంచనా వేసారు.[11]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. Distances from the origin of the expressway, i.e., Kodur (Kodikonda).

మూలాలు

[మార్చు]
  1. "PM Modi launches projects Rs 1 lakh crore in Haryana; lays foundation stone for several road works". Deccan Herald (in ఇంగ్లీష్). 11 March 2024. Retrieved 14 March 2024. The prime minister also laid the foundation stone for various NH projects across the country. These include 14 packages of Bengaluru - Kadappa - Vijayawada Expressway worth Rs 14,000 crore in Andhra Pradesh.
  2. "Bangalore–Vijayawada Expressway – Information & Status". The Metro Rail Guy. Retrieved 14 March 2024.
  3. "Green signal to new Vijayawada-Bengaluru expressway". The Times of India (in ఇంగ్లీష్). 21 January 2023. Retrieved 18 February 2024.
  4. Thadhagath, Venkata Pathi (21 January 2023). "Bengaluru to Vijayawada in 5 hours on this proposed new highway. Details here". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 18 February 2024.
  5. 5.0 5.1 "AP plans 660 km Bengaluru-Vijayawada e-way project". NBM&CW (in ఇంగ్లీష్). Retrieved 14 March 2024.
  6. Janyala, Sreenivas (30 September 2022). "New highway to cut Vijayawada-Bengaluru travel time by 5 hours: Here are the details". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 March 2024.
  7. 7.0 7.1 7.2 C.S., Yamini (3 December 2022). "NHAI floats tender for Vijayawada-Bengaluru expressway, travel in 6 hrs: Report". The Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 14 March 2024.
  8. 8.0 8.1 "13 Bidders for Bangalore-Vijayawada Expressway's Construction Work". The Metro Rail Guy (in ఇంగ్లీష్). 1 January 2023. Retrieved 14 March 2024.
  9. 9.0 9.1 "DBL & Raj Path Win Bangalore-Vijayawada Expressway's Contracts". The Metro Rail Guy (in ఇంగ్లీష్). 28 January 2023. Retrieved 14 March 2024.
  10. 10.0 10.1 "Megha & KNR Win Bangalore-Vijayawada Expressway's Contracts". The Metro Rail Guy (in ఇంగ్లీష్). 28 February 2023. Retrieved 14 March 2024.
  11. "PM Modi Inaugurates, Lays Foundation Stone For 112 National Highway Projects" (in ఇంగ్లీష్). 11 March 2024. Retrieved 14 March 2024. Prime Minister Modi also laid the foundation stone for various National Highway projects across the country. Major projects for which the foundation stone was laid by the Prime Minister included 14 packages of Bengaluru - Kadappa - Vijayawada Expressway worth ₹ 14,000 crores in Andhra Pradesh.