ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)
ఈ జాబితా 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితా గురించి, భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం ద్వారా ఈ గణాంకాలు నిర్వహించబడ్డాయి.2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించిన జనాభా కలిగియున్న జనావాస ప్రాంతాలను నగరం అని నిర్వచించారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 నగరాలున్నాయి, ఇందులో 15 నగరపాలకసంస్థలు, 9 పురపాలకసంఘాలు ఉన్నాయి. భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీల పరిసర పట్టణాలను విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసిన తర్వాత 1,728,128 జనాభాతో విశాఖపట్నం అత్యధిక జనాభా కలిగిన నగరంగా రూపుదిద్దుకుని ఇది ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) గా అప్‌గ్రేడ్ చేయబడింది.విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీస్ మిషన్ కింద భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది.
నగర గణాంకాల పట్టిక
[మార్చు]వ.సంఖ్య | నగరం పేరు | జిల్లా | పరిపాలన రకం | వ్యక్తులు | మగ | ఆడ | జనాభా
(0–6 yrs) |
అక్షరాస్యత శాతం |
---|---|---|---|---|---|---|---|---|
1 | విశాఖపట్నం | విశాఖపట్నం | నగరపాలక సంస్థ | 1,730,320 | 875,199 | 855,121 | 158,924 | 82.66 |
2 | విజయవాడ | కృష్ణా | నగరపాలక సంస్థ | 1,048,240 | 524,918 | 523,322 | 92,848 | 82.59 |
3 | గుంటూరు | గుంటూరు | నగరపాలక సంస్థ | 651,382 | 323,151 | 328,231 | 59,486 | 81.11 |
4 | నెల్లూరు | నెల్లూరు | నగరపాలక సంస్థ | 505,258 | 257,043 | 248,215 | 42,041 | 83.59 |
5 | కర్నూలు | కర్నూలు | నగరపాలక సంస్థ | 424,920 | 211,875 | 213,045 | 44,264 | 78.15 |
6 | రాజమండ్రి | తూర్పు గోదావరి | నగరపాలక సంస్థ | 343,903 | 169,786 | 174,117 | 29,883 | 84.28 |
7 | కడప | కడప | నగరపాలక సంస్థ | 341,823 | 171,797 | 170,026 | 36,299 | 79.38 |
8 | కాకినాడ | కాకినాడ | నగరపాలక సంస్థ | 312,255 | 152,596 | 159,659 | 27,181 | 81.23 |
9 | తిరుపతి | తిరుపతి | నగరపాలక సంస్థ | 287,035 | 145,977 | 141,058 | 24,643 | 87.55 |
10 | అనంతపురం | అనంతపురం | నగరపాలక సంస్థ | 262,340 | 131,506 | 130,834 | 23,630 | 81.88 |
11 | విజయనగరం | విజయనగరం | నగరపాలక సంస్థ | 227,533 | 111,596 | 115,937 | 20,487 | 81.85 |
12 | ఏలూరు | ఏలూరు | నగరపాలక సంస్థ | 214,414 | 105,707 | 108,707 | 18,125 | 74.13 |
13 | ఒంగోలు | ప్రకాశం | నగరపాలక సంస్థ | 202,826 | 101,728 | 101,098 | 18,673 | 83.57 |
14 | నంద్యాల | నంద్యాల | పురపాలక సంఘం | 200,746 | 100,770 | 99,976 | 20,588 | 76.89 |
15 | తుని | కాకినాడ | పురపాలక సంఘం | 234,900 | 123,246 | 111,574 | 18,406 | 77.40 |
16 | తెనాలి | గుంటూరు | పురపాలక సంఘం | 164,649 | 81,324 | 83,325 | 16,464 | 84 |
17 | ప్రొద్దుటూరు | కడప | పురపాలక సంఘం | 162,816 | 81,368 | 81,448 | 15,516 | 78.08 |
18 | చిత్తూరు | చిత్తూరు | నగరపాలక సంస్థ | 153,766 | 76,566 | 77,200 | 13,569 | 86.37 |
20 | హిందూపురం | అనంతపురం | పురపాలక సంఘం | 151,835 | 76,625 | 75,210 | 16,309 | 76.40 |
21 | భీమవరం | పశ్చిమ గోదావరి | పురపాలక సంఘం | 142,280 | 70,066 | 72,214 | 12,157 | 83.41 |
21 | మదనపల్లె | అన్నమయ్య | పురపాలక సంఘం | 135,669 | 67,432 | 68,237 | 13,448 | 81.40 |
22 | శ్రీకాకుళం | శ్రీకాకుళం | నగరపాలక సంస్థ[2] | 126,003 | 62,583 | 63,420 | 11,001 | 85.13 |
23 | నరసారావుపేట | గుంటూరు | పురపాలక సంఘం | 116,329 | 58,898 | 57,431 | 10,445 | 79.45 |
24 | తాడేపల్లిగూడెం | పశ్చిమ గోదావరి | పురపాలక సంఘం | 103,577 | 51,176 | 52,401 | 9,048 | 83.10 |
- UA=నగర పరిధి
చిత్రమాలిక
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- నగరం (సిటీ)
- జనాభా
- జనాభా గణన
- భారత జనాభా లెక్కలు
- తెలంగాణ జనాభా గణాంకాలు
- తెలంగాణ నగరాల జాబితా జనాభా ప్రకారం
- ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
మూలాలు
[మార్చు]- ↑ "Census of India - Metadata". web.archive.org. 2007-06-17. Archived from the original on 2007-06-17. Retrieved 2022-07-24.
- ↑ Vizianagaram, Masula to continue as municipalities