జాన్ మగుఫులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ మగుఫులి
టాంజానియా అధ్యక్షుడు
In office
2015 నవంబర్ 5 – 2021 మార్చి 17
ప్రథాన మంత్రిఖాసిం మాజువాల
Vice Presidentసామియా సులాహ్
అంతకు ముందు వారుజాకీయా సుల్లాహ్
తరువాత వారుసామియా సులాహ్
టాంజానియా పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు
In office
2019 ఆగస్టు 17 – 2020 ఆగస్టు 17
అంతకు ముందు వారుహేగు జింగాబ్
వ్యక్తిగత వివరాలు
జననం1959 అక్టోబర్ 29
టాంజానియా
మరణం2021 మార్చి 17
కైరో ఈజిప్ట్
రాజకీయ పార్టీటాంజానియా పీపుల్స్ పార్టీ
సంతానం7
Military service
Years of service1983–1984

జాన్ మగుఫులి [1] ( 1959 అక్టోబరు 29 - 2021 మార్చి 17) [2] టాంజానియా ఐదవ అధ్యక్షుడు, 2015 నుండి 2021లో మరణించే వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అతను 2000 నుండి 2005 వరకు 2010 నుండి 2015 వరకు టాంజానియా పనులు, రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశాడు 2019 నుండి 2020 వరకు సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీకి ఛైర్మన్‌గా ఉన్నాడు.[3][4][5]

1995లో తొలిసారిగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై, అతను పలువురు ప్రధాన మంత్రుల మంత్రి వర్గంలో పనిచేశారు.1995 నుండి 2000 వరకు పనుల డిప్యూటీ మంత్రిగా, 2000 నుండి 2005 వరకు పనుల మంత్రిగా, 2006 నుండి 2008 వరకు భూములు మానవ సెటిల్‌మెంట్ మంత్రిగా, పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశాడు. 2008 నుండి 2010 వరకు ఫిషరీస్, 2010 నుండి 2015 వరకు రెండవసారి పనుల మంత్రిగా పనిచేశారు.[6]

రాజకీయ జీవితం[మార్చు]

మగుఫులి 1982 1983 మధ్య సెంగెరెమా సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా కొద్ది కాలం పనిచేసి తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించారు. అతను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కెమిస్ట్రీ గణితం బోధించేవాడు . తరువాత, అతను తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అతను 1989 నుండి 1995 వరకు [7] అతను చాటో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యుడు (MP)గా ఎన్నికయ్యారు. ఎంపీగా గెలిచిన తొలిసారి ఆయన పనుల శాఖ డిప్యూటీ మంత్రిగా నియమితులయ్యారు.[8]

టాంజానియా అధ్యక్షుడు[మార్చు]

భారత ప్రధాని నరేంద్ర మోడీతో మగుఫులి, 2016 జూలై 10

పదవి స్వీకరించిన తర్వాత మగు పులి అధికారులను నియంత్రించేవాడు. టాంజానియాలో అవినీతికి ఆస్కారం లేకుండా చేశాడు. 2015 నుంచి 2021 వరకు మరణించేంతవరకు ఆరు సంవత్సరాల పాటు టాంజానియా అధ్యక్షుడిగా పనిచేశాడు. మగుఫులి తన సొంత జీతం నెలకు US$15,000 నుండి US$4,000కి తగ్గించుకున్నాడు.[9]

కలరా రోగం 2017లో టాంజానియాలో ఎక్కువగా వ్యాపించింది. దీంతో తాంజానియా అధ్యక్షుడు మగుపులి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిలిపివేశాడు. మాగుపులి ప్రజలను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. "మా ప్రజలు కలరాతో మరణిస్తున్నప్పుడు 54 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి మేము పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం చాలా సిగ్గుచేటు" అని పేర్కొన్నారు.

మరణం[మార్చు]

మగుఫులి 2021 ఫిబ్రవరి 27 నుండి పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో ఆయన ఆరోగ్యం బాగాలేదని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి ‌‌.[10] ఈ పుకార్లపై తాంజానియా పత్రిక స్పందించింది. మగుపులి ఈజిప్టులో కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నాడని రాసింది.[11] మగు పులి ఆరోగ్యం మరింత విషమించడంతో తాంజానియా ప్రభుత్వం మగుపులిని భారతదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.[12] [11]

2021 మార్చి 17 రాత్రి, వైస్ ప్రెసిడెంట్ సమియా సులుహు, మగుఫులి మరణించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. పదవిలో ఉండగానే మరణించిన ఏకైక టాంజానియా అధ్యక్షుడు.మగుపులి మగు పులి మరణించిన తరువాత టాంజానియా ప్రభుత్వం 14 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. టాంజానియా జెండాను సగం వరకు ఎగరవేయాలని ఆదేశాలు ఇచ్చింది. మగుఫులి పార్టీవ దేహాన్ని 2021 మార్చి 20న దార్ ఎస్ సలామ్‌లోని ఉహురు స్టేడియంలో ఉంచారు [13], మగు పులి మృతదేహాన్ని చూడాలని ఆశతో టాంజానియా ప్రజలు స్టేడియంలో కిక్కిరిసిపోయారు, చాలా మంది గోడ ఎక్కారు, అది కూలిపోయింది, ఫలితంగా మానవ తొక్కిసలాట జరిగి కనీసం నలభై ఐదు మంది మరణించారు. ఉగాండా [14] పద్నాలుగు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది; రువాండా [15] తొమ్మిది రోజుల సంతాప దినాలను ప్రకటించింది; కెన్యా [16] బురుండి [17] ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు; మొజాంబిక్ [18] ఐదు రోజుల సంతాప దినాలను ప్రకటించింది; డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,[19] దక్షిణ సూడాన్ [20] మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది; క్యూబా [21], జాంబియా [22][23] ఒకరోజు సంతాప దినాలు ప్రకటించాయి.

మగుఫులిని 2021 మార్చి 26న అతని స్వస్థలమైన చాటోలో మగు పులి అంతిమ సంస్కారాలు జరిగాయి.[24]

మూలాలు[మార్చు]

  1. "Profile Details : Former President". Government of Tanzania. Retrieved 18 March 2021.
  2. "John Magufuli: Tanzania's President John Magufuli dies aged 61". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 17 March 2021. Retrieved 17 March 2021.
  3. "President Magufuli assumes Sadc chairmanship, calls for the West to lift sanctions against Zimbabwe". The Citizen. Tanzania. 17 August 2019. Archived from the original on 28 September 2020.
  4. "Southern Africa: Nyusi Takes Chair, Praises Magufuli". Daily News. Dar es Salaam. 18 August 2020 – via AllAfrica.
  5. "John Magufuli: Tanzania's 'bulldozer' president". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 17 March 2021. Retrieved 17 March 2021.
  6. "Member of Parliament CV". Parliament of Tanzania. Archived from the original on 13 July 2015. Retrieved 20 February 2013.
  7. "Alumni of the Month—John Pombe Joseph Magufuli". University of Dar es Salaam. Archived from the original on 30 July 2021. Retrieved 21 March 2021.
  8. Shao, William (18 March 2021). "Magufuli the African giant—A peasant's son who became President". The Citizen (in ఇంగ్లీష్). Tanzania. Archived from the original on 30 July 2021. Retrieved 18 March 2021.
  9. Tchounand, Ristel (4 October 2017). "Tanzanie: touchant 4 fois moins que son prédécesseur, le président Magufuli dévoile son salaire". La Tribune Afrique (in ఫ్రెంచ్). Retrieved 21 March 2021.
  10. Burke, Jason (18 March 2021). "Tanzania's Covid-denying president, John Magufuli, dies aged 61". The Guardian (in ఇంగ్లీష్). London. Retrieved 27 March 2021.
  11. 11.0 11.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; reuters.hospital అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. "John Magufuli: Questions raised over missing Tanzania leader". BBC News. 10 March 2021. Retrieved 18 March 2021.
  13. "Mourners line Tanzania streets at ex-President Magufuli funeral". BBC News. 20 March 2021. Retrieved 20 March 2021.
  14. "Museveni declares 14 days to mourn 'true friend' Magufuli". Monitor (in ఇంగ్లీష్). 2021-03-20. Retrieved 2022-05-06.
  15. "Rwanda Declares Period of Mourning in Honour of President Magufuli". KT PRESS (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2022-05-06.
  16. "Kenya declares seven days of mourning following Magufuli's death". SABC News - Breaking news, special reports, world, business, sport coverage of all South African current events. Africa's news leader. (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2022-05-06.[permanent dead link]
  17. "Leaders mourn Tanzania's Magufuli". The East African (in ఇంగ్లీష్). 2021-03-22. Retrieved 2022-05-06.
  18. mozambique. "Mozambique declares five days of national mourning for Tanzania's John Magufuli". Mozambique (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-06.
  19. Mavinga, Nathanael (2021-03-20). "La RDC décrète un deuil national de 3 jours suite au décès du président tanzanien John Magufuli". Financial Afrik (in ఫ్రెంచ్). Retrieved 2022-05-06.
  20. "Kiir orders 3 days of mourning Tanzania's Magufuli". Radio Tamazuj (in ఇంగ్లీష్). Retrieved 2022-05-06.
  21. cubanew/acn (20 March 2021). "Cuba declares official mourning for death of Tanzanian president". Agencia Cubana de Noticias (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-05-06.
  22. "ECL DECLARES NATIONAL MOURNING FOR MAGUFULI ~" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-03-25. Archived from the original on 2021-11-08. Retrieved 2022-05-06.
  23. "News » | Ippmedia".
  24. "Tanzania president burial: John Pombe Magafuli burial fotos of how Tanzania bury dia former president for im hometown of Chato" (in నైజీరియా పిడ్గిన్). BBC News. 26 March 2021. Archived from the original on 23 April 2021.