జాయ్ ముఖర్జీ
జాయ్ ఓం యాదవ్ ముఖర్జీ | |
---|---|
దస్త్రం:Joy Mukherjee.jpg | |
జననం | ఝాన్సీ, భారతదేశము | 1939 ఫిబ్రవరి 24
మరణం | 2012 మార్చి 9 ముంబయి, భారతదేశము | (వయసు 73)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | చలనచిత్ర నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1960– 2012 |
జీవిత భాగస్వామి | నీలం ముఖర్జీ |
పిల్లలు | మనోజ్ ముఖర్జీ సుజోయ్ ముఖర్జీ సిర్మాన్ ముఖర్జీ |
తల్లిదండ్రులు | సషాధర్ ముఖర్జీ సతీదేవి |
బంధువులు | రోనో ముఖర్జీ (సోదరుడు) దేబ్ ముఖర్జీ (సోదరుడు) షోమూ ముఖర్జీ (సోదరుడు) షుబీర్ ముఖర్జీ (సోదరుడు) షర్బానీ ముఖర్జీ (రోనో ముఖర్జీ కూతురు) |
జాయ్ ముఖర్జీ (Bengali: জয় মুখার্জী) ఒక భారతీయ చలన చిత్ర నటుడు.
జీవితచరిత్ర
[మార్చు]కుటుంబ నేపథ్యం
[మార్చు]జాయ్ ముఖర్జీ భారతీయ చలన చిత్ర నటుడు. ఆయన సషాధర్ ముఖర్జీ, సతీదేవి దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఒక మంచి నిర్మాత, ఫిల్మిస్తాన్ స్టూడియోస్ సహ స్థాపకుడు. అతని తండ్రి తరపున మేనమామ దర్శకుడు సుబోధ్ ముఖర్జీ కాగా, అతని తల్లి తరపు మేనమామలు అశోక్ కుమార్, కిషోర్ కుమార్‌లు. అతని సహోదరులు డెబ్ ముఖర్జీ, శోము ముఖర్జీ, ఇతను నటి తనుజాను పెళ్ళి చేసుకున్నాడు. వారి కుమార్తెలు నటీమణులు కాజల్, తనీషాలు. అతని మేనకోడలు రాణి ముఖర్జీ, మేనల్లుడు ఆమె బంధువు దర్శకుడు ఆయన్ ముఖర్జీ.
వృత్తి జీవితం
[మార్చు]జాయ్ R. K. నాయ్యర్ దర్శకత్వం వహించిన లవ్ ఇన్ సిమ్లా (1960) చలన చిత్రంలో సాధనాతో కలిసి నటించాడు. ఈ చిత్రం తరువాత ఆయన ఆశా పరేఖ్ తో జంటగా అనేక హిట్ చిత్రాలైన "ఫిర్ వోహి దిల్ లాయా హో", "లవ్ ఇన్ టోక్యో", "జిడ్డి" లలో నతించాడు. కొన్ని సినిమాలైన దూర్ కీ ఆవాజ్, ఆఓ ప్యార్ కరేనంద్ షాగిర్ద్, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా లను సాధనతో కలసి నటించాడు. వైజయంతీమాలతో కలసి "ఈశ్వర", రాజశ్రీతో నటించిన "జీ చాహతా హై" చిత్రాలు ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ఆయన నటించిన చిత్రాలలో అనేకమైనవి సంగీత పరంగా హిట్ అయినాయి. 1960ల చివరిలో నటనావకాశాలు రాకపోవడంతో ఆయన దర్శకత్వం, నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.[1]
ఆయన "హుంసయ" చిత్రానికి నిర్మాత, దర్శకత్వం వహించాడు. కాని ఈ చలన చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేదు, నిర్మాత లేదా దర్శకుని వలె అతని తదుపరి చలన చిత్రాలు కూడా విజయాన్ని సాధించలేదు. స్వంత నిర్మాణంలో సోదరుడు డెబ్ ముఖర్జీతో నిర్మించిన ఎక్ బార్ ముస్కురా దూ (1972), తర్వాత మరదలు తనుజాతో ఆలస్యంగా విజయం సాధించాడు, తర్వాత జాయ్ చలన చిత్రాల నుండి కనుమరుగయ్యాడు. అతని ఆఖరి విజయం జీనత్ అమన్, రాజేష్ ఖన్నాలు నటించిన చాయిల్లా బాబు చలన చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా పొందాడు.
2009లో, అతను టెలివిజన్ సీరియల్ "అయ్ దిల్-ఇ-నందన్"లో నటించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- హైవాన్ (1977)
- ఎక్ బార్ ముస్కరా దో (1972)
- కహిన్ ఔర్ కహిన్ ప్యార్ (1971)
- అగ్ ఔర్ దాగ్ (1970)
- ఎహ్సాన్ (1970)
- ఇన్సపెక్టర్ (1970) ... ఇన్సపెక్టర్ రాజేష్/ఏజెంట్ 707
- మూజ్రిమ్ (1970) ... గోపాల్
- పురస్కార్ (1970) ... రాకేష్
- డుప్తా (1969)
- దిల్ ఔర్ మహోబత్ (1968) ... రామేష్ చౌదరీ
- ఎక్ కాలీ ముస్కాయి (1968)
- హంసాయా (1968)
- షాగిర్డ్ (1967) ... రాజేష్
- లవ్ ఇన్ టోక్యో (1966) ... అశోక్
- యెహ్ జిందగీ కిత్నీ హాసెన్ హాయ్ (1966) ... సంజయ్ మల్హోత్రా
- సాజ్ ఔర్ అవాజ్ (1966)
- బాహు బేటీ (1965) ... శేఖర్
- ఆయో ప్యార్ కరేన్ (1964)
- డోర్ కీ అవాజ్ (1964)
- ఇషారా (1964)
- జి చాహ్తా హై (1964)
- జిడ్డీ (1964) ... అశోక్
- ఫిర్ వోహీ దిల్ లయ హూన్ (1963) ... మోహన్
- ఎక్ ముసాఫిర్ ఎక్ హసీనా (1962)
- ఉమెద్ (1962)
- హమ్ హిందుస్థానీ (1960) ... సత్యేంద్ర నాథ్
- లవ్ ఇన్ సిమ్లా (1960) .. దేవ్ కుమార్ మెహ్రా
మూలాలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Joy Mukherjee పేజీ
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Articles containing Bengali-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 2012 మరణాలు
- భారతీయ సినిమా నటులు
- ఝాన్సీ నుండి ప్రజలు
- బెంగాలీ నటులు
- భారతీయ సినిమా దర్శకులు
- 1939 జననాలు