జార్జ్ లూకాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జార్జ్ లూకాస్
2009 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లూకాస్
జననం
జార్జ్ వాల్టన్ లూకాస్ జూనియర్

(1944-05-14) 1944 మే 14 (వయసు 80)
మోడెస్టో, కాలిఫోర్నియా, యుఎస్
విద్యాసంస్థ
 • మోడెస్టో జూనియర్ కళాశాల
 • సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1965–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు4, (అమండా లూకాస్, కేటీ లూకాస్

జార్జ్ వాల్టన్ లూకాస్ జూనియర్[1] అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, వ్యవస్థాపకుడు. స్టార్ వార్స్, ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయడంతోపాటు లూకాస్‌ఫిల్మ్, లూకాస్ ఆర్ట్స్, ఇండస్ట్రియల్ లైట్ & మ్యాజిక్, టిహెచ్ఎక్స్ లను స్థాపించాడు. 2012లో ది వాల్ట్ డిస్నీ కంపెనీకి విక్రయించడానికి ముందు లుకాస్‌ఫిల్మ్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు.[2] నాలుగు అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాడు. ఇతని సినిమాలు నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ళు చేసిన 100 సినిమాల్లో ఒకటిగా నిలిచాయి.[3] 20వ శతాబ్దపు న్యూ హాలీవుడ్ ఉద్యమ అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు ఆధునిక బ్లాక్‌బస్టర్‌కు మార్గదర్శకుడిగా నిలిచాడు.

జననం

[మార్చు]

లూకాస్ 1944, మే 14న డోరతీ ఎల్లినోర్ లూకాస్ - జార్జ్ వాల్టన్ లూకాస్ దంపతులకు కాలిఫోర్నియాలోని మోడెస్టోలో జన్మించాడు.[4]

సినిమారంగం

[మార్చు]

1967లో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి పట్టభద్రుడయ్యాక, లూకాస్ ఫిల్మ్ మేకర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాతో కలిసి అమెరికన్ జోట్రోప్‌ అనే సంస్థను స్థాపించారు. 1971లో టిహెచ్ఎక్స్ 1138 సినిమాను వ్రాసి దర్శకత్వం వహించాడు. 1973లో రచయిత-దర్శకుడిగాఅమెరికన్ గ్రాఫిటీ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంతో సహా ఐదు అకాడమీ అవార్డు ప్రతిపాదనలను అందుకుంది.

1977లో స్టార్ వార్స్ తీసిన సినిమా ఆ సమయంలో అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాగా నిలిచింది, ఆరు అకాడమీ అవార్డులను గెలుచుకుంది. 1980లో ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, 1983లో రిటర్న్ ఆఫ్ ది జెడి సీక్వెల్‌లను నిర్మించాడు, సహ రచయితగా వ్యవహరించాడు. దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ (1981), ది టెంపుల్ ఆఫ్ డూమ్ (1984), ది లాస్ట్ క్రూసేడ్ (1989), ది డయల్ ఆఫ్ డెస్టినీ (2023), ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ (2008) సినిమాలను నిర్మించాడు, సహ రచయితగా ఉన్నాడు. 1970లు, 2010ల మధ్య లూకాస్‌ఫిల్మ్ ద్వారా అనేక రకాల సినిమాలు టెలివిజన్ ధారావాహికలను నిర్మించాడు.

స్టార్ వార్స్: ఎపిసోడ్ I - ది ఫాంటమ్ మెనాస్ (1999), ఎపిసోడ్ II - అటాక్ ఆఫ్ ది క్లోన్స్ (2002), ఎపిసోడ్ III - రివెంజ్ ఆఫ్ ది సిత్ (2005)తో కూడిన స్టార్ వార్స్ ప్రీక్వెల్ త్రయంతో అతను దర్శకత్వం వహించాడు. చివరిసారిగా సిజిఐ-యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్ (2008–2014, 2020), యుద్ధ చిత్రం రెడ్ టెయిల్స్ (2012), సిజిఐ సినిమా స్ట్రేంజ్ మ్యాజిక్ (2015)లో కలిసి పనిచేశాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పంపిణీ సంస్థ
1971 టిహెచ్ఎక్స్ 1138 వార్నర్ బ్రదర్స్.
1973 అమెరికన్ గ్రాఫిటీ యూనివర్సల్ పిక్చర్స్
1977 స్టార్ వార్స్: ఎపిసోడ్ IV - ఎ న్యూ హోప్ 20వ సెంచరీ ఫాక్స్
1999 స్టార్ వార్స్: ఎపిసోడ్ I - ది ఫాంటమ్ మెనాస్
2002 స్టార్ వార్స్: ఎపిసోడ్ II - అటాక్ ఆఫ్ ది క్లోన్స్
2005 స్టార్ వార్స్: ఎపిసోడ్ III - రివెంజ్ ఆఫ్ ది సిత్

అవార్డులు, సన్మానాలు

[మార్చు]

1977లో, లూకాస్‌కు ఇంక్‌పాట్ అవార్డు లభించింది.[5]

అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ 2005 జూన్ 9న లూకాస్‌కు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది.[6]

లూకాస్ నాలుగు అకాడమీ అవార్డులకు (అమెరికన్ గ్రాఫిటీ, స్టార్ వార్స్ కొరకు ఉత్తమ దర్శకత్వం, రచన విభాగంలో) నామినేట్ అయ్యాడు. 1991లో అకాడమీ ఇర్వింగ్ జి. థాల్బర్గ్ అవార్డును అందుకున్నాడు. 2007లో 79వ అకాడమీ అవార్డుల వేడుకలో స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలతో కలిసి వారి స్నేహితుడు మార్టిన్ స్కోర్సెస్‌కి ఉత్తమ దర్శకుడు అవార్డును అందించాడు.

2013 జూలైలో అమెరికన్ సినిమాకి చేసిన సేవలకు గాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాచే నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్‌ను అందుకున్నాడు.[7] 2014, అక్టోబరులో సొసైటీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ఇంజనీర్స్ గౌరవ సభ్యత్వాన్ని పొందాడు.[8][9]

మూలాలు

[మార్చు]
 1. White, Dana (2000). George Lucas. Lerner Publishing Group. p. 12. ISBN 0822549751.
 2. "Disney Acquires Lucasfilm for $4.05 Billion – STAR WARS: Episode 7 in 2015!". broadwayworld.com.
 3. "Top Lifetime Adjusted Grosses". BoxOfficeMojo.com. Retrieved 2023-06-25.
 4. Roberts, Gary Boyd (April 18, 2008). "No. 83 Royal Descents, Notable Kin, and Printed Sources: A Third Set of Ten Hollywood Figures (or Groups Thereof), with a Coda on Two Directors". New England Historic Genealogical Society. Archived from the original on October 18, 2014.
 5. Inkpot Award
 6. "AFI.com Error". afi.com.
 7. "George Lucas receives National Medal of Arts". BBC News. BBC. July 11, 2013. Retrieved 2023-06-25.
 8. "SMPTE Announces 2014 Honorees and Award Winners". Society of Motion Picture and Television Engineers. Archived from the original on October 5, 2018. Retrieved 2023-06-25.
 9. "Motion-Imaging Industry Luminaries Recognized at SMPTE® Honors & Awards Ceremony". Society of Motion Picture & Television Engineers. November 10, 2014. Archived from the original on October 5, 2018. Retrieved 2023-06-25.

బయటి లింకులు

[మార్చు]