జాస్తి చలమేశ్వర్

వికీపీడియా నుండి
(జాస్తి చలమేశ్వర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాస్తి చలమేశ్వర్
జాస్తి చలమేశ్వర్ (2014 ఏప్రిల్)
జననం (1953-06-23) 1953 జూన్ 23 (వయసు 70)
వృత్తిన్యాయమూర్తి
జీవిత భాగస్వామిలక్ష్మీనళిని
పిల్లలు3 అబ్బాయిలు
తల్లిదండ్రులు

జాస్తి చలమేశ్వర్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి. యివివరకు కేరళ, గౌహతి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

తండ్రి లక్ష్మీనారాయణ మచిలీపట్నములో పేరొందిన న్యాయవాది. 1953 జూన్ 23 న కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవిలో జన్మించాడు. 1వ తరగతి నుంచి తన తాత నాగభూషణం వద్ద పెరుగుతూ బందరు హిందూ పాఠశాలలో 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. మద్రాసు లయోలా కళాశాలలో భౌతిక శాస్త్రము, ఆంధ్ర విశ్వకళా పరిషత్, విశాఖపట్నం నుండి న్యాయశాస్త్ర పట్టా పొందాడు.[2]

1976లో ఆంధ్ర ఉన్నత న్యాయ స్థానములో న్యాయవాదిగా నమోదై పలు పేరొందిన న్యాయవాదుల వద్ద పనిచేశాడు. ఎన్నికల చట్టాలు, పన్నుల చట్టం, ఆదాయపు పన్ను చట్టం, నేరచట్టం మొదలగు విభాగాలలో అనుభవము సంపాదించాడు. 1995-1996లో లోకాయుక్త సలహాదారు గా, 1988-89 లో ప్రభుత్వ హోం శాఖ న్యాయవాదిగా పనిచేశాడు. 1995లో అదనపు అడ్వొకేట్ జనరల్ గా నియమించబడ్డాడు. 1997లో అదనపు న్యాయాధిపతిగా, 1999లో న్యాయాధిపతిగా నియమించబడ్డాడు.

ప్రముఖ తెలుగు కవులు అద్దేపల్లి లక్ష్మణస్వామి, మల్లంపల్లి నాగమల్లేశ్వర శర్మల వద్ద తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నారు. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పంచ, లాల్చీ, కండువ ధరించి సభలకు హాజరవుతూ ప్రసంగించేవారు. ఆయన అస్సాం, కేరళ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.[3] 2017లో జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌కు సీజేఐగా అవకాశం దక్కవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోకా సుబ్బారావు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ( సీజేఐ) గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ పి.సత్యనారాయణరాజు, జస్టిస్‌ పి.జగన్‌మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి, జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి, జస్టిస్‌ బి.పి.జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.జగన్నాథరావు, జస్టిస్‌ పి.వెంకటరామారెడ్డి, జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పనిచేశారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

చలమేశ్వర్ గారికి తెలుగు సాహిత్యం, చిత్రలేఖనం మీద ఆసక్తి ఎక్కువ. వ్యవసాయం అంటే చెప్పలేనంత అభిమానం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సిద్ధాంతాన్ని కన్ని ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేసి 6-7 కిలోమీటర్లు నడుస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా శాకాహారిగా మారిపోయారు.

వీరు చదువుతున్నప్పుడే పెద్దలు పి.వెంకటేశ్వర్లు గారి అమ్మాయి లక్ష్మీనళినితో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు. పెద్ద కొడుకు వెంకటరామ్ భూపాల్ ఇంజినీరింగ్ చేసి వ్యాపారం చేస్తున్నాడు. రెండవ అబ్బాయి నాగభూషణం న్యాయవాదిగా హైదరాబాదు లోనే ప్రాక్టీసు చేస్తున్నారు. మూడో అబ్బాయి కూడా న్యాయశాస్త్రం చదివి వ్యాపారరంగంలో స్థిరపడ్డారు.

ఇవి కూడ చూడండి[మార్చు]

శరద్ అరవింద్ బాబ్డే

మూలాలు[మార్చు]

  1. "Meet Jasti Chelameswar, only judge who ruled in favour of government's NJAC - The Economic Times". The Economic Times. Retrieved 2015-11-03.
  2. "Supreme Court of India - CJI & Sitting Judges". www.supremecourtofindia.nic.in. Archived from the original on 2016-11-20. Retrieved 2016-11-20.
  3. "Hon'ble Mr. Justice Jasti Chelameswar". Archived from the original on 25 డిసెంబరు 2016. Retrieved 20 December 2016.
  • చదువులో ముందున్నా... వెనక బెంచీయే!, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తో పరిచయం, మునగవలస శ్రీనివాస పట్నాయక్, ఈనాడు ఆదివారం అనుబంధం, 5 ఫిబ్రవరి 2012.