Jump to content

జితన్ రామ్ మాంఝీ

వికీపీడియా నుండి
జితన్ రామ్ మాంఝీ
జితన్ రామ్ మాంఝీ


హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు
పదవీ కాలం
8 మే 2015 – 16 ఏప్రిల్ 2022
ముందు స్థానం స్థాపించబడింది
తరువాత సంతోష్ కుమార్ సుమన్

ప్రొటెం స్పీకర్
పదవీ కాలం
19 నవంబర్ 2020 – 24 నవంబర్ 2020

పదవీ కాలం
20 మే 2014[1] – 20 ఫిబ్రవరి 2015[2]
ముందు నితీష్ కుమార్
తరువాత నితీష్ కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం (1944-10-06) 1944 అక్టోబరు 6 (వయసు 80)
గయా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా (2015—present)
ఇతర రాజకీయ పార్టీలు జేడీయూ (2005—2015)
రాష్ట్రీయ జనతా దళ్ (1996—2004)
జనతాదళ్ (1990—1996)
కాంగ్రెస్ (1980—1990)
బంధువులు దీపా మాంఝీ (కోడలు)
సంతానం 7, సంతోష్ మాంఝీతో సహా
పూర్వ విద్యార్థి మగద్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

జితన్ రామ్ మాంఝీ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014 మే 20 [3] నుండి 2015 ఫిబ్రవరి 20 వరకు బీహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.[4] జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను అంతకుముందు నితీష్ కుమార్ మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమా శాఖ మంత్రిగా పని చేశాడు.

జితన్ రామ్ మాంఝీ బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రశేఖర్ సింగ్ , బిందేశ్వరి దూబే, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు.

మాంఝీ 1980 నుండి కాంగ్రెస్ (1980-1990), జనతాదళ్ (1990-1996), రాష్ట్రీయ జనతా దళ్ (1996-2005), జేడీయూ (2005–2015) నుండి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఫిబ్రవరి 2015 రాజకీయ సంక్షోభం తరువాత జేడీయూ నుండి బహిష్కరించిన అనంతరం హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీని స్థాపించాడు.[5] జితన్ రామ్ మాంఝీకి జూలై 2015లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "Z" ప్లస్ సెక్యూరిటీని కల్పించింది.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. Ghosh, Deepshikha (20 May 2014). "I'm No Rubber Stamp,' Says Nitish Kumar's Successor Jitan Ram Manjhi". Patna: NDTV. Retrieved 20 May 2014.
  2. "Manjhi resigns as Bihar CM ahead of trust vote, says his supporters got death threats". The Times of India. 2015-02-20. Retrieved 2015-02-20.
  3. "Jitan Ram Manjhi sworn in as Bihar CM". 20 May 2014. Archived from the original on 27 April 2024. Retrieved 27 April 2024.
  4. "Jitan Ram Manjhi resigns as Bihar chief minister". Yahoo! News. Patna. 20 Feb 2014. Retrieved 20 Feb 2014.
  5. "'Ram Vilas Dalit face wherever you go, Jitan Ram Manjhi can be Mahadalit face'". 29 July 2015.
  6. "BJP government gives Jitan Ram Manjhi Z-plus VIP security cover".
  7. "Now, Pappu Yadav gets 'Y' category security". 29 July 2015.
  8. Bureau, National (2015-07-21). "Manjhi gets Z-plus security". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-16.