బిందేశ్వరి దూబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిందేశ్వరి దూబే
21వ బీహార్ ముఖ్యమంత్రి
In office
12 మార్చ్ 1985 – 13 ఫిబ్రవరి 1988
అంతకు ముందు వారుచంద్రశేఖర్ సింఘ్
తరువాత వారుభగవత్ జా అజాద్
వ్యక్తిగత వివరాలు
జననం14 జనవరి 1921
భోజ్‌పూర్‌ జిల్లా, భారతదేశం
మరణం20 జనవరి 1993 (వయస్సు 72)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సమాధి స్థలంగ్యాంగ్స్, వారణాసి
వృత్తిరాజకీయం

బిందేశ్వరి దూబే ( 1921 జనవరి 14 - 1993 జనవరి 20) బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినస్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.[1]

జననం

[మార్చు]

బీహార్‌ రాష్ట్రం, భోజ్‌పూర్‌లోని మహువాన్ గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నలుగురు కుమారులలో బిందేశ్వరి దూబే రెండవవాడు. అతని తండ్రి శివ నరేష్ దూబే.[2][3]

ముఖ్య సంఘటనలు

[మార్చు]

బీహార్‌లో భాగంగా ఉన్న చోటనాగ్‌పూర్ ప్రాంతంలో భారతీయ కొల్లేరీల జాతీయీకరణలో దూబే పాల్గొన్నాడు. రాజీవ్ గాంధీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిమండలిలో చట్టం, న్యాయం, కార్మిక శాఖలను అతను నిర్వహించాడు. అంతకు ముందు, అతను విద్య, రవాణా, ఆరోగ్య మంత్రిగా రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించాడు. అతను 1980, 1984 మధ్య ఏడవ లోక్‌సభ సభ్యుడు గా నియమితుడయ్యాడు, బీహార్‌లోని గిరిదిహ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 1988 నుండి మరణించే వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. అంతకు ముందు అతను 1952–57, 1962-77, 1985–88 మధ్య బీహార్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. అతను బీహార్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానే కాకుండా జాతీయ ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా వ్యవహరించాడు.[4]

క్విట్ ఇండియా ఉద్యమం

[మార్చు]

1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి దుబే తన ఇంజనీరింగ్ చదువును విడిచిపెట్టాడు[5]

ముఖ్యమంత్రి

[మార్చు]

1985 మార్చి 12 నుండి 1988 ఫిబ్రవరి 13 మధ్య కాలంలో దూబే బీహార్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1988 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఏదేమైనా, అతని ముఖ్యమంత్రి పదవి వివాదాస్పదమైంది. దీనిపై మారణహోమం, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఎదురుకోడానికి అతను 'ఆపరేషన్ సిద్ధార్థ', 'మాఫియా ట్రయల్' లను ప్రారంభించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Obituary References". Parliament of India. 22 February 1993. Archived from the original on 2003-09-29.
  2. "पुण्यतिथि पर याद किए गए बिन्देश्वरी दुबे".
  3. "न खाता न बही, जो चचा केसरी कहें वही सही". 24 October 2017.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-09-24. Retrieved 2021-09-24.
  5. "बिहार बोर्ड का सहायक रिश्वत लेते गिरफ्तार".
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-09. Retrieved 2021-09-24.