Jump to content

జి. రాజ్ కుమార్

వికీపీడియా నుండి
జి. రాజ్ కుమార్
జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్
In office
2012-2014
వ్యక్తిగత వివరాలు
జననం (1953-06-18) 1953 జూన్ 18 (వయసు 71)
హైదరాబాదు, తెలంగాణ
మరణం2021 ఆగస్టు 10(2021-08-10) (వయసు 68)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఅరుణ
సంతానంముగ్గురు కుమార్తెలు (అనుప, శిల్ప, దీప)
తల్లిదండ్రులుఅర్జున్ కుమార్ పటేల్‌, బాలమ్మ

గోల్కొండ రాజ్ కుమార్ (18 జూన్ 1953 - 10 ఆగస్టు 2021) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] 2012 నుండి 2014 వరకు హైదరాబాదు మహానగరపాలక సంస్థకు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు.[2][3] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.[4]

తొలి జీవితం

[మార్చు]

రాజ్ కుమార్ 1953, జూన్ 18న మాజీ కార్పొరేటర్ అర్జున్ కుమార్ పటేల్‌, బాలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

1982లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్ కుమార్, 2009లో జరిగిన హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి పోటిచేసి గెలుపొందాడు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2012, జనవరి 4న కాంగ్రేస్ పార్టీ తరపున హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యాడు.[6][7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రాజ్ కుమార్ కు గ్రాడ్యుయేట్ చదివిన అరుణతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (అనుప, శిల్ప, దీప) ఉన్నారు.

మరణం

[మార్చు]

రాజ్ కుమార్ 2021, ఆగస్టు 10న గుండెపోటుతో మరణించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. The Hans India, Hyderabad (10 August 2021). "Former deputy mayor Raj Kumar dies in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 10 August 2021. Retrieved 16 August 2021.
  2. "First-time corporator Majid is city mayor - Times Of India". archive.ph. 2012-07-28. Archived from the original on 2012-07-28. Retrieved 2021-08-16.
  3. "MM Hussain is Mayor, Rajkumar deputy". The New Indian Express. Retrieved 2021-08-16.
  4. "Archived copy". Archived from the original on 2012-01-04. Retrieved 2012-01-04.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-16. Retrieved 2021-08-16.
  6. "New mayor for Hyderabad, IBN Live News". Ibnlive.in.com. 3 January 2012. Archived from the original on 12 January 2012. Retrieved 16 August 2021.
  7. "MIM's Hussain elected Mayor of Hyderabad". news18.com. Retrieved 16 August 2021.
  8. సమయం తెలుగు, తెలంగాణ (10 August 2021). "గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ మృతి.. ప్రముఖ నేతల సంతాపం". Samayam Telugu. Archived from the original on 16 ఆగస్టు 2021. Retrieved 16 August 2021.

బయటి లింకులు

[మార్చు]