జుత్తు జగన్నాయకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలాస నియోజకవర్గ రాజకీయ నాయకుడు. ఆయన పలాస అసెంబ్లీ నియోజకవర్గ నుంచి శాసనసభ్యుడిగా 2009 నుంచి 2014 వరకు పలాస శాసనసభ నియోజక వర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు.

జననం[మార్చు]

శ్రీ జుత్తు జగన్నాయకులు 1959 జూన్ 23 న పలాస మండలంలోణి బిడిమి గ్రామంలో జుత్తు నారాయణ, లక్ష్మమ్మ దంపతులకి జన్మించాడు. వీరు అగ్నికులక్షత్రియ సామజికవర్గానికి చెందినవాడు. మందస హైస్కూలులో పదవతరగతి పూర్తిచేసాడు. తదుపరి పలాస లోణి జి.జె కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేసాడు. ఎం.ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. తదుపరి ఎంఏ, ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నంలో పీజీ పూర్తి చేశాడు.

రాజకీయ రంగప్రవేశం[మార్చు]

1992 నుండి మజ్జి శారదాదేవి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తగా, 1996 డీసీసీ కార్యదర్శి, 2004లో సోంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ 11,200 ఓట్లు తేడాతో ఓటమి, అనంతరం ఐదేళ్లపాటు పీసీసీ మెంబర్ గా, రెండేళ్లపాటు జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడుగా, 2009 పలాస నియోకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన 2009 నుంచి 2014 వరకు పలాస నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేసాడు.

మరణం[మార్చు]

పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు 2017 నవంబరు 5 న మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 నవంబరు 5 తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. జగన్నాయుకులు మృతిపట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.