జెజ్జాల కృష్ణ మోహన రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జెజ్జాల కృష్ణ మోహన రావు నెల్లూరు జిల్లాలో 1943 వ సంవత్సరంలో జన్మించారు. వీరు మదరాసులో (చెన్నై) ఎస్.ఎస్.ఎల్.సి చదివారు. అప్పట్లో వీరికి తెలుగు మాస్టారుగా వేదం వేంకట కృష్ణ శర్మగారుండేవారు. తిరుపతిలో ఉన్నతాబ్యాసము చేసి IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా పొందారు. తర్వాత 1980 దాకా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన చేశారు.

తర్వాత అమెరికావెళ్లి అక్కడే లో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం గడిపారు. వీరు ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు. పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు. వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి, పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

వీరి ప్ర స్తుత నివాసం: ఫ్రెడరిక్, మేరీలాండ్, అ.సం.రా. హాబీలు: సాహిత్యము, సంగీతము, ముగ్గులు


https://web.archive.org/web/20160315082956/http://eemaata.com/em/issues/200005/776.html