జెఫ్ మాస్
Jump to navigation
Jump to search
1947, జూన్ 29న మెల్బోర్న్లో జన్మించిన జెఫ్ మాస్ (Jeffrey Kenneth Moss) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన జెఫ్ మార్ష్ 1979లో ఒక టెస్ట్ మ్యాచ్, ఒక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
పాల్గొన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సులలో కలిపి 60 అరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 38 నాటౌట్. సగటు 60 పరుగులు. 1979 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్తో నాటింఘామ్లో జరిగిన ఒక వన్డేలో పాల్గొని 7 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా దేశవాళీ పోటీలలో విక్టోరియా తరఫున పాల్గొన్నాడు. 1978-79లో విక్టోరియా జట్టు షెఫీల్డ్ ట్రోఫీ నెగ్గడంలో తన పాత్ర వహించాడు. ఆ టోర్నమెంటులో 68 సగటుతో 748 పరుగులు సాధించాడు.[1]