జెస్సీ
జెస్సీ | |
---|---|
దర్శకత్వం | వి. అశ్వని కుమార్ |
నిర్మాత | శ్వేతా సింగ్ |
తారాగణం | ఆషిమా, శ్రీత చందన, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్ |
ఛాయాగ్రహణం | సునీల్ కుమార్ |
కూర్పు | గ్యారీ బి.హెచ్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 15 జూన్ 2019 |
సినిమా నిడివి | 96 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జెస్సీ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్వేతా సింగ్ నిర్మించిన ఈ సినిమాకు వి. అశ్వని కుమార్. దర్శకత్వం వహించాడు. అభినవ్ గౌతమ్, అర్చన, అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 మార్చి 15న విడుదలైంది.
కథ
[మార్చు]విక్టోరియా హౌస్‌లో ఉండే ఇద్దరు అక్కచెల్లెల్లు జెస్సీ (అషిమా), యమి (శ్రీత చందన) యాక్సిడెంట్‌లో చనిపోయి దెయ్యాలుగా మారారనే కారణంతో ఆ ఇల్లుని ఎవరూ కొనరు.పావణి గంగిరెడ్డి, అభినవ్ గౌతమ్, అభిషేక్, పూర్ణిమలు ఘోస్ట్ హంటర్స్. దెయ్యాలు ఉన్నాయో లేదో ప్రాక్టికల్ కనుకొనే ప్రయత్నంలో విక్టోరియా హౌస్‌కి వెళ్తారు. వీరికి మార్గమధ్యలో విక్టోరియా హౌస్ యజమాని సమీర (అర్చన) పరిచయం అవుతుంది. అసలు ఈ అక్కచెల్లెల్లు ఎవరు? చివరికి ఘోస్ట్ హంటర్స్ ( అభినవ్, అభిషేక్, పూర్ణిమ, పావని) నిజమైన దెయ్యాన్ని పట్టుకోగలిగారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- అషిమా నర్వాల్ - జెస్సీ
- అభినవ్ గౌతమ్
- అర్చన - సమీర
- శ్రీత చందన - యమి
- అతుల్ కులకర్ణి - పోలీస్ ఆఫీసర్
- కబీర్ దుహన్ సింగ్ - భూత వైద్యుడు
- విమల్ కృష్ణ - రాజీవ్
- పావని గంగిరెడ్డి
- సుధారాణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: శ్వేతా సింగ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి. అశ్వని కుమార్
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్
- మాటలు, పాటలు : కిట్టు విస్సాప్రగడ
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu, TV9 (15 March 2019). "జెస్సీ తెలుగు మూవీ రివ్యూ". Archived from the original on 5 నవంబరు 2021. Retrieved 5 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)