అతుల్‌ కులకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతుల్ కులకర్ణి
Atul Kulkarni graces the screening of Sonata.jpg
జననం (1965-09-10) 1965 సెప్టెంబరు 10 (వయస్సు 56)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థనేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ
వృత్తినటుడు
జీవిత భాగస్వామిగీతాంజలి కులకర్ణి (m.1996) [1]
వెబ్‌సైటుwww.atulkulkarni.com

అతుల్ కులకర్ణి భారతదేశానికి చెందిన సినీ నటుడు. ఆయన హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగు భాష చిత్రాల్లో నటించాడు. ఆయన హే రామ్, చాందిని బార్ చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి నటనలో డిప్లొమా పొందాడు. ఆయనలో థియేటర్ నటి గీతాంజలిని 1996లో వివాహ చేసుకున్నాడు. 1997లో తొలిసారిగా "భూమిగీత"అనే కన్నడ చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు..[2]

జననం & విద్యాభాస్యం[మార్చు]

ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో సెప్టెంబర్ 10, 1965లో జన్మించాడు. ఈయన మహారాష్ట్ర, సోలాపూర్ లోని హరిభాయ్ డియోకరన్ హై స్కూల్ లో ఉన్నత చదువులను పూర్తి చేశాడు. డి.ఎ.వి కాలేజీ, సోలాపూర్ నుండి బి.ఎ (ఆంగ్ల సాహిత్యం) పూర్తి చేసి, నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా, న్యూ ఢిల్లీ నుండి పీజీ పూర్తి చేశాడు.

తెలుగు చిత్రాలు[మార్చు]

అతుల్ కులకర్ణి 2000లో ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన జయం మనదేరా (2000 సినిమా) సినిమాతో తెలుగు చిత్రసీమలోకి వచ్చాడు. ఆయన తరువాత ఆంధ్రావాలా (సినిమా), చంటి (2004 సినిమా), గౌరి (2004 సినిమా), లీలామహల్ సెంటర్, రామ్ , పంజా (సినిమా), కాఫీ బార్, మజిలీ (సినిమా), వైల్డ్ డాగ్ చిత్రాల్లో నటించాడు.

టీవీ & వెబ్ సిరీస్[మార్చు]

Year Series Role Network Notes
2017-18 ది టెస్ట్ కేసు కల్నల్ అజింక్య సాఠే ఆల్ట్ బాలాజీ
2019 సిటీ అఫ్ డ్రీమ్స్ అమయ్ రావు గైక్వాడ్ హాట్ స్టార్ స్పెషల్స్
2020 ది రైకర్ కేసు యశ్వంత్ నాయక్ రైకర్ ఊట్ సెలెక్ట్
2020 బందీష్ బాండిట్స్ దిగ్విజయ్ రాథోర్ అమెజాన్ ప్రైమ్ వీడియో
2020 స్యాండ్విచ్డ్ ఫరెవర్ వి.కె. సార్నాయక్ సోనీ లివ్ [3]
2021-ప్రస్తుతం ఫారార్ - కబ్ తక్? హోస్ట్ ఇషారా టీవీ
  1. "Theatre actor Geetanjali Kulkarni gets 'stamp' for film journey". The Times of India. 5 April 2015. Archived from the original on 9 November 2015. Retrieved 3 August 2015.
  2. "www.atulkulkarni.com/". atulkulkarni.com. 3 April 2018. Archived from the original on 5 June 2018. Retrieved 30 May 2018.
  3. "Sandwiched Forever Review: Kunaal and Aahana show is a feel-good Christmas watch" (in ఇంగ్లీష్). India Today. Retrieved 29 December 2020.