జోహన్ బోథా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోహన్ బోథా
బోథా (2009)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోహన్ బోథా
పుట్టిన తేదీ (1982-05-02) 1982 మే 2 (వయసు 42)
జోహన్నెస్‌బర్గ్, ట్రాన్స్‌వాల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 299)2006 2 January - Australia తో
చివరి టెస్టు2010 20 November - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 80)2005 16 November - India తో
చివరి వన్‌డే2012 3 March - New Zealand తో
తొలి T20I (క్యాప్ 13)2006 9 January - Australia తో
చివరి T20I2012 2 October - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2003/04Eastern Province
2004/05Border
2004/05–2010/11Warriors
2009–2012Rajasthan Royals
2011Northamptonshire
2011/12–2014/15Adelaide Strikers
2012/13–2014/15South Australia
2013Delhi Daredevils
2015Kolkata Knight Riders
2015Trinidad and Tobago Red Steel
2015/16–2017/18Sydney Sixers
2018/19–2020/21Hobart Hurricanes
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 5 78 40 90
చేసిన పరుగులు 83 609 201 4,015
బ్యాటింగు సగటు 20.75 19.03 18.27 31.61
100లు/50లు 0/0 0/0 0/0 1/27
అత్యుత్తమ స్కోరు 25 46 34 109
వేసిన బంతులు 1,017 3,823 774 14,656
వికెట్లు 17 72 37 220
బౌలింగు సగటు 33.70 40.50 22.24 32.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 1
అత్యుత్తమ బౌలింగు 4/56 4/19 3/16 6/34
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 36/– 17/– 63/–
మూలం: ESPNcricinfo, 2021 25 July

జోహన్ బోథా (జననం 1982, మే 2) దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియన్ క్రికెటర్, కోచ్. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరపున 2005 - 2012 మధ్యకాలంలో క్రికెట్ ఆడాడు. ఆ దేశ దేశీయ లీగ్‌లలో ఆడటానికి 2012లో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాడు. 2019 జనవరిలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి విరమణ పొందాడు.[1] 2020 డిసెంబరులో, 2020–21 బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తిరిగి వచ్చాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

2005-06 పర్యటనలో 2006 జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తన తొలి టెస్ట్ అరంగేట్రం చేసాడు. బ్యాట్స్‌మన్ మైక్ హస్సీని తన మొదటి టెస్ట్ వికెట్‌గా తీశాడు.[3] 2005–06 విబి సిరీస్‌లో అనేక మ్యాచ్ లు ఆడేందుకు అనుమతించబడ్డాడు. ఫిబ్రవరిలో, బౌలింగ్ నిపుణుడు బ్రూస్ ఇలియట్ విశ్లేషణ తర్వాత బౌలింగ్ నుండి సస్పెండ్ చేయబడ్డాడు.[4] 2006 ఆగస్టులో ఐసీసీ పరీక్ష తర్వాత బౌలింగ్‌కి తిరిగి రావాలని ఆశించాడు. అయితే ఇప్పటికీ ఆమోదయోగ్యమైన 15 డిగ్రీల కంటే ఎక్కువగా తన చేతిని నిఠారుగా ఉంచుతున్నట్లు గుర్తించబడింది.[5]

2006 నవంబరు 21న, బోథా చర్యను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆమోదించింది. అతను మళ్ళీ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు ఎంపికకు అర్హత పొందాడు.[6]

ప్రొటీయా టీ20, వన్డే జట్టుకు కెప్టెన్సీ

[మార్చు]

2010, ఆగస్టు 20న గ్రేమ్ స్మిత్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఫార్మాట్‌లో ఆడటం కొనసాగించాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత స్మిత్ తన వన్డే కెప్టెన్సీని వదులుకోవడంతో బోథా అంతర్జాతీయ వన్డే కెప్టెన్సీని కూడా చేపట్టాడు. నిర్ణయాత్మక అంశం ఏమిటంటే, 2010లో స్మిత్ గాయంతో దూరమైనప్పుడు బోథా దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియాపై సిరీస్ విజయానికి నడిపించాడు.[7]

కోచింగ్ కెరీర్

[మార్చు]

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2017, 2020 సీజన్లలో వరుసగా ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్‌లకు బోథా ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు. 2018, 2019 సీజన్లలో వరుసగా ముల్తాన్ సుల్తాన్‌లకు అసిస్టెంట్ కోచ్, హెడ్ కోచ్‌గా ఉన్నాడు. 2020లో, సిఎస్ఎల్ 2021 ఎడిషన్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[8][9] 2018 నుండి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా ఉన్నాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. "South Africa all-rounder Johan Botha retires from all cricket". International Cricket Council. Retrieved 23 January 2019.
  2. "Marathon man Botha makes shock comeback for BBL|10". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  3. S Africa spinner Botha reported, from BBC Sport, published 6 January 2006
  4. Spinner Botha banned from bowling, from BBC Sport, published 7 February 2006
  5. Botha's action declared illegal, from ESPNcricinfo, published 2 September 2006
  6. Botha's action passed by ICC, from ESPNcricinfo, published 21 November 2006
  7. "Botha to succeed Smith as SA Twenty20 captain". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-06-11.
  8. "South Africa's Johan Botha appointed Islamabad United's head coach for PSL6". Geo. Retrieved 29 December 2020.
  9. "PSL6: Islamabad United announces South Africa's Johan Botha as new head coach for PSL6". The News International. Retrieved 28 December 2020.
  10. "Johan Botha - Coach of Guyana Amazon Warriors CPL T20 Team". www.cplt20.com. Retrieved 2021-06-11.

బాహ్య లింకులు

[మార్చు]