జ్యోతిభూషణ్ భట్టాచార్య
ప్రొఫెసర్ జ్యోతిభూషణ్ భట్టాచార్య (1926 మే 1 - 1998) రాజకీయవేత్త, పండితుడు. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[1] పశ్చిమ బెంగాల్‌లోని రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా పనిచేశాడు.
తొలి జీవితం
[మార్చు]భట్టాచార్య 1926 మే 1న జన్మించాడు.[2] కలకత్తా విశ్వవిద్యాలయం, లీడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, రెండు విశ్వవిద్యాలయాలలో ఎంఏ డిగ్రీలు పొందాడు.[3][4][5] క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారత స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లాడు.[6] భట్టాచార్య 1943లో డెమోక్రటిక్ వాన్‌గార్డ్ నాయకుడు జిబన్‌లాల్ ఛటర్జీతో పరిచయం ఏర్పడింది.[7] ఛటర్జీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించిన తర్వాత, భట్టాచార్య పార్టీకి కీలక నేతగా మారాడు.[7]
వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు
[మార్చు]భట్టాచార్య అస్సాంలోని దిబ్రూగర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో లెక్చరర్‌గా పనిచేశాడు, తరువాత కలకత్తా విశ్వవిద్యాలయానికి మారాడు, అక్కడ ఆంగ్లంలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.[3][6] 1962 నాటి చైనా-ఇండియన్ యుద్ధంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, డబ్ల్యుపిఐకి చెందిన కార్యకర్తలు అరెస్టయ్యాడు.[8] ఈ అరెస్టుల తరంగంలో చిక్కుకున్న డబ్ల్యుపిఐ క్యాడర్‌లలో ప్రముఖ పార్టీ సభ్యుడిగా భట్టాచార్య ఒకరు.[9]
విద్యామంత్రి
[మార్చు]భట్టాచార్య 1967 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ నియోజకవర్గం నుండి గెలిచాడు.[10] 21,153 ఓట్లు (53.74%) వచ్చాయి.[11] 1967-1968 మొదటి యునైటెడ్ ఫ్రంట్ క్యాబినెట్‌లో విద్యా మంత్రిగా పనిచేశాడు.[3][6]
సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి
[మార్చు]భట్టాచార్య 1969 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.[10] 22,941 ఓట్లు (55.95%) వచ్చాయి.[12] 1969-1970 రెండవ యునైటెడ్ ఫ్రంట్ క్యాబినెట్‌లో సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా పనిచేశాడు.[10][6] 1969 మే 28న ఒక గుంపు భట్టాచార్య నివాసంపై దాడి చేసింది.[13]
తరువాతి సంవత్సరాలు
[మార్చు]1971 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో భట్టాచార్య తన స్థానాన్ని కోల్పోయాడు.[14] 13,943 (38.42%)తో రెండవ స్థానంలో నిలిచాడు.[15] ఎన్నికల ప్రచారంలో హింసాత్మక వాతావరణం నెలకొనడంతో నియోజకవర్గాన్ని వదిలి వేరే చోట నివసించాల్సి వచ్చింది.[16] 1971 సెప్టెంబరులో ఇండియన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యొక్క రెండవ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఫాసిజం: ఎ డెవలపింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా అనే తన ప్రచురించని థీసిస్‌ను సమర్పించాడు.[17] థీసిస్ ప్రకారం, కాంగ్రెస్ (ఐ) పాలనలో భారతదేశంలో ఫాసిస్ట్ పాలనా వ్యవస్థ ఏర్పడుతోంది.[18] 1972 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో భట్టాచార్య మళ్లీ బల్లిగంజ్ స్థానంలో పోటీ చేసి 18,181 ఓట్లతో (35.49%) రెండవ స్థానంలో నిలిచారు.[19]
మైనారిటీ వర్గానికి భట్టాచార్య నాయకత్వం వహించడంతో 1976లో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా చీలిపోయింది.[20] భట్టాచార్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు.[20] పార్టీ ఆర్గాన్ గానబిప్లాబ్‌లో 'పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు' ఆరోపణలతో 1976 ప్రారంభంలో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి బహిష్కరించబడ్డాడు.[1] అతని బహిష్కరణ తరువాత అతను కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీని స్థాపించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Asish Krishna Basu (2003). Marxism in an Indian State: An Analytical Study of West Bengal Leftism. Ratna Prakashan. p. 78. ISBN 978-81-85709-73-4.
- ↑ Sudershan K. Savara (1968). International trade and development: UNCTAD II, New Delhi, India, February–March 1968. Commercial Publications Bureau. p. 5.
- ↑ 3.0 3.1 3.2 Times of India (Firm) (1969). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 871.
- ↑ University of Calcutta (1957). Hundred years of the University of Calcutta supplement. University of Calcutta. p. 437.
- ↑ Journal of the Department of English. Vol. 20 (1 ed.). University of Calcutta. 1984. p. 1.
- ↑ 6.0 6.1 6.2 6.3 India Who's who. INFA Publications. 1978. p. 211.
- ↑ 7.0 7.1 West Bengal. Vol. 12. Director of Information. 1964. p. 944.
- ↑ Dasgupta, Salien. Left Unity
- ↑ The Financial Express. Corridors of excellence
- ↑ 10.0 10.1 10.2 Communist Party of India (Marxist). West Bengal State Committee. Election results of West Bengal: statistics & analysis, 1952–1991. The Committee. pp. 379, 418. ISBN 9788176260282.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 141. Election Commission. Retrieved 1 December 2016.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 141. Election Commission. Retrieved 1 December 2016.
- ↑ Indian Recorder and Digest. 1969. p. 37.
- ↑ Socialist India. Vol. 4. Indian National Congress. All India Congress Committee. November 1971. p. 132.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 141. Election Commission. Retrieved 1 December 2016.
- ↑ Jyoti Basu (1998). Documents of the Communist Movement in India: 1971–72. National Book Agency. p. 437. ISBN 978-81-7626-019-0.
- ↑ Religion and Society. Christian Institute for the Study of Religion and Society. 1975. p. 53.
- ↑ Ar Or. Nakl. Ceskoslovenské akademie věd. 1978. p. 95.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 141. Election Commission. Retrieved 1 December 2016.
- ↑ 20.0 20.1 Sajal Basu (1 December 1990). Factions, ideology, and politics: coalition politics in Bengal. Minerva Associates (Publications). p. 133. ISBN 978-81-85195-26-1.