కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ (ఇండియా)
స్వరూపం
కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ (ఇండియా) | |
---|---|
స్థాపకులు | జ్యోతిభూషణ్ భట్టాచార్య |
స్థాపన తేదీ | 1976 |
ప్రధాన కార్యాలయం | పశ్చిమ బెంగాల్ |
కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ అనేది పశ్చిమ బెంగాల్ లోని రాజకీయ పార్టీ. 1976లో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా విడిపోయినప్పుడు జ్యోతిభూషణ్ భట్టాచార్య కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీని స్థాపించారు.[1] భట్టాచార్య కలకత్తా యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్, 1967లో పశ్చిమ బెంగాల్‌లో మొదటి కాంగ్రేసేతర విద్యా మంత్రి అయ్యాడు. ఇది బెంగాలీ జర్నల్ గ్రామ్-నగర్, అజెండా అనే ఆంగ్ల మాసపత్రికను ప్రచురించేది. కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ తన పేరును 1993లో వర్కర్స్ పార్టీగా మార్చుకుంది. ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య 1998లో మరణించాడు. అతను ప్రముఖ పండితుడిగా, మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందాడు.
మూలాలు
[మార్చు]- ↑ Asish Krishna Basu (2003). Marxism in an Indian State: An Analytical Study of West Bengal Leftism. Ratna Prakashan. p. 78. ISBN 978-81-85709-73-4.