టినూ ఆనంద్

వికీపీడియా నుండి
(టిను ఆనంద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టిను ఆనంద్
2010 ఫ్రెంచి ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా టినూ ఆనంద్
జననం
వీరేందర్ రాజ్ ఆనంద్

(1945-10-12) 1945 అక్టోబరు 12 (వయసు 79)
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థమాయో కాలేజ్, అజ్మీర్
వృత్తినటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత
జీవిత భాగస్వామిషహనాజ్ వాహన్వాటి

టినూ ఆనంద్ (జ. మే 4, 1953) ఒక భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు.[1] ఆయన అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. ఇతని తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ ప్రముఖ సినీ రచయిత. సోదరుడు బిట్టు ఆనంద్ సినీ నిర్మాత. కొన్ని బెంగాలీ సినిమాలకు సత్యజిత్ రాయ్ కు సహాయకుడిగా వ్యవహరించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

టినూ ఆనంద్ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ సినిమా పరిశ్రమలో ప్రముఖ రచయిత. టిను మాయో కళాశాలలో చదువుకున్నాడు. ఇందర్ రాజ్ ఆనంద్ మొదట్లో తన పిల్లలిద్దరిని సినీ పరిశ్రమలో ప్రవేశింపజేయడానికి అంతగా ఇష్టపడలేదు. కానీ టినూ కున్న ఆసక్తిని గమనించి అప్పటికే పరిచయం ఉన్న తన స్నేహితుడు సత్యజిత్ రాయ్ దగ్గరికి పంపించాడు.

సినిమాలు

[మార్చు]

సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ సినిమాలో టైం మెషీన్ ను సృష్టించే శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.[2] అంజి సినిమాలో ఆత్మ లింగాన్ని సాధించి అమరుడు కావడానికి ప్రయత్నించే ప్రతినాయకుడుగా నటించాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ సినిమా ఘటోత్కచుడు సినిమాలో రోబో శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.

పాక్షిక జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Amitabh, Rediff.com.
  2. "శివలెంక కృష్ణప్రసాద్ తో ఇంటర్వ్యూ". idlebrain.com. జీవీ. Retrieved 24 October 2016.