టి.బి.విఠల్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.బి.విఠల్ రావు

పదవీ కాలము
1952 – 1962
ముందు none
తరువాత తేళ్ల లక్ష్మీకాంతమ్మ
నియోజకవర్గము ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 16, 1915
సికింద్రాబాదు, భారతదేశం
జీవిత భాగస్వామి సుగంధనీ దేవి
సంతానము 3 కుమారులు, 2 కుమార్తెలు
మతం హిందూ మతం

టి.బి.విఠల్ రావు తెలంగాణకు చెందిన తొలితరం కార్మిక నాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.

విఠలరావు, 1915 ఆగస్టు 16న సికింద్రాబాదులో ఒక కన్నడిగ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి టి.డి.బాలకృష్ణన్. ఈయన విద్యాభ్యాసం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల, బెనారస్లోని కేంద్ర హిందూ కళాశాలల్లో సాగింది.[1]

నిజాం నవాబుతో పాటు స్థానిక భూస్వాముల పెత్తనం కింద ఉన్న సింగరేణి సంస్థలో 1939 నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సింగరేణి కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నేత విఠల్‌రావు. సింగరేణి తొలినాళ్లలో వెట్టిచాకిరీ వంటి నిర్భంధాలకు వ్యతిరేకంగా పోరాడాడు. పనిగంటల తగ్గింపు, పనికి తగిన వేతనం, కార్మికులకు వసతులు వంటి వాటికోసం ఆయన ఉద్యమించాడు. రహస్య జీవితాన్ని గడుపుతూనే ఆయన కార్మిక హక్కుల కోసం ఉద్యమించాడు. నిజామ్‌ రైల్వే యూనియన్‌ నాయకుడిగా ఉన్న విఠల్‌ రావు, 1951లో ఏ.ఎన్.టీ.యూ.సి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1954లో జరిగిన సింగరేణి కాలరీస్ కార్మిక సంఘం మహాసభల్లో విఠల్‌ రావు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "Second Lok Sabha - Members Bioprofile". Retrieved 6 December 2017.