టి.వి. నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, నాటకరంగాలతోపాటు టెలివిజన్ రంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. వివిధ ఛానల్లలో ప్రసారమైన కార్యక్రమాలు, సీరియల్ మొదలైన వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు.

టి.వి. నంది పురస్కారాలు - 2000[మార్చు]

పురస్కార కమిటీ[మార్చు]

నివేదిక[మార్చు]

2000 సంవత్సరం ప్రసారమైన టి.వి. ఫిలిమ్స్ లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18.05.2001న నియమించిన కమిటీలో ఛైర్మన్, కన్వీనర్ తో సహా 11మంది సభ్యులు ఉన్నారు. కమిటీ ఛైర్మన్ జంధ్యాల మరణించడంతో ప్రభుత్వం 26.07.2001న దూరదర్శన్ కేంద్రం మాజీ డైరెక్టర్ ఆర్.ఆర్.కె. శ్రీని కమిటీ ఛైర్మన్ గా నామినేట్ చేసింది. 03.09.2001న కమిటీ తొలి సమావేశం జరిగింది. అవార్డుల నిబంధనల ప్రతులను కన్వీనర్ అందజేశారు.

వివిధ విభాగాల్లో వచ్చిన ఎంట్రీల వివరాలు: టి.వి. ఫిలిమ్స్ 4, టి.వి. సీరియల్స్ రెగ్యులర్ సీరియల్స్ 7, మెగా సీరియల్స్ 11, డైలీ సీరియల్స్ 8, టి.వి. బాలల చిత్రాలు 2, టి.వి. డాక్యుమెంటరీ చిత్రాలు 3, టి.వి. సామాజిక చిత్రాలు 8.

కమిటీ సభ్యులకు చిత్రాల ప్రదర్శన 10.09.2001 నుండి 03.11.2001 వరకు జరిగింది. ఇద్దరు సభ్యులు మినహా మిగతావారంతా ఈ చిత్రాలు చూశారు. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులు మొదలైన వివరాలతో అవార్డుల పత్రాన్ని రూపొందించి ఛైర్మన్, సభ్యుల సంతకాలతో ప్రభుత్వానికి అందజేశారు. 24.08.2002న హైదారాబాద్ లో పురస్కరాలు అందజేశారు.

పురస్కారాల వివరాలు[మార్చు]

  • ఉత్తమ డైలీ సీరియల్ (ప్రథమ, బంగారు నంది) - వసంత కోకిల (నిర్మాత: ఎస్. రామకృష్ణారెడ్డి, దర్శకుడు: యు. నారాయణరావు, నటి: నీరజ, నటుడు: కె.వి.వి. సత్యనారాయణ)
  • ఉత్తమ డైలీ సీరియల్ (ద్వితీయ, వెండి నంది) - విధి (నిర్మాత: సి.హెచ్. రామోజీరావు, దర్శకుడు: అనీల్ కుమార్, నటి: కిన్నెర, నటుడు: రాజ్ కుమార్)
  • ఉత్తమ మెగా సీరియల్ (ప్రథమ, బంగారు నంది) - శారద (నిర్మాత: కె. పద్మజ, దర్శకుడు: కాపుగంటి రఘు, నటి: ఝాన్సీ, నటుడు: జాకీ)
  • ఉత్తమ మెగా సీరియల్ (ద్వితీయ, వెండి నంది) - గాజుపూలు (నిర్మాత, దర్శకురాలు: బిందు నాయుడు, నటుడు: నూతన్ ప్రసాద్)
  • ఉత్తమ రెగ్యులర్ సీరియల్ (ప్రథమ, బంగారు నంది) - పల్లెవాసం - పట్నవాసం (నిర్మాత, దర్శకుడు, నటుడు: ఎం. బాలయ్య, నటి: పి. కృష్ణవేణి)
  • ఉత్తమ రెగ్యులర్ సీరియల్ (ద్వితీయ, వెండి నంది) - అడ్డుగోడలు (నిర్మాత, దర్శకుడు: తేజస్ ధన్ రాజ్, నటి: మాధవీ చోప్రా, నటుడు: మురళీమోహన్)
  • ఉత్తమ టెలిఫిల్మ్ (ప్రథమ, బంగారు నంది) - మిస్టర్ మిలీనియం (నిర్మాత: సి.హెచ్. రామోజీరావు, దర్శకుడు: వి. జ్యోతీంద్రనాథ్, నటి: హైమావతి, నటుడు: ఎస్.కె. మిశ్రో)
  • ఉత్తమ టెలిఫిల్మ్ (ద్వితీయ, బంగారు నంది) - వాయిదాల పెళ్ళి (నిర్మాత: సి.హెచ్. రామోజీరావు, దర్శకుడు: యు. నారాయణరావు, నటి: కల్పన, నటుడు: చిన్నా)
  • ఉత్తమ సామాజిక చిత్రం (ప్రథమ, బంగారు నంది) - వివిధ రంగాల్లో స్త్రీలు (నిర్మాత: డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, హైదరాబాదు, దర్శకురాలు: కె. పద్మావతి)
  • ఉత్తమ సామాజిక చిత్రం (ద్వితీయ, బంగారు నంది) - కొలిమి (నిర్మాత: డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, హైదరాబాదు, దర్శకుడు: వి. రాజశేఖర్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం (ప్రథమ, బంగారు నంది) - అమర గాయకుడు (నిర్మాత: తుమ్మల సర్వారాయుడు, దర్శకురాలు: నామన రామదాసు నాయుడు)
  • ఉత్తమ సామాజిక చిత్రం (ద్వితీయ, బంగారు నంది) - సమ్మక్క - సారలమ్మ (నిర్మాత: డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, హైదరాబాదు, దర్శకుడు: డి.వి.ఎస్.ఎస్. గోపాలకృష్ణమూర్తి)

పురస్కార గ్రహీతలు[మార్చు]

  • ఉత్తమ నటుడు - ఎస్.కె. మిశ్రో (మిస్టర్ మిలీనియం)
  • ఉత్తమ నటి - ఝాన్సీ (శారద)
  • ఉత్తమ సహాయనటుడు - వినోద్ బాల (కస్తూరి)
  • ఉత్తమ సహాయనటి - కృష్ణశ్రీ (అనుబంధం)
  • ఉత్తమ విలన్ - జి.ఎస్. హరి (శారద)
  • ఉత్తమ హాస్యనటుడు - ఏడిద శ్రీరాం (ఈతరం కథ)
  • ఉత్తమ బాలనటి - శ్రీవిద్య (సంఘర్షణ)
  • ఉత్తమ దర్శకురాలు - బిందునాయుడు (గాజుపూలు)
  • ఉత్తమ దర్శకుడు - అనిల్ కుమార్ (విధి)
  • ఉత్తమ దర్శకుడు - వి. జ్యోతీంద్రనాథ్ (మిస్టర్ మిలీనియం)
  • ఉత్తమ దర్శకురాలు - కె. పద్మావతి (వివిధ రంగాల్లో స్త్రీలు)
  • ఉత్తమ దర్శకుడు - వి. రాజశేఖర్ (కొలిమి)
  • ఉత్తమ దర్శకుడు - నామన రామదాసునాముడు (అమర గాయకుడు)
  • ఉత్తమ దర్శకుడు - డి.వి.ఎస్.ఎస్. గోపాలకృష్ణమూర్తి (సమ్మక్క - సారలమ్మ)
  • మొదటి చిత్ర ఉత్తమ దర్శకుడు - కాపుగంటి రఘు (శారద)
  • ఉత్తమ కథా రచయిత - జి. అనిల్ కుమార్ (మిస్టర్ మిలీనియం)
  • ఉత్తమ మాటల రచయిత - ఆకెళ్ల (పల్లెవాసం - పట్నవాసం)
  • ఉత్తమ కథన రచయిత - యు. నారాయణరావు (వసంత కోకిల)
  • ఉత్తమ పాటల రచయిత - వాసంత సమీరంలా (ఋతురాగాలు)
  • ఉత్తమ కెమెరామెన్ - వి. రాజారావ్ (వసంతకోకిల)
  • ఉత్తమ గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (సంఘర్షణా సంఘర్షణ, సంఘర్షణ)
  • ఉత్తమ గాయని - ఎస్. జానకి (ఇది దీపీలు వెలిగే రాత్రి, అనుబంధం)
  • ఉత్తమ ఎడిటర్ - వి.వి.ఆర్. శేషారెడ్డి (వసంతకోకిల)
  • ఉత్తమ కళా దర్శకుడు - సురేందర్ చాచా (అడ్డుగోడలు)
  • ఉత్తమ నృత్య దర్శకులు - ప్రమీలారాణి (శివలీలలు)
  • ఉత్తమ శబ్దగ్రాహకుడు - లాజరస్ (కథామాలిక)
  • ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - పి. రాంబాబు (శివలీలలు)
  • ఉత్తమ వస్త్రాలంకరణ - బాబూరావు (వివలీలలు)
  • ఉత్తమ సంగీతం - హంసలేఖ (శ్రీ గురు రాఘవేంద్రస్వామి)
  • ఉత్తమ గ్రాఫిక్స్ - ఈటివి (వివలీలలు)
  • ప్రత్యేక జ్యూరి (దర్శకత్వం) - కె. రాఘవేంద్రరావు (శ్రీ గురు రాఘవేంద్రస్వామి)
  • ప్రత్యేక జ్యూరి (కెమెరా) - మీర్ (శివలీలలు)
  • ప్రత్యేక జ్యూరి (నటుడు) - కృష్ణ భగవాన్ (వసంతకోకిల)
  • ఉత్తమ నిర్మాత - ఎస్. రామకృష్ణా రెడ్డి (వసంతకోకిల)
  • ఉత్తమ నిర్మాత - సి.హెచ్. రామోజీరావు (మిస్టర్ మిలీనియం, వాయిదాల పెళ్ళి, విధి)
  • ఉత్తమ నిర్మాత - తుమ్మల సర్వారాయుడు (అమర గాయకుడు)
  • ఉత్తమ నిర్మాత - కె. పద్మజ (శారద)
  • ఉత్తమ నిర్మాత - డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, హైదరాబాదు (వివిధ రంగాల్లో స్త్రీలు, కొలిమి, సమ్మక్క - సారలమ్మ)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - కె.వి.వి. స్యనారాయణ (వసంతకోకిల)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - నీరజ (వసంతకోకిల)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - రాజ్ కుమార్ (విధి)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - కిన్నెర (విధి)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - జాకీ (శారద)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - నూతన్ ప్రసాద్ (గాజుపూలు)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - ఎం. బాలయ్య (పల్లెవాసం - పట్నవాసం)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - పి. కృష్ఱవేణి (పల్లెవాసం - పట్నవాసం)
  • ఉత్తమ నిర్మాత, దర్శకుడు - తేజాస్ ధన్ రాజ్ (అడ్డుగోడలు)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - మురళీమోహన్ (అడ్డుగోడలు)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - మాధవీ చోప్రా (అడ్డుగోడలు)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - హైమావతి (మిస్టర్ మిలీనియం)
  • ఉత్తమ లీడింగ్ యాక్టర్ - చిన్నా (వాయిదాల పెళ్ళి)
  • ఉత్తమ లీడింగ్ యాక్ట్రస్ - కల్పన (వాయిదాల పెళ్ళి)

మూలాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ వారి 2000 టి.వి. నంది పురస్కారాల ప్రత్యేక సంచిక.