జైసింగ్ రాథోడ్

వికీపీడియా నుండి
(డాక్టర్. జైసింగ్ రాథోడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జైసింగ్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) డైరెక్టర్[1][2]. ప్రముఖ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్, ఆదిలాబాదు జిల్లా నేరడిగొండ మండలం, చిన్న బుగ్గారాం తాండా నివాసి.


JAISING RATHOD
జైసింగ్ రాథోడ్
స్థానిక పేరుజైసింగ్ రాథోడ్
జననం(1970-06-05)1970 జూన్ 5
చిన్న బుగ్గారాం
నివాస ప్రాంతంచిన్న బుగ్గారాం: గ్రామము
మండలం: నేరడిగొండ
జిల్లా:ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా
విద్యఎంబీబీఎస్,ఎంఎస్(కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్) .
భార్య / భర్తసుజాతా రాథోడ్
పిల్లలుడా.అభిషేక్ రాథోడ్ డా.వెన్నెల రాథోడ్
తల్లిదండ్రులురాథోడ్ సోమ్లా-బాజుబాయి

జననం, విద్య[మార్చు]

జైసింగ్ రాథోడ్ 1970 జూన్ 05 లో తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం లోని చిన్న బుగ్గారాం తాండాకు చెందిన రాథోడ్ సోమ్లా నాయక్, బాజుబాయి లంబాడీ గిరిజన దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పార్డి బోథ్ లో చదువుకున్నాడు. 1988లో పదో తరగతి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ జుమేరాత్ పేట్ నిర్మల్ లో 10 తరగతి చదివాడు.1988-1990 లో ఇంటర్మిడియట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఉట్నూరులో చదివాడు . 1991లో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) వరంగల్ లో ఎంబిబిఎస్ లో చేరి,1996లో ఉత్తీర్ణత సాధించాడు .2005 సంవత్సరం నుండి 2008 సంవత్సరం వరకు కాకతీయ మెడికల్ కాలేజి వరంగల్ లోనే ఎంఎస్ ఆర్థోపెడిక్ పీజీ డిగ్రీ పట్టా అందుకున్నాడు .

వైద్య సేవలు[మార్చు]

నేను1997 లో హౌస్ సర్జన్ పూర్తి చేసి 1997 నవంబరు నుండి 1998 జనవరి వరకు మంచిర్యాల జిల్లా సింగరేణి ఏరియా ఆసుపత్రి బెల్లంపల్లిలో ప లిని చేశాడు. 1998 జూన్ నుండి 2005 సెప్టెంబరు వరకు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మల్ లో వైద్య అధికారిగా విధులు నిర్వర్ధిస్తు అప్పటి నిర్మల్ డివిజన్ కు డిప్యూటీ డియంహెచ్ఓగా అదనపు బాధ్యతలు తీసుకోని అనేక వైద్య శిబిరాలు నిర్వహించాడు. 2008-2009 వరకు నిర్మల్ డిప్యూటీ డియంహెచ్ఓ గా పని చేశాడు. 2021జూన్ నుండి 2021 డిసెంబరు వరకు నల్గొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ గా సేవలందించాడు[3]. ఆ తర్వాత పదొన్నతి పొంది బదిలి పై తన స్వంత జిల్లా ఆదిలాబాదు కు వచ్చి 2021 డిసెంబరు 31 నుండి ఆదిలాబాదు రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ విధులు నిర్వర్ధిస్తు, రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో వచ్చే రోగులకు మెరుగైన[4] వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నాడు[5][6].

మూలాలు[మార్చు]

  1. Today, Telangana (2022-12-06). "RIMS director advises public to utilize services of super specialty hospital". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  2. Srinivas, Pillalamarri (2022-10-07). "Adilabad RIMS a showpiece with no specialty services". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  3. "Nalgonda, Nalgonda : నల్గొండ: జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డా. జైసింగ్ రాథోడ్ బదిలీ..అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా నియామకం | Public App". Public (in ఇంగ్లీష్). Archived from the original on 2024-03-10. Retrieved 2024-03-10.
  4. ABN (2023-02-09). "రోగులకు మెరుగైన వైద్యం అందించాలి". Andhrajyothy Telugu News. Retrieved 2024-03-10.
  5. "జైసింగ్ రాథోడ్ దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-03-10.
  6. "రిమ్స్‌లో జారిపడిన కార్మికుడికి గాయాలు". Sakshi. 2023-08-06. Retrieved 2024-03-10.