Jump to content

బి.వి.పట్టాభిరామ్

వికీపీడియా నుండి
(డా.బి.వి.పట్టాభిరాం నుండి దారిమార్పు చెందింది)
డా.బి.వి.పట్టాభిరామ్
డా.బి.వి.పట్టాభిరామ్
వృత్తిసైకాలజిస్టు
ప్రసిద్ధిడా.బి.వి.పట్టాభిరామ్
వెబ్‌సైటు
http://www.pattabhiram.com/

బి.వి.పట్టాభిరాం (భావరాజు వేంకట పట్టాభిరాం) రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. అతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేసాడు. అతను విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహిస్తున్నారు. అతను దూరదర్శన్ లో అనేక మేజిక్ షోలు నిర్వహించాడు. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు వ్రాసాడు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో "మాయావిజ్ఞానం" పేరిట వ్యాసాలు వ్రాసాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నాడు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేసాడు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న అతను ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించాడు.

హిప్నోసిస్ పై ఇతను చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ఇతనికి గౌరవ పౌరసత్వంకూడా ప్రధానం చేశారు.

స్వయంగా ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటరును నెలకొల్పి నిర్వహిస్తున్నాడు. అతను తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట, జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాదు, మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRD), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డిఆర్ డి ఎల్, డెల్, డెలాయిట్, ఇంకా రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్, మహీంద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజి, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నాడు. వ్యక్తిత్వ వికాసం మీద, మానవవిలువల మీద, మ్యాజిక్ మీద తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో 110కి పైగా గ్రంథాలు రచించారు.

రచనలు

[మార్చు]

పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో ద్వారా ప్రచురితమైన రచనలు

  • చాణక్యతంత్రం
  • మాజిక్ ఆఫ్ మహాత్మా
  • ఒత్తిడి కూడా వరమే
  • వైజ్ఞానిక హిప్నాటిజం
  • సర్దుకుపోదాం... రండి
  • కాలేజ్‌ క్యాంపస్‌
  • సాఫ్ట్స్కిల్స్‌
  • నాలుగోఆపిల్‌
  • కౌన్సిలింగ్‌ సీక్రెట్స్‌
  • నేనుసైతం
  • కష్టపడి పనిచేయొద్దుఇష్టపడి పనిచేయండి!
  • సూత్రధారులు
  • ఒక్కడు
  • గుడ్‌ పేరెంట్‌
  • గుడ్‌ స్టూడెంట్‌
  • కష్టపడి చదవొద్దు-ఇష్టపడి చదవండి
  • జీనియస్‌ మీరుకూడా...
  • మాటేమంత్రం
  • టర్నింగ్‌ పాయింట్‌
  • పాఠం చెప్పడం ఒక కళ
  • గుడ్‌ టీచర్‌
  • విజయం మీదే
  • లీడర్‌షిప్‌
  • మాస్టర్‌మైండ్‌
  • మీరు మారాలనుకుంటున్నారా?
  • మైండ్‌ మేజిక్‌
  • నో ప్రాబ్లెం (సందేహాలు-సమాధానాలు)
  • సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌
  • కమ్యూనికేషన్స్‌ మీ విజయానికి పునాది
  • నాయకత్వలక్షణం విజయానికి తొలిమెట్టు
  • జ్ఞాపకశక్తి – ఏకాగ్రత
  • మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందండి
  • సెల్ఫ్‌ హిప్నాటిజం-రిలాక్సేషన్‌
  • పాజిటివ్‌ థింకింగ్‌
  • గుడ్‌ పేరెంట్స్‌+బెటర్‌ టీచర్స్‌ = బెస్ట్‌ స్టూడెంట్‌
  • అద్భుత ప్రపంచం అతీంద్రియశక్తులు
  • మాయావినోదం పేరున :-మేథ్స్‌ మేజిక్‌, సూపర్‌ మేజిక్‌, స్కూల్‌ మేజిక్‌, సైన్స్‌ మేజిక్‌, స్టూడెంట్‌ మేజిక్‌
  • బంగారుబాట పేరున :- జాతినేతలు, కళాకారులు, సాహిత్యవేత్తలు, సమాజసేవకులు, శాస్త్రవేత్తలు, స్ఫూర్తిప్రదాతలు
  • వెలుగుబాట పేరున:- ప్రపంచ ప్రఖ్యాత, శాస్త్రవేత్తలు-1, 2, 3, ప్రఖ్యాత భారతీయశాస్త్రవేత్తలు, స్ఫూర్తిప్రదాతలు-1, 2, 3, 4
  • ఎదగడానికి ఏడు మెట్లు పేరున :- ఆత్మవిశ్వాసం, స్వయంకృషి, దేశభక్తి, ఆత్మాభిమానం, మనోబలం, పట్టుదల, క్రమశిక్షణ
  • Genius you too (Eng)
  • Mind Magic (Eng)
  • Master Mind (Eng)
  • Good Teacher (Eng)
  • Soft Skills (Eng)
  • Winner’s Mantras (Eng)

పురస్కారాలు

[మార్చు]
  1. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 2013 ఏప్రిల్ 11) [1]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.

వనరులు

[మార్చు]
  1. ఎమెస్కో వెబ్‌లో పట్టాభిరామ్‌ గారి పుస్తకాలు Archived 2022-01-29 at the Wayback Machine
  2. అమెజాన్‌లో పట్టాభిరామ్ గారి పుస్తకాలు
  3. ఫ్లిప్‌కార్ట‌్‌లో పట్టాభిరామ్ గారి పుస్తకాలు Archived 2022-01-29 at the Wayback Machine
  4. కీర్తి పురస్కార గ్రహీతల జాబితా (1986-2014)
  5. విశ్వవిద్యాలయ ప్రచురణ తెలుగువాణి సంచిక (ఏప్రిల్ - ఆగష్టు 2016)లో 2014 కీర్తి పురస్కార వివరాలు Archived 2019-05-27 at the Wayback Machine
  6. https://www.youtube.com/watch?v=ElJD-O_9iKcయూట్యూబులో...

వెలుపలి లంకెలు

[మార్చు]