డిబి చారి
Jump to navigation
Jump to search
డి.బి. చారి (జననం డిసెంబరు 18, 1973) ప్రముఖ సినీ గీత రచయిత.
జననం
[మార్చు]ఈయన దివిలి వెంకటాచారి, ప్రభావతి దంపతులకు తూర్పుగోదావరి జిల్లాలోని కూనవరం మండలం, కూనవరంలో (పూర్వపు ఖమ్మం జిల్లా) జన్మించాడు.
విద్యాభ్యాసం
[మార్చు]ప్రాథమిక విద్య కూనవరం లోనూ, ఇంటర్మీడియట్ , డిగ్రీ భధ్రాచలం లోనూ, న్యాయశాస్త్ర విద్య అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోను అభ్యసించాడు.
కళారంగం
[మార్చు]ప్రజానాట్య మండలి వంటి ప్రముఖ కళా సాంస్కృతిక సంస్థలకు వందలాది పాటలు రచించటమే గాక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గేయ, సంభాషణల రచయితగా పనిచేస్తున్నాడు.
సినీ ప్రస్థానం
[మార్చు]1. భగీరధుడు
2. ఆఖరీ రాస్తా (బోజ్ పురి)
3. శివ (బోజ్ పురి) (సురేష్ ప్రొడక్షన్)
4. నేస్తమా (ఆకాష్ హీరో)
5. అర్థం చేసుకోరూ!
6. వేడుక
7. చక్రి
8. అల్లరి మనస్సు
9. నందిని (నంది అవార్డ్ పొందిన బాలల చిత్రం)