డేటన్ హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేటన్ హిందూ దేవాలయం
మే 2018
మే 2018
భౌగోళికం
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంఒహియో
ప్రదేశండేటన్
ఎత్తు260 మీ. (853 అ.)
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1985

డేటన్ హిందూ దేవాలయం, ఒహియో రాష్ట్రంలోని బీవర్‌క్రీక్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది గ్రేటర్ డేటన్ ఏరియాలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో వేంకటేశ్వరుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, గణేశుడు, రాధా కృష్ణ దేవాలయాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

1976లో[1] ప్రవాస భారతీయులు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. డేటన్‌ ప్రాంతంలో ప్రవాస భారతీయుల కోసం ఒక సమాజాన్ని నిర్వహించడంలో ఎవి రంగరాజన్ కీలకపాత్ర పోషించాడు. అతను దేవాలయ వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఉన్నాడు.[2] 1985లో బీవర్‌క్రీక్‌లో ఒక దేవాలయం ఏర్పాటు చేయబడింది.[3] 2009లో పూజా మందిరం నిర్మించేందుకు ఆలయం పక్కనే భూమిని తీసుకొని, 2011లో దేవాలయ నిర్మాణం ప్రారంభించి, రెండు సంవత్సరాలలో పూర్తయింది.[4] ఈ నిర్మాణాల సమయంలో, భగవాన్ చంద్రమౌళి, త్రిపుర సుందరి, భూదేవి, లక్ష్మి, నవగ్రహాల పుణ్యక్షేత్రాలు కూడా నిర్మించబడ్డాయి. ప్రారంభోత్సవ సమయంలో ఆరురోజులపాటు పండుగలు జరిగాయి.[4]

సంస్థ

[మార్చు]

డేటన్ హిందూ దేవాలయాన్ని హిందూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఇంక్ నిర్వహిస్తోంది.[5] ఈ సంస్థలో డేటన్ హిందూ దేవాలయం కార్యనిర్వాహక కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ట్రస్టీల బోర్డు ఉన్నాయి.[6] హిందూ టెంపుల్ ఆఫ్ డేటన్ నుండి ప్రతి రెండు నెలలకొకసారి సంస్థ, సేవలు, వార్తలు, మతపరమైన సమాచారంతో మందిర్ వాణి పేరుతో ఒక పత్రికను ప్రచురించబడుతోంది.[7] దేవాలయం విరాళాలు, నిధుల సేకరణ, సేవల ద్వారా డబ్బును సేకరిస్తుంది.

సేవలు, సంఘం

[మార్చు]

కొన్ని వందలమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.[4] ఇద్దరు పూజారులు హిందూ సంప్రదాయాల ప్రకారం సేవలు చేస్తుంటారు.[6] ప్రత్యేక ప్రార్థనలు, సేవలకు రుసుము వసూలు చేస్తున్నారు.[8] అనేక రకాల కార్యక్రమాలు, సభలు, సమావేశాలు కూడా నిర్వహించబడుతాయి.[6] ప్రతి ఆదివారం వేంకటేశ్వరుడు పవిత్ర స్నానం, సోమవారం శివ స్నానం ఉంటాయి.[9] హిందూ టెంపుల్ ఆఫ్ డేటన్ ప్రతి రోజూ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు తెరిచి ఉంటుంది, శని, ఆదివారాలు తప్ప, అది ఉదయం 9:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది.[10]

డేటన్ హిందూ దేవాలయం కమ్యూనిటీ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రతివారం టేబుల్ టెన్నిస్ ఆటలు, వార్షికోత్సవ వేడుకలు, పిల్లల కోసం వేసవి శిబిరాలు, ఉపన్యాసాలు, యోగా తరగతులు ఉంటాయి.[9]

మూలాలు

[మార్చు]
  1. "Hindu Temple Of Dayton". Database. All Hindu Temples. Archived from the original on 12 మే 2014. Retrieved 5 February 2022.
  2. "Obit: Rangarajan A. The Temple is currently owned by the parents of Vishwanathan Ramesh". My Lapore Times. Lapore. 24 July 2010. Retrieved 5 February 2022.
  3. Gnau, Thomas (7 May 2007). "Dayton Area's Second Hindu Temple Dedicated". Dayton Daily News. Dayton, Ohio. Retrieved 5 February 2022.
  4. 4.0 4.1 4.2 McCabe, Ginny (8 May 2013). "Beavercreek Hindu temple holds weekend events". Dayton Daily News. Dayton, Ohio. Retrieved 5 February 2022.
  5. "HINDU COMMUNITY ORGANIZATION INC" (database). Non-profit database. Guide Star.Org. Retrieved 5 February 2022.
  6. 6.0 6.1 6.2 "Hindu Temple of Dayton". Temple website. Dayton, Ohio: Hindu Temple of Dayton. Archived from the original on 5 సెప్టెంబరు 2014. Retrieved 5 February 2022. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "htd" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. "Mandir Vani: Our Newsletter". Dayton, Ohio: Hindu Temple of Dayton. Archived from the original on 4 సెప్టెంబరు 2014. Retrieved 5 February 2022.
  8. Beyerlein, Tom (22 December 2012). "Lawsuits, tax bills trail Hindu priest who bought, shuttered Dayton landmark". Dayton Daily News. Dayton, Ohio. Retrieved 5 February 2022.
  9. 9.0 9.1 "29th Temple Anniversary" (PDF). Mandir Vani. Dayton, Ohio. March 2014. Archived from the original (PDF) on 13 May 2014. Retrieved 5 February 2022.
  10. "Hindu Temple Of Dayton in Beavercreek". Retrieved 2022-07-09.