డొక్కా మాణిక్యవరప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డొక్కా మాణిక్యవరప్రసాద్
డొక్కా మాణిక్యవరప్రసాద్


శాసన మండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 - 2023 మార్చి 29

శాసన మండలి సభ్యుడు
పదవీ కాలం
2017 – 2023

శాసన సభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2014
నియోజకవర్గం తాడికొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-03-05) 1962 మార్చి 5 (వయసు 62)
గుంటూరు,
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2020- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ (2014- 2020), భారత జాతీయ కాంగ్రెస్ (2004-2014)
సంతానం
  • దివ్య(కుమార్తె)
  • లోహిత్ (కుమారుడు)
  • జోయల్ (కుమారుడు)
నివాసం గుంటూరు
మతం హిందూ
వెబ్‌సైటు http://dokkamanikyavaraprasad.com [dead link]

డొక్కా మాణిక్య వర ప్రసాదరావు (జననం 1962 మార్చి 5) భారతదేశ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో వున్నపుడు అధికారిక ప్రతినిధి.[1] అతడు తాడికొండ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై 2004 నుండి 2014 వరకు తన సేవలనందించాడు. ఆ తరువాత టిడిపి పార్టీ తరపున శాసనమండలి సభ్యునిగా ఎన్నికైనా, 2020లో వై ఎస్ ఆర్ సి పికి మారి, మరల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడు.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

మాణిక్య వరప్రసాద్ 1962 మార్చి 5 న డొక్కా దేవ భిక్షం, లోలమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన పులిపాడు గ్రామంలో జన్మించాడు. అతడు స్థానిక ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు తరువాత గుంటూరు జిల్లాలోని గురజాల ప్రభుత్వ కళాశాలలో కళాశాల విద్యనభ్యసించాడు. అతడు మాచెర్ల లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. తరువాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ న్యాయ కళాశాలలో న్యాయవిద్యనభ్యసించాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.ఎం పూర్తిచేసాడు. ప్రస్తుతం "లౌకికవాదం, భారత రాజ్యాంగం" అనే అంశమీద హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేస్తున్నాడు.

జీవితం

[మార్చు]

మాణిక్య వరప్రసాద రావు 2004 శాసన సభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతడి మొదటి సారి తాడికొండ శాసన సభ్యునిగా 2004 నుండి 2014 వరకు పనిచేసాడు. అతడు ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సెకండరీ విద్యా మంత్రిగా పనిచేసాడు. తరువాత గ్రామీణాభివృద్ధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంత్రిగా కూడా పనిచేసాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత అతడు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాల్గొనలేదు. ఆ తరువాత తెలుగు దేశం పార్టీలో చేరాడు.[3]

అతడు దక్షిణ రైల్వేలో అధికార పదవిని వదలి రాజకీయాలలోనికి ప్రవేశించాడు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితుడై ఆ పార్టీలోనికి చేరాడు. అతడు కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం నకు నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించిన కార్యక్రమాలలో ముఖ్యమైన పత్రాల సమప్రణలో కీలక భూమిక పోషించాడు.

ప్రజల ప్రతినిధులను ప్రజలపట్ల వారి బాధ్యతలను గుర్తించటానికి ఆయన ఎన్నడూ సంశయించలేదు.

మూలాలు

[మార్చు]
  1. "Dokka backs lawyers' demand". Archived from the original on 2012-11-08. Retrieved 2018-04-24.
  2. Sakshi (22 March 2019). "తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ". Sakshi. Archived from the original on 11 జూలై 2021. Retrieved 11 July 2021.
  3. "Manikya Vara Prasad joins TDP". 2015-08-31.

బయటి లింకులు

[మార్చు]