Jump to content

డౌమతం

వికీపీడియా నుండి

భారతీయ, చైనీయ సంస్కృతులు రెండూ చాలా పురాతనమయినవె. ఈ రెండింటికి మధ్య ఒక సామ్యం కూడా ఉంది. అది మరి ఏ ఇతర సంస్కృతికి లేదు. నాతి నుంచి నేటివరకు అవిచ్ఛిన్నంగా కొనసగాయి. మిగతా ప్రాచీన సంస్కృతులు పుట్టి అంతరించాయి. వాటి స్థానాల్లో వెలిసిన సంస్కృతులకు వాటికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు ప్రాచీన ఈజిప్టు సంస్కృతి అంతరించిన తరువాత దాని స్థానంలో వచ్చిన సంస్కృతి పూర్తిగా భిన్నమయింది. భారతదేశంలో నాటి వేదమంత్రాలు-గాయత్రీ మంత్రం- నేతికీ పఠించబడుతు ఉన్నాయి. చైనాలో డౌ (TAO) వాదానికి ముందరి అంశాలు గూడ నాటి నుంచి నేటి వరకు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ రెండు నాగరికతలు స్తబ్దాలని ఏమీ మార్పు చెందలేదని భావించరాదు.

విదేశీ మతాల చరిత్ర

[మార్చు]

చైనా కున్న సుసంపన్నమయిన సంస్కృతి మరి ఏ దేశానికి లేదు. ప్రచ్య, పాశ్చాత్య సంస్కృతులని సంస్కృతులను విభజించేటప్పుడు, ప్రాచ్య సంస్కృతి అంటే ఇండియా, చైనా, జపాను ల సంస్కృతికి సంబంధం ఏమీ లేదు. రెండూ రెండు వేరె వేరు ప్రపంఆలే. ఆ మాటకొస్తే అప్పటి రెండు దేశాల మధ్య తేడాలే ఎక్కువ. ఇండియాలో కోట్లాది దేవతలతో సతమవుతూ ఉంటే, చైనాకు ఈ ప్రపంచం తప్ప "మరో ప్రపంచం" లేదు. భారతదేశం రెండు ముఖ్యమయిన మతాలను తయారు చేసింది. ఒకటి తన కోసం రెండవది ఎగుమతి కోసం. చైనా గూడా రెండు మతాలను తయరు చేసింది. అయితే వీటిని అసలు మతాలనవచ్చా అనేది విజ్ఞుల ప్రశ్న.

మతం అంటే దేవునిపై విశ్వాసం అని చెప్పే పాశ్చాత్యులు (యూదు, క్రైస్తవ, ఇస్లావ్ మతాలు) తమను అత్యంత విశ్వాసులుగా హిందువులను అంధ విశ్వాసులుగ, కన్ఫ్యూషియనిజాన్ని పూర్వ పురుషుల పూజగా వర్ణిస్తారు. అందుకని చైనీస్ సంస్కృతి అత్యంత మతైకమని చప్పచ్చునా అంటారు.

భారతదేశంలో మతం ఆధ్యాత్మికమైతే, పాశ్చాత్యంలో మతం ద్వైతం, దైవ కేంద్రీకృతం అయితే, చైనా మతం ప్రకృతిని కేంద్రంగా చేసుకొంది. పాశ్చాత్య మతం దేవుణ్ణి అతై ప్రాకృతికం, పార లౌకికం చేసింది. హిందూ మతానికి గూడ ఊపిరి "అతిప్రాకృతిక" ప్రపంచంలోనే ఉంది. అందుకని ఈ రెండింతికి లక్ష్యం ఈ లోకంలో కాక బాహ్య లోకంలో ఉంది. అందుకని జీవితం, చూపు ఆ వైపుకే నిర్దేశితమయ్యాతి. అందుకని మనిషి ఈ ప్రపంచంలో పరాయివారుగా ఉంటున్నారు. ఈ అస్తిత్వం కలుషిత మయింది. అందుకని తనకు తాను కాదనుకోవాలి. తను మారాలి. ఇప్పుడున్న తనకు, తానుపూర్తిగా వైదేశికుడు కావాలి. కొత్త మనిషి కావాలి. అప్పుడే మతస్తుడవుతాడు అంటుంది పాశ్చాత్యమతం.

హిందూ మతం గూడ ఇదే చేసింది. పుట్టిన మనిషి పుట్టినట్తుగా ఉండనీయలేదు. రెండవసారి పుట్టమంది. అంతే ద్విజుడు కమ్మంది. యజ్ఞోపవీతం ధరించి ద్విజుడు కమ్మంది. ఇలాగయితేనే మతస్తుడవుతావు. ఇదే బాణీలో క్రైస్తవం "బాప్తీజమ్"ను పాటిస్తుంది.

ఇలాగే ఈ మతాలకు ముక్తి కూడా ఈ భూమి మీద, ఈ లోకంలో లేదు. పరాయి లోకంలో ఉంది . ఆ ముక్తి కూడా, ఈ జన్మలో కాదు. జన్మల తరువాత. ఇదంతా వైదేశిక లక్షణం. పరాయితనం అంటే ఈ లోకం తనకు పరాయిది. ఈ లక్షణం చైనా సంస్కృతిలో లేదు. ప్రకృతి పరమం. ప్రకృతి తెలివిని మార్చపనిలేదు. మనిషి ప్రకృతిలో భాగం. అందుకని మనిషిని ఆ సంస్కృతి మంచిగానె, పరాయివానిగా కాక, స్వంతదారునిగానే పరిగణిస్తుంది. మనిషి ఎంత మంచిగా ఉండగలరో ప్రకృతం అంత మంచిగా ఉన్నారు.ఇక ఇతడు ఇంతకన్నా మంచిగా ఉండగలిగినది లేదు. ఈ సంస్కృతి ప్రకారం జీవిత లక్ష్యం అప్పటి ఈ వాస్తవ ప్రపంచంలోసుఖంగా ఉండటమె.వారికీ ప్రకృతం తప్ప భావిలేదు. అహం తప్ప పరంలేదు. "చైనీయులు అహం కోసం కాక పరంకోసం, ప్రకృతి కోసం కాక భావికోసం చూడాలి" అనిభావించె పరాయి దేశస్తులు వారికి మతం లేదన్నారు. అన్ని శతాబ్దాలుగా వారిని భౌద్ధమతం పరివేష్టించినా, ఆ తరువాత క్రైస్తవ మిషనరీలు వారిని మార్చాలని ప్రయత్నించినా, మార్క్స్ మతం పై కొన్నా వారి శీల లక్షణం మానలేదు. అది ప్రాకృతికం. కనుక జీవిత లక్ష్యం మత లక్ష్యాలను "జీవించడం"లో దానిని ఒప్పుకోవడంలో, గుర్తించటంలో చూడాలి.

డౌతత్వం(Taoism)

[మార్చు]

డౌ తత్వానికి మూలగ్రంథం డౌ డె కింగ్ (Tao teh king) డౌ డె జింగ్ (Tao Teh Ching) "డౌ" అంటె "ప్రకృతి", "స్వభావం" లెదా "సమానత్వం", "డె " అనగా తెలివి, వివేచన. 'కింగ్" అనిన గ్రంథం. డౌ డె కింగ్ అంటే ప్రకృతి వివేచన గ్రంథం. అది డౌ తత్వానికి గొప్ప ప్రామాణిక అత్యంత ప్రాచీన గ్రంథం. దీనిని లౌడ్జు (Lao tzu) క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో వ్రాశారంటారు. అయితే ఈ గ్రంథ కాలం, దీని రచయిత రెండూ సందేహాస్పదాలే. ఏది ఏమైనా ఈ గ్రంధాన్ని ఎప్పుడు వ్రాసినా, ఎవరు వ్రాసినా, వ్రాసిన వ్యక్తి అన్ని కాలాల్లోకి గొప్ప మత చింతనాపరుడై ఉండాలి. ప్రకృతి ప్రక్రియలపై మానవ జీవితం ఆధారపడిందన్న సత్యాన్ని గుర్తించవలసిన నాటి ప్రజల వ్యవసాయిక అనుభవాల నుంచి, గ్రామీణ విజ్ఞానం నుంచి, ఆ గ్రంథంలోని భావాలు ఎదిగాయి., అసలు ఈ భాఆలను లౌద్జు క్రీ.పూ.2697 లో నివసించాడని చెప్పబడిన హుయాంగ్ - టికి ఆపాదించబడ్డాయి. ఇతడే చైనాను నాగరికం చేశాడంటారు. ఈ గ్రంథంలోని విషయాలు ఎవరైన అర్థం చేసుకోవడానికి వీలుగా, సరళంగా చెప్పబడ్డాయి. అయినా అవి ఇంతో అర్థగర్భితాలు.

డె(వివేచనా శక్తి) యాంగ్ (మొదలు) యిన్ (తుది) లో లేని "డౌ" అస్ంపూర్ణం. మొత్తం చైనీయ తత్వంలో కెల్లా "డౌ" అనేది చాలా ప్రాథమిక భావన. ఈ పదాన్ని అనువదించటం కష్టం. దీనిని అనేకమంది అనేక రకాలుగా అనువదించారు. ఈ అనువాదమూ సరైనది కాదు. "డౌ" గురించి చదివినప్పుడు, దానికి సంబంధించిన భావనను ఎవరికీ వారు ఏర్పరచు కోవలసిందే. కేవలం "సర్జకశక్తి", "సత్యం", "పథం", "విధానం", "మాన", "అస్తిత్వం" అనే పదాలతో దానిని అనువదించారు. అందులో దర్శించ ప్రయత్నించారు. ఒకరు మాత్రం డౌ డె కింగ్ గ్రంథం నామాన్ని "ప్రకృతి దాని తెలివి"గా అనువదించారు.

"డౌ" అంటే ప్రకృతి. ప్రకృతికో అనేక ప్రకృతులున్నాయి. ఉదాహరణకు నీకు ఒక ప్రకృతి (స్వభావం) ఉంది. నాకు ఒక ప్రకృతి ఉంది. మన ఇద్దరి ప్రకృతుల కంటే గుర్రం పకృతి వేరు. ఈ ప్రకృతి వేరు. ఈ ప్రకృతిలు వస్తాయి. పోతాయి. ప్రకృతిలో ప్రకృతులు తప్ప వేరేమీ ఉండవు. ఈ ప్రకృతులు ఏవీ దాని కంటే వెలుపలివి, భిన్నమైనవి కావు. ప్రకృతికి మూలాన్ని ప్రకృతులు తప్ప వెరేమీ ఉండవు. ఈ ప్రకృతి వెలుపల అవి ఏమీకావు. ప్రకృతి ఎలా పనిచేస్తుందో చూడండి: "కొన్ని మందు వెడతాయి. కొన్ని వీటిని అనుసరిస్తాయి. కొన్ని పైకి, కొన్ని క్రిందకి పోతాయి. కొన్ని బలమైనవి. ప్రకృతి పద్ధతి మొదలు - చివరల ఆరంభం -అంత్యాల - విత్తడం - పంట కోసుకోవటం ల, ఉత్పత్తి - వినిమయాల, సంయుక్త ప్రక్రియ. అది గతిశీలకంగా, పర్యాయికంగా పనిచేస్తుంది. అది చేస్తున్న పని పూర్తికాగానే, తిరిగి మొదలు పెడుతుంది. ఉన్నదంతా అటువంటి పర్యాయిక ప్రక్రియ నుంచి ఉద్భవిస్తుంది. ప్రకృతి చర్య అయత్నం, స్పయంచాలనం. ఎందుకంటే ఆ చర్య జరగటానికి కారణం ఎక్కడో బయట లేదు కనుక, ప్రకృతి ప్రాకృతికంగా అంటే దాని అంతర్గత స్వభావానికి అనుగుణంగా చర్య జరుపుతుంది. ఎవరైనా తమ స్వభావాలకనుగుణంగా పనిచేసే వారు, ప్రకృతిలో భాగంగా పనిచేస్తున్నట్లే ప్రకృతిలోని ఏదీ కూడ ప్రకృతిని దాటిపోలేదు. ఎందుకంటే ప్రతిదీ ప్రకృతి అభివ్యక్తమే కనుక

ఇక "డె" విషయానికి వద్దాం. ఇది ప్రకృతి శక్తి. అది సహజత్యంతో పనిచేయటానికి అవసరమైన శక్తి. ప్రకృతి సహజత్వంలో పనిచేయటానికి అవసరమైన శక్తి అయితే,. ప్రకృతి "డె" కంటే భిన్నమైంది కాదు. ఇది నిజం, కాని కొన్నిసార్లు ప్రకృతిలోని కొన్ని అంశాలు, కొన్ని వస్తులు అసహజంగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ అసహజం అంటె అర్థం ఒక వ్స్తువు తన ప్రకృతికి అనుగుణంగా కాక భిన్నంగా ప్రవర్తించటం ఉదాహరణకు మనుషులు, గుర్రాలు ప్రకృతిలోని భాగాలే అయినా, గుర్రం మనిషిలా, గుర్రంలా ప్రవర్తించటం అసహజం. గుర్రానికి గిట్టలుండటం సహజం. జీనులుండటం అసహజం. జీనులతో ప్రవర్తిస్తే అది మనుష స్వభావానుగునంగా ప్రవర్తించినట్లు.

లౌడ్జుకు ఆదర్శం - ప్రతి వస్తువు దాని స్వభావం ప్రకారం నడవడం. ఈ విధంగా అతనికి ఎవరినీ ఒత్తిడి చేయడం గాని, ఎవరూ ఒత్తిడి చేయటం గాని ఆదర్శం కాదు. దీనికి అర్థం బయటి ఒత్తిడి నుంచి గాక ప్రతి ఒక్కరు తన అంతర్గత స్వభావానికి అనుగుణంగా నడవాలి. ఆ విధంగా ప్రవర్తించే శక్తి ఎవరికి ఉందో వారికి "డె" ఉన్నట్లు. ఇతర స్వభావాలు ఒత్తిడి కనుగుణంగా నడుచుకొన్నట్లయితే ఆ మేరకు అతనికి "డె" లోపించినట్లె. ఈ విధంగా ఎవరూ తన జీవితాన్ని పెందుకోవడం ద్వారా, తన స్వభావాన్ని మార్చుకో చూసినట్లయితే అతడికి "డె" లేదు. తొందర తొందరగా పనిచేసేవారు అలసిపోతారు. త్వరగా వృద్ధులైపొతారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=డౌమతం&oldid=2954616" నుండి వెలికితీశారు