Jump to content

టి.కిషన్‌రావు

వికీపీడియా నుండి
(తంగెడ కిషన్‌రావు నుండి దారిమార్పు చెందింది)
టి.కిషన్‌రావు
టి.కిషన్‌రావు

తంగెడ కిషన్‌రావు


తెలుగు విశ్వవిద్యాలయము వైస్‌ ఛాన్సలర్‌
పదవీ కాలం
2021 మే 21 – 2024 మే 21

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
జీవిత భాగస్వామి కరుణాదేవి
సంతానం 1 కుమారుడు, 1 కూతురు
వృత్తి ప్రొఫెసర్, తెలుగు విశ్వవిద్యాలయము వైస్‌ ఛాన్సలర్‌

తంగెడ కిషన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న తెలుగు విశ్వవిద్యాలయము వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తంగెడ కిషన్‌రావు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఎల్కతుర్తి మండలం, జీల్గుల గ్రామంలో తంగెడ మనోహర్‌రావు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన 1 నుండి 5వ తరగతి వరకు జీల్గుల ప్రభుత్వ పాఠశాలలో, 6వ జిల్లా పరిషత్ పాఠశాల, హుజూరాబాద్ లో, వరంగల్‌ మహబూబియా ఉన్నత పాఠశాలలో 7 నుంచి 11వ తరగతి వరకు చదివాడు. కిషన్‌రావు జమ్మికుంట లోని ఆదర్శ డిగ్రీ కళాశాల 1966 నుండి 1970 వరకు పీయూసీ నుంచి డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ లో 1971 నుండి 1973 వరకు ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1991లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[4][5]

వృత్తి జీవితం

[మార్చు]

కిషన్‌రావు భువనగిరి లోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామి డిగ్రీ కాలేజీలో 1974 నుండి 1984 వరకు తెలుగు లెక్చరర్‌గా పనిచేశాడు. ఆయన 1984 నుండి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ లో అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా, 1991 నుండి 2011 వరకు ఉస్మానియాలో తెలుగు డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించాడు. ఆయన 2006 నుండి 2008 వరకు ఉస్మానియా తెలుగు డిపార్ట్‌మెంట్‌లో బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, తెలుగు శాఖలో అధ్యక్షుడిగా (హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌) విధులు నిర్వహించాడు. టి.కిషన్‌రావు 2008లో ఉద్యోగ విరమణ పొందాడు.[6]

వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు

[మార్చు]

టి.కిషన్‌రావు 24 మే 2021న తెలుగు విశ్వవిద్యాలయము వైస్ ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. EENADU, వరంగల్ అర్బన్ (23 May 2021). "ఓరుగల్లు బిడ్డలు.. విశ్వవిద్యాలయ సారథులు". EENADU. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.
  5. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.
  6. Namasthe Telangana (23 May 2021). "తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా జీల్గుల వాసి". Namasthe Telangana. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.
  7. Namasthe Telangana (23 May 2021). "వర్సిటీలకు కొత్త కళ". Namasthe Telangana. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.