Jump to content

తమిళకం

వికీపీడియా నుండి
సంగం యుగంలో తమిళకం.
మౌర్య సామ్రాజ్యానికి దక్షిణంగా ఉన్నది తమిళకం సుమారు 250 BCE.

తమిళకం అనేది భారత ఉపఖండంలో పురాతన తమిళులు నివసించిన దక్షిణ భూభాగం. ఇందులో ప్రస్తుతపు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షదీవులు, ఇంకా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని దక్షిణ భాగాలు ఉన్నాయి.[1] సాంప్రదాయ రచనలు, ప్రాచీన తమిళ రచన తొల్కప్పియం ఈ ప్రాంతాన్ని తమిళం సహజ భాషగా కలిగిన ఒకే సాంస్కృతిక ప్రదేశంగా వర్ణించాయి. పురాతన తమిళదేశం రాజ్యాలుగా విభజించబడింది. వీటిలో బాగా ప్రాచుర్యం చెందినవి చోళ, పాండ్య, చేర, పల్లవ రాజ్యాలు. సంగం యుగంలో తమిళ సంస్కృతి తమిళకం దాటి బయటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. పురాతన తమిళ పాలన శ్రీలంక, మాల్దీవులకు కూడా విస్తరించింది.

ప్రస్తుతం తమిళనాడు రాజకీయ నాయకులు, వక్తలు తమ ఉపన్యాసాల్లో తమిళకం ప్రాంతాన్ని కేవలం తమిళనాడు రాష్ట్రానికి పరిమితం చేసి మాట్లాడుతుంటారు.

చరిత్ర

[మార్చు]

ప్రాచ్య చరిత్రకారుడు కమిల్ జ్వెలెబిల్ ప్రకారం తమిళకం అనే పదం భారత ఉపఖండంలో తమిళ ప్రాంతాన్ని సూచించేందుకు వాడిన అత్యంత ప్రాచీనమైన పదం.[2]

విభాగాలు

[మార్చు]

సా.శ.పూ 600 నుంచి సా.శ 300 వరకు ఈ ప్రాంతాన్ని ప్రధానంగా మూడు తమిళ రాజవంశాలు పరిపాలించాయి. అవి చోళ, పాండ్య, చేర రాజవంశాలు.[3] సా.శ.పూ 3 వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యానికి చెందిన శాసనాల్లో తమిళ రాజ్యాల ప్రస్తావన ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Iyengar, P. T. Srinivasa (1 January 1929). History of the Tamils from the Earliest Times to 600 A.D. Asian Educational Services. ISBN 9788120601451.
  2. Zvelebil 1992, p. xi.
  3. Jesudasan, Dennis S. (20 September 2019). "Keezhadi excavations: Sangam era older than previously thought, finds study". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 29 October 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=తమిళకం&oldid=4369814" నుండి వెలికితీశారు