తల్లాప్రగడ సుబ్బలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తల్లాప్రగడ సుబ్బలక్ష్మి
జననంతల్లాప్రగడ సుబ్బలక్ష్మి
1917
తూర్పు గోదావరి జిల్లా
వృత్తిబాలికల పాఠశాలనందు ఉపాధ్యాయురాలు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధురాలు
భార్య / భర్తతల్లాప్రగడ నాగరాజు
తండ్రిభాస్కర రావు,
తల్లిబాపనమ్మ

తల్లాప్రగడ సుబ్బలక్ష్మి ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె 1917 లో తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో భాస్కర రావు, బాపనమ్మ దంపతులకు జన్మించారు. ఆరోజులలో ఆమె గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై మొదట దక్షిణ భారత భారత హిందీ ప్రచార సభ ద్వార విశారద వరకు చదివి ఉత్తీర్నురాలై ఆ తరువాత తన పదహారో ఏట తల్లాప్రగడ నాగరాజు గారిని వివాహము చేసుకొన్నారు.ఆమె భర్త కూడా అభ్యుదయ వాది కావడంతో వివహమైన కొద్ది రొజులకే వందేమాతరం ఉద్యమంలో భర్త తో సహా అరెస్టు అయ్యి రాయవెల్లూరు జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. ఆమె జైలులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ సహచరి. ఆ తరువాత విడుదలై స్వగ్రామమునకు తిరిగి వచ్చి సంసారమును చూసుకొంటూ ఖద్దరు నూలు వడుకుతూ చుట్టుప్రక్కలవారికి హిందీ నేర్పుతూ కాలం వెల్లదీసెడివారు. ఆ తరువాత గర్భిణీగా ఉండి కూడా స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొని జైలు పాలైనారు. తరువాత కొద్ది నెలలకు విడుదలై ప్రసవము ఐన తరువాత ఒక బాలికల పాఠశాలనందు ఉపాధ్యాయురాలిగా నియమితురలైనారు. ఒక ప్రక్క ఉద్యోగము చేస్తూ, సంసారము చూసుకుంటూ రాట్నము వడికి నూలుతీస్తూ, చాల ఉత్సహముగా జీవితమును గడిపెడివారు. తరువాత భర్త ఆకస్మిక మరణముతో కృంగిపొయినా తిరిగి ధైర్యము తెచ్చుకొని ఉద్యోగము చేస్తూ, తన ఏడుగురు పిల్లలను పెంచి పెద్దచేసి, సంఘములో చక్కని స్థాయిలో నిలబెట్టి తను తన సిద్ధాంతాలను నమ్ముకొంటూ ఖద్దరునే ధరిస్తూ ఒక అదర్సమూర్తిగా నిలబడి తన కర్తవ్యాన్ని సాధించారు.