తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తల్లాప్రగడ విశ్వసుందరమ్మ
జననంతల్లాప్రగడ విశ్వసుందరమ్మ
1899 మార్చి 6
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి
మరణం1949 ఆగష్టు 30
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి
భార్య / భర్తనరసింహశర్మ
తండ్రిమల్లవరపు శ్రీరాములు
తల్లిసీతమ్మ

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, (1899 మార్చి 6, - 1949 ఆగష్టు 30) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

బాల్యం, వివాహం

[మార్చు]

ఈమె 1899, మార్చి 6 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు 9వ ఏట తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహం జరిగింది. పండితులైన తన తండ్రి వద్దనే ఉండి ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి పరీక్షలు చదివింది. 16 సంవత్సరాల వయసులో భర్త దగ్గరకు కాకినాడ వచ్చింది. ఆ కాలంలో నరసింహశర్మ పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సూపరింటెండెంటుగా ఉన్నారు.

కాంగ్రెస్ ఉద్యమంలోకి

[మార్చు]

1921లో దంపతులిద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత, శాసనోల్లంఘన, విదేశీ వస్త్ర దహనాలు, వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాదు కాంగ్రెస్కు వెళ్లి అక్కడ సబర్మతీ ఆశ్రమానికి వెల్లి, గాంధీజీని దర్శించుకున్నారు. తిరిగివచ్చిన పిమ్మట వారిరువురూ స్థిరపడి ఒకచోట కార్యక్రమాలు నిర్వహించాలనుకొని రాజమండ్రి గోదావరి తీరాన "ఆనంద నికేతనాశ్రమం" 1923లో స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ జనాభ్యుదయం, నూలు వడకడం, ఖాదీ నేయడం, అనాథలను ఆదరించడం వంటి కార్యకలాపాలు ఈ ఆశ్రమం ద్వారా సాదించారు.

ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా

[మార్చు]

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చురుకుగా పాల్గొని, శాసనధిక్కారం చేసి, బహిరంగంగా విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగులు చేసి, 1930లో జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1932లో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం సమయంలో ప్రభుత్వం దమననీతిని అవలంబించింది. సభలు, సమావేశాలను నిషేధించింది. ఆజ్ఞల్ని ఉల్లంఘించి తెనాలిలో మండల కాంగ్రెస్ సభను జరిపారు. మరో 6 నెలలు జైలుశిక్షను రాయవెల్లూరులో అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ప్రభుత్వం ఆనంద నికేతనాశ్రమాన్ని స్వాధీనపరుచుకుంది..

రచన రంగం

[మార్చు]

1920 - 1949 మధ్యకాలంలో ఈమె రాసిన 125 పద్యాలను ఆమె మరణానంతరం 1973లో ఆమె సోదరులు "కవితా కదంబం" అనే పేరిట ఒక సంపుటిగా ప్రచురించారు. [2] ఈమె అభ్యుదయ దృక్పథం ఉన్న కవయిత్రి. ఆమె మంచి వక్తగా పేరుపొందారు. "వైతాళికులు" సంకలనంలో ఈమె కవితలు చోటుచేసుకున్నాయి.

మరణం

[మార్చు]

ఈమె 1949, ఆగష్టు 30 తేదీన స్వర్గస్తులయ్యారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ (1899 - 1949), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ.651-3.
  2. విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ, 20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు, అబ్బూరి ఛాయాదేవి, పేజీ. 368.

యితర లింకులు

[మార్చు]