తస్లీమ్ ఆరిఫ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పిఊబి కాలనీ, కరాచీ, పాకిస్తాన్ | 1954 మే 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2008 మార్చి 14 కరాచీ, పాకిస్తాన్ | (వయసు 53)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 82) | 1980 జనవరి 29 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1980 డిసెంబరు 8 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 31) | 1980 నవంబరు 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1980 డిసెంబరు 19 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1967/68–1989/90 | కరాచీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1967/68–1989/90 | NBP | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo.com, 2008 జనవరి 6 |
తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ (1954, మే 1 - 2008, మార్చి 14) పాకిస్థానీ మాజీ క్రికెటర్. 1980లో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ తరపున అతని స్కోరు 210*[1] శ్రీలంక కుమార సంగక్కర బద్దలు కొట్టే వరకు 20 సంవత్సరాలకు పైగా టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచిపోయింది.[2]
జననం
[మార్చు]తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ 2008, మార్చి 14న పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించాడు. కరాచీలోని పీఐబీ కాలనీలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత అతని క్రికెట్ రికార్డు ఆధారంగా నేషనల్ కాలేజీ కరాచీలో చేరాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఇంటర్ కాలేజియేట్ మ్యాచ్‌లలో కళాశాల జట్టు తరపున ఆడటం కొనసాగించాడు. ఇతని గురువు ప్రొఫెసర్ ముకర్రం అలీ ఖాన్ షిర్వాణి, అనేకమంది సెలెక్టర్లకు ఇతనిని అత్యుత్తమ, వర్ధమాన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
రికార్డు
[మార్చు]1978, సెప్టెంబరులో లాహోర్‌లో పంజాబ్‌కి వ్యతిరేకంగా నేషనల్ బ్యాంక్ తరపున ఆడుతూ, అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికిముందు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో పదిమంది అవుట్‌లను చేసిన మొదటి పాకిస్థానీ వికెట్ కీపర్‌గా నిలిచాడు.[3] ఇతని రికార్డును 1997లో వసీం యూసౌఫీ బద్దలు కొట్టాడు.
మరణం
[మార్చు]ఆరిఫ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 2008, మార్చి 14న కరాచీలో మరణించారు. కరాచీలోని ఫైసల్ కంటోన్మెంట్ శ్మశానవాటికలో ఇతని అంత్యక్రియలు జరిగాయి. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇమ్రాన్ ఆరిఫ్, లండన్‌లో నివసిస్తున్నాడు; అయినన్ ఆరిఫ్, ఇతను స్వయంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కోసం ఆడే క్రికెటర్; మరియమ్ ఆరిఫ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసిస్తున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ WISDEN – Second Test Match – PAKISTAN v AUSTRALIA 1979–80, ESPNCricinfo, 13 March 2008, retrieved 22 April 2012
- ↑ Records / Test matches / Batting records / Most runs in an innings by a wicketkeeper, ESPNCricinfo, 13 March 2008
- ↑ "Taslim Arif on 10 September, 1978". ESPN Cricinfo. Retrieved 10 September 2016.
- ↑ Former Pakistan keeper Taslim Arif dies, ESPNCricinfo, 13 March 2008, retrieved 22 April 2012