తాళ్ళపాక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తాళ్లపాక
—  రెవిన్యూ గ్రామం  —
తాళ్ళపాకలోని చెన్నకేశవాలయము
తాళ్ళపాకలోని చెన్నకేశవాలయము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,658
 - పురుషుల సంఖ్య 3,862
 - స్త్రీల సంఖ్య 3,796
 - గృహాల సంఖ్య 1,834
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర[మార్చు]

తాళ్లపాక, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము.[1]కడప - రాజంపేట రహదారిలో రాజంపేటకు సమీపంలో ప్రధాన రహదారి నుండి తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్ళపాక గ్రామముంది. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు. "చందమామ రావే జాబిల్లి రావే", "అదివో అల్లదివో శ్రీహరివాసము" వంటి పాటలు ఆయన నుండి తెలుగు వారికి దక్కాయి.

క్రీ.శ. 1426వ సంవత్సరం క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో అన్నమయ్య జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు. తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్ళపాకకు వచ్చి వివాహం చేసుకున్నా తిరిగి తిరుమలకు వెళ్ళాడు. ఆయన ఇల్లాలు తిమ్మక్క సుభద్రాపరిణయం రచించింది. తెలుగులో ఆమే తొలి కవయిత్రి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు కూడా కీర్తనలు రచించాడు.

అన్నమయ్య పుట్టింది ఒకచోట విగ్రహం పెట్టింది మరో చోట[మార్చు]

వైఎస్ఆర్ జిల్లా రాజంపేట హైవేలో 108 అడుగుల అన్నమయ్య భారీ విగ్రహం దర్శనమిస్తుంది.తిరుమలలోని ఆనంద నిలయాన్నే ఇక్కడ సృష్టించారు.ఇందుకోసం టీటీడీ రూ. 10 కోట్లకు పైగా ఖర్చు చేసింది.మరో రూ. 2 కోట్ల వ్యయంతో ఇక్కడ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాలని నిర్ణయించింది.అన్నమయ్య విగ్రహం పెట్టి అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాంతం తాళ్లపాక గ్రామ పరిధిలోకి రాదు. ఇది పెద్దకారంపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తుంది.(ఆంధ్రజ్యోతి 7.2.2010)

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. తాళ్ళపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు.

శ్రీ చెన్నకేశవ, సిద్ధేశ్వర స్వామివార్ల ఆలయాలు:- ఈ ఆలయాలలో 2014,జూన్-9 నుండి 13 వరకు, కుంభాభిషేక, అష్టదిగ్బంధన ఉత్సవాలు నిర్వహించారు. 9,10,11 తేదీలలో ప్రత్యేకపూజలు, హోమాలు, 12వ తేదీన మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకప్రోక్షణలు సహస్రనామాలు, పుష్పాంజలి నిర్వహించారు. 12వ తేదీ గురువారం సాయంత్రం, శ్రీ కామాక్షీ సమేత శ్రీ సిద్ధేశ్వరస్వామివారి శాంతి కల్యాణం, వేదపండితులు, మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల నడుమ, అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లను, నందివాహనంపై తాళ్ళపాక గ్రామ ప్రధాన వీధులలో ఊర్తేగించారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద యెత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలలో భక్తులసౌకర్యం కోసం, చలువ పందిళ్ళు ఏర్పాటు చేసారు. ఆలయాలను రంరంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. హోమాలు నిర్వహించేటందుకు ప్రత్యేక హోమగుండాలను నిర్మించారు. [1], [2] & [3]

చిత్రమాలిక[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,658 - పురుషుల సంఖ్య 3,862 - స్త్రీల సంఖ్య 3,796 - గృహాల సంఖ్య 1,834

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,జూన్-6, 16వ పేజీ. [2] ఈనాడు కడప; 2014,జూన్-9; 6వ పేజీ. [3] ఈనాడు కడప; 2014,జూన్-13; 7వ పేజీ.

వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాళ్ళపాక&oldid=2243844" నుండి వెలికితీశారు