Jump to content

తాహిరా సయ్యద్

వికీపీడియా నుండి
తాహిరా సయ్యద్
స్థానిక పేరుطاہرہ سيد
జన్మ నామంతాహిరా సయ్యద్
జననం1958 (age 65–66)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
సంగీత శైలిపాకిస్తానీ జానపద సంగీతం • గజల్
వృత్తి
  • గాయని
  • టీవీ పర్సనాలిటి
వాయిద్యాలువోకల్స్
క్రియాశీల కాలం1968 – ప్రస్తుతం
జీవిత భాగస్వామినయీమ్ బోఖారీ
(m. 1975; div. 1990)
పిల్లలుహస్నైన్ బోఖారీ (కొడుకు)
కిరణ్ బోఖారీ (కుమార్తె)
బంధువులుమాలికా పుఖ్‌రాజ్ (తల్లి)
షబ్బీర్ హుస్సేన్ (తండ్రి)
లేబుళ్ళురేడియో పాకిస్తాన్

తాహిరా సయ్యద్‌ (ఉర్దూ: طاہرہ سيد) (జననం 1958, లాహోర్) పాకిస్తానీ గజల్, జానపద గాయని.[1] ఆమె ఉర్దూ, పంజాబీ, డోగ్రీ, పహారీ భాషలలో కచేరీలు చేస్తుంది.[2][3]

బాల్యం

[మార్చు]

పాకిస్తానీ ప్రఖ్యాత గజల్, జానపద గాయని మాలికా పుఖ్‌రాజ్, రచయిత షబ్బీర్ హుస్సేన్‌లకు తాహిరా సయ్యద్ లాహోర్‌లో జన్మించింది.[4]

కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ విద్యా సంస్థలో చదివిన ఆమె సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. తరువాత లాహోర్ కళాశాల నుండి ఆమె డిగ్రీ పట్టభద్రురాలైంది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్.ఎల్.బి పట్టా పొందింది. ఆమె లాహోర్‌లోని కిన్నైర్డ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఇంగ్లీష్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరినా మధ్యలోనే విడిచిపెట్టింది.

కెరీర్

[మార్చు]

తాహిరా సయ్యద్ తన తల్లి మాలికా పుఖ్‌రాజ్ కోరికమేరకు తన 12వ యేట పాడటం ప్రారంభించింది. ఆమె అక్తర్ హుస్సేన్ వద్ద రెండు సంవత్సరాల పాటు కఠినమైన శాస్త్రీయ సంగీత శిక్షణ పొందింది, అలాగే ఆమె తల్లి దగ్గర నేర్చుకుని పాటలు, గజల్‌లలో ప్రావీణ్యత సాధించింది. ఆమె నాజర్ హుస్సేన్ వద్ద వాయిస్ మాడ్యులేషన్, రాగి(raggi) లలో మెలకువలు నేర్చుకుంది.

1968-1969లో రేడియో పాకిస్తాన్‌, పాకిస్తాన్ టెలివిజన్‌ లలో షోలు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తానీ కవి హఫీజ్ జలంధ్రీ రాసిన యే ఆలం షౌక్ కా దేఖా నా జే.., చంజర్ ఫబ్దీ నా ముతియార్ బినా.., అభి తౌ మైన్ జవాన్ హౌన్.. వంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఆమె పాడింది.

ఏప్రిల్ 1985లో ఆమె ఫొటో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ముఖచిత్రంగా అచ్చయింది. ఆమె 1972లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నిగర్ అవార్డును గెలుచుకుంది. 1994లో పాకిస్తాన్ టెలివిజన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఆమె 2013 మార్చి 23న ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డును పాకిస్తాన్ అధ్యక్షుడి చేతులమీదుగా అందుకుంది.

అమెరికాలో టెక్సస్‌లోని డల్లాస్‌లో గజల్ ఈవెనింగ్,[5] అలాగే పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఫైజ్ అహ్మద్ ఫైజ్‌కు నివాళులర్పించడం,[6] లాహోర్‌లోని ఫైజ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్[7] వంటి విభిన్న కార్యక్రమాలలో ఆమె ప్రదర్శనలతో మంచి పేరు తెచ్చుకుంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1975లో న్యాయవాది నయీమ్ బుఖారీని వివాహం చేసుకున్న తనకు ఇద్దరు పిల్లలు.[8] అయితే ఆ జంట 1990లో విడాకులు తీసుకున్నారు.[9]

గుర్తింపు

[మార్చు]
Year Award Category Result Title Ref.
1972 నిగర్ అవార్డులు ఉత్తమ నేపథ్య గాయని విజేత మొహబ్బత్ [2]
1994 PTV అవార్డులు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేత [2]
2013 ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ పాకిస్తాన్ అధ్యక్షుడిచే అవార్డు విజేత [2]

మూలాలు

[మార్చు]
  1. "Nurturing the tradition of music". The Hindu. 22 October 2007. Retrieved 27 May 2017.
  2. 2.0 2.1 2.2 2.3 "Pride of Pakistan:Tahira Syed". Daily Times. September 12, 2022.
  3. Sheikh, M. A. (26 April 2012). Who's Who: Music in Pakistan. Xlibris Corporation. pp. 251–. ISBN 978-1-4691-9159-1.
  4. Adnan, Ally (2 January 2015). "I find gossip about me mildly amusing". The Friday Times. Retrieved 27 May 2017.
  5. Kahnzada, Raja Zahid Akhtar (19 June 2019). "Tahira Syed performs in Dallas". www.geo.tv. Retrieved 27 May 2017.
  6. "SOLD OUT: A tribute to Faiz featuring Tahira Syed in concert @ Union League of Philadelphia, Philadelphia [7 May]". philly.carpediem.cd (in ఇంగ్లీష్). Archived from the original on 27 డిసెంబరు 2017. Retrieved 27 May 2017.
  7. Reporter, The Newspaper's Staff (22 November 2015). "A trip down 'melody' lane with Tahira Syed". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 27 May 2017.
  8. "Tahira Syed Dreams". www.thefridaytimes.com. Archived from the original on 10 June 2012. Retrieved 27 May 2017.
  9. "All set for literature gala starting on February 5". www.thenews.com.pk (in ఇంగ్లీష్). Retrieved 27 May 2017.