జంబుకేశ్వర ఆలయం (తిరువానైకావల్)
తిరువానైకవల్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°51′12″N 78°42′20″E / 10.85333°N 78.70556°E |
పేరు | |
ప్రధాన పేరు : | తిరువానైకవాల్ |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | తిరుచ్చి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | జంబుకేశ్వరుడు (శివుడు) |
ప్రధాన దేవత: | అఖిలాండేశ్వరి (పార్వతి) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణశైలి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ, 2 వ శతాబ్దం |
సృష్టికర్త: | కోచెంగ చోళుడు |
జంబుకేశ్వరం, పంచభూత క్షేత్రాలలో రెండవది.[1] జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రం లోని తిరుచ్చి పట్టణానికి 11 కి.మీ. దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రమని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.
స్థలపురాణం
[మార్చు]ఇక్కడ స్థల పురాణం మీద రెండు ప్రాచుర్యములో ఉన్న కథలు ఉన్నాయి.
- మొదటి ఇతిహాసం
మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ వుండగా ఒకసారి శంభుడికి శివున్ని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టం అయిన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతర్థానం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్ముతారు.
- మరో ఇతిహాసం ప్రకారం
ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.
జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఆలయం విశేషాలు
[మార్చు]ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
గర్భ గుడి
[మార్చు]జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.
అఖిలాండేశ్వరి ఆలయం
[మార్చు]జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్రతో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.
ఆలయ చరిత్ర- నిర్వహణ బాధ్యతలు
[మార్చు]చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని తెలుస్తోంది. సా.శ. 11 వ శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసి నట్లు తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు. కొంత కాలం క్రితం వరకు ఈ ఆలయనిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు.
చిత్రమాలిక
[మార్చు]-
అఖిలాండేశ్వరి
-
ఆలయ ప్రధాన గాలిగోపురం
-
ఆలయం రెండవ ఆవరణ
-
ఆలయం రెండవ ఆవరణ
-
ఆలయ ద్వారం
-
లోపల గోడలపై ఒక శిల్పం
-
ఆలయ రథం
మూలాలు
[మార్చు]- ↑ Praveen, V N. "Jambukeswarar Temple Thiruvanaikaval Darshan". Gokshetra. Gokshetra. Retrieved 6 March 2023.
వనరులు
[మార్చు]- Ayyar, P. V. Jagadisa (1991). South Indian shrines: illustrated. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0151-3.
- Ramaswamy, Vijaya (2007). Historical dictionary of the Tamils. United States: Scarecrow Press, INC. ISBN 978-0-470-82958-5.
- Knapp, Stephen (2005). The Heart of Hinduism: The Eastern Path to Freedom, Empowerment and Illumination. NE: iUniverse. ISBN 978-0-595-35075-9.
- M.K.V., Narayan (2007). Flipside of Hindu Symbolism: Sociological and Scientific Linkages in Hinduism. California: Fultus Corporation. ISBN 1-59682-117-5.
- Bajwa, Jagir Singh; Ravinder Kaur (2007). Tourism Management. New Delhi: S.B. Nangia. ISBN 81-313-0047-1.
- Tourist guide to Tamil Nadu (2007). Tourist guide to Tamil Nadu. Chennai: T. Krishna Press. ISBN 81-7478-177-3.
- Hunter, Sir William Wilson (1908). Imperial gazetteer of India, Volume 23. Oxford: Clarendon Press.
- Yadava, S.D.S. (2006). Followers of Krishna: Yadavas of India. New Delhi: Lancer Publishers and Distributors. ISBN 81-7062-216-6.
- Archaeological Survey of India; G. R. Thursby (1902). Annual report of the Archaeological Department, Southern Circle, Madras. Madras: Government Press.
- Chisholm, Hugh (1911). The encyclopædia britannica: a dictionary of arts, sciences, literature and general information, Volume 25. Madras: University press.
- Hastings, James; John Alexander Selbie, Louis Herbert Gray (1916). Encyclopædia of religion and ethics, Volume 8.
- Hunter, W.W. (1881). Imperial Gazetteer of India. Vol. 5.