తుల ఉమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుల ఉమ
తుల ఉమ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
జూలై 5, 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-25) 1970 డిసెంబరు 25 (వయస్సు 51)
మోత్కురావు పేట, మేడిపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (2001-2021)
భారతీయ జనతా పార్టీ (2021-ప్రస్తుతం)
జీవిత భాగస్వామి తుల రాజేందర్‌

తుల ఉమ, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా కత్లాపూర్ మండల జెడ్.పి.టీ.సి.గా విజయం సాధించింది.[1] 2014, జూలై 5న కరీంనగర్ జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయింది.[2]

జననం[మార్చు]

ఉమ 1970, డిసెంబరు 25న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, మేడిపల్లి మండలం మోత్కురావు పేటలో గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించింది.[3]

జీవిత విశేషాలు[మార్చు]

చిన్ననాటి నుండి పెత్తందారి వ్యవస్థను ప్రశ్నిస్తూ సామాన్యుల పక్షాన పోరాటాలు చేసిన ఉమ, నక్సలిజం వైపు ఆకర్షితురాలైంది. 1984 నుండి 1994 వరకు పదేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపి, నక్సల్స్ ఉద్యమం పీపుల్స్ వార్, జనశక్తిగా విడిపోయిన సందర్భంలో జనశక్తి వైపు తన పయనం సాగించింది. 1991 -94 మధ్య జిల్లా కమిటి సభ్యురాలిగా పనిచేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే సిరిసిల్ల డివిజన్‌లో కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో ఉద్యమ నాయకుడు తుల రాజేందర్‌తో ఆమెకు వివాహం జరిగింది.

అనారోగ్య రాజేందర్‌, ఉమలు 1994లో లొంగిపోయి జనంలో కలిసారు. అటుతరువాత ఉమ ప్రైవేట్‌గా బిఎ డిగ్రీని పూర్తి చేసింది. బీడీ కార్మికుల పక్షాన పోరాటం చేసింది.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1994లో సిపిఐ (ఎంఎల్) పార్టీ తరపున జగిత్యాల శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయింది. 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించింది. మొదట్లో టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన ఉమ, 2010 లో పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించబడింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా కత్లాపూర్ మండల జెడ్.పి.టీ.సి.గా విజయం సాధించి... 2014, జూలై 5న కరీంనగర్ జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయింది. తుల ఉమా 2021 జూన్ 4న టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]

మూలాలు[మార్చు]

  1. ది హిందూ. "Karimnagar gets its first woman ZP chair". Retrieved 18 April 2017.
  2. నమస్తే తెలంగాణ. "కరీంనగర్ జడ్పీ చైర్మన్‌గా తుల ఉమ". Retrieved 18 April 2017.[permanent dead link]
  3. తెలుగు వెబ్ దునియా. "నాడు మావోయిస్ట్ నేడు జెడ్.పి చైర్మన్... తుల ఉమ స్టోరీ..." telugu.webdunia.com. Archived from the original on 31 July 2016. Retrieved 18 April 2017.
  4. TV9 Telugu (14 June 2021). "బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌..." TV9 Telugu. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తుల_ఉమ&oldid=3551675" నుండి వెలికితీశారు