తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-2021)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-2021)
Submitted2020 మార్చి 6
Submitted byతన్నీరు హరీశ్ రావు
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2020 మార్చి 6
Parliament2వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerతన్నీరు హరీశ్ రావు
Tax cutsNone
‹ 2019
2021 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ (2020-2021) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2020 మార్చి 6న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. తొలిసారిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ 2020, మార్చి 8న ఉదయం 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటిసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2] 1 గంట 2 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.

2020-21 మొత్తం బడ్జెట్ అంచనా రూ. 1,82,914.42 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లుగా అంచనా వేయబడింది.[3] 2020 మార్చి 7న సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 2020-21 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రివర్గం పరిశీలించి ఆమోదించింది.

బడ్జెట్ వివరాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-2021)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[4][5]

  • రైతుబంధు పథకానికి రూ. 14వేల కోట్లు
  • రైతుబీమాకు రూ. 1150 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ. 6225 కోట్లు
  • పాడిపరిశ్రమల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు
  • డ్రిప్ ఇరిగేషన్‌కు రూ. 1819 కోట్లు
  • ఎస్టీల సంక్షేమం కోసం రూ. 9,771.27 కోట్లు
  • ఎస్సీల సంక్షేమం కోసం రూ. 16,534 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 11,758 కోట్లు
  • మైనార్టీలకు రూ. 1,518.06 కోట్లు
  • కళ్యాణలక్ష్మీ కోసం రూ. 1350 కోట్లు
  • మహిళలకు వడ్డీలేని రుణాలకోసం రూ. 1200 కోట్లు
  • గ్రామీణాభివృద్ది కోసం రూ. 23,005 కోట్లు
  • మున్సిపల్ శాఖ కోసం రూ. 14,809 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ. 10,000 కోట్లు
  • ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రూ. 2,650 కోట్లు
  • పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు
  • ఉన్నత విద్య కోసం రూ.1,723.27 కోట్లు
  • వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు
  • పరిశ్రమల రాయితీ కోసం రూ. 1500 కోట్లు
  • విద్యుత్ శాఖ కోసం రూ. 10,416 కోట్లు
  • ఆర్టీసీ కోసం రూ. 1000 కోట్లు
  • గృహ నిర్మాణాలు కోసం రూ. 11,917 కోట్లు
  • అటవీ శాఖ కోసం రూ. 791 కోట్లు
  • దేవాలయాల కోసం రూ. 500 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు
  • పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు
  • అసెంబ్లీ నియోజకవర్గానికి డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ. 3 కోట్లు
  • పంచాయతీరాజ్ శాఖకు రూ. 23,005 కోట్లు
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధికి రూ. 480 కోట్లు
  • విదేశాల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 20 లక్షలు స్కాలర్షిప్
  • మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ. 1000 కోట్లు
  • రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు
  • సాగునీటి పారుదల రంగానికి రూ. 11,054 కోట్లు
  • ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ. 16,534.97 కోట్లు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ. 9771.27 కోట్లు
  • పెన్షన్ల కోసం రూ. 11,750 కోట్లు
  • మత్స్యకారుల సంక్షేమానికి రూ. 1,586 కోట్లు

ఇతర వివరాలు[మార్చు]

కోటి మందికిపైగా జనాభా నివసిస్తోన్న హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అమలు కోసం బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించబడ్డాయి. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం, తొలి దఫాలో భాగంగా రూ.10 వేల కోట్లు కేటాయించి, దీన్ని మిగతా నాలుగేళ్లు కొనసాగించేలా ప్రాణాళిక వేసింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
  2. ashok.kumar (2020-03-08). "తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.
  3. Rajeev, M. (2020-03-08). "Telangana's Budget 2020-21 pegged at ₹ 1.82 lakh crore". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-03-24. Retrieved 2022-05-04.
  4. ashok.kumar (2020-03-08). "తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020 -21లో కేటాయించిన నిధులు..." Asianet News Network Pvt Ltd. Archived from the original on 2020-10-23. Retrieved 2022-05-04.
  5. "తెలంగాణ బడ్జెట్ 2020: కీలకమైన ఈ రంగాలకు కేటాయింపులు ఇలా." Samayam Telugu. 2020-03-08. Archived from the original on 2021-05-21. Retrieved 2022-05-04.
  6. "తెలంగాణ బడ్జెట్.. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక కేటాయింపులు". Samayam Telugu. 2020-03-08. Archived from the original on 2021-05-21. Retrieved 2022-05-04.

బయటి లింకులు[మార్చు]