తెలంగాణ వాస్తు శిల్పం
తెలంగాణ వాస్తు శిల్పం రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆర్కిటెక్చర్. ఇది హిందూ దేవాలయ నిర్మాణం, ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ రెండింటిలోనూ విస్తృత శైలులతో ప్రాంతీయ వైవిధ్యాలను కలిగి ఉంది.
బౌద్ధ వాస్తుశిల్పం
[మార్చు]నేలకొండపల్లి స్థూపం బౌద్ధ కాలానికి చెందినది. ఇది సముద్ర తీరంలోని మైదానం అంచున ఉంది. ఇటీవలి కాలంలో పురావస్తు త్రవ్వకాల్లో ఒక బౌద్ధ మఠం అవశేషాలు, కొన్ని కళాఖండాలు బయటపడ్డాయి. సా.శ. 6వ శతాబ్దం వరకు ఈ కళాఖండాలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునకొండ అమరావతి బౌద్ధ పురావస్తు ప్రదేశం, కుందుపల్లి బౌద్ధ స్మారక చిహ్నాలు కూడా ఈ కాలానికే చెందినవిగా గుర్తించబడ్డాయి.
హిందూ దేవాలయ నిర్మాణం
[మార్చు]చాళుక్యుల వాస్తుశిల్పం
[మార్చు]అలంపూర్‌లోని 7వ శతాబ్దపు అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు.
కాకతీయుల వాస్తుశిల్పం
[మార్చు]వరంగల్ కోట, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి కాకతీయుల శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణలు.[1][2]
ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్
[మార్చు]కుతుబ్ జాకీ సమాధులు, హైదరాబాద్ లోని చార్మినార్, గోల్కొండ, వంటి వాటిని ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కు ఉదాహరణగా చెప్పవచ్చు.
గోల్కొండ సుల్తానేట్
[మార్చు]గోల్కొండ సుల్తానేట్ నిర్మాణ శైలి ఇతర దక్కన్ సుల్తానుల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇండో-ఇస్లామిక్ శైలి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. గోల్కొండ కోట శిథిలాలే ఇందుకు ఉదాహరణ. వారు మోర్టార్‌తో విస్తృతమైన సమాధులు, మసీదులను నిర్మించారు.[3]
కలోనియల్ ఆర్కిటెక్చర్
[మార్చు]ఫలక్‌నుమా ప్యాలెస్
[మార్చు]ఈ ప్యాలెస్ వివిధ రకాల భారతీయ యూరోపియన్ శైలులను కలిగి ఉంది. ఇది ఒక కొత్త వారసత్వ శైలిలో నిర్మించబడిన, హైదరాబాద్‌లోని బ్రిటిష్ పాలకుడి నివాసం.[4]
ఇండో-సార్సెనిక్
[మార్చు]హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ సిటీ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కాచికుడ స్టేషన్‌లను ఇండో-సార్సెనిక్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ ఎస్క్ రూపొందించాడు.
స్వాతంత్ర్యం తరువాత
[మార్చు]ఆధునిక నిర్మాణ శైలిలో హైదరాబాద్ చుట్టూ ఉన్న హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు నిర్మించబడ్డాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌ను క్రిస్టోఫర్ పెన్నింగ్ సమకాలీన శైలిలో రూపొందించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Law, John. Modern Hyderabad (Deccan). pp. 13–14.
- ↑ Centre, UNESCO World Heritage. "The Glorious Kakatiya Temples and Gateways". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-03. Retrieved 2018-12-19.
- ↑ Centre, UNESCO World Heritage. "The Qutb Shahi Monuments of Hyderabad Golconda Fort, Qutb Shahi Tombs, Charminar". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Archived from the original on 2018-02-01. Retrieved 2018-12-19.
- ↑ Nanisetti, Serish (2017-07-29). "Mapping the Art Deco beauties before they vanish". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-26.