తెలుసుకో ఈ జీవిత సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలు మగలు చిత్రం పోస్టరు

తెలుసుకో ఈ జీవిత సత్యం పాట, ఆలుమగలు (1977) సినిమాలోనిది. ఈ సినిమాకు తాతినేని చలపతిరావు సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఈ పాటకు , శ్రీ శ్రీ సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించారు. . ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించగా, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ అభినయించారు.

ఉపోద్ఘాతం :

ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు

అంతులేని సుఖదు:ఖాలలో అందరూ సహాద్యాయులే


పల్లవి :

తెలుసుకో ఈ జీవిత సత్యం., జరిగేదే ఇది ప్రతి నిత్యం

ఏ వయసునకా చోటుంది.. అక్కడే నీకు పరువుంది

అప్పుడే నీకు సుఖముంది...

తెలుసుకో ఈ జీవిత సత్యం

జరిగేదే ఇది ప్రతి నిత్యం.


చరణం : 1

కడుపులో శిశువు కదిలి కుదిపితే ... అదియేతల్లికి ఆనందం..

అక్కున చేర్చిన కొడుకు తన్నితే... అదియే తండ్రికాహ్లాదం..

ఎదిగిన సుతులే మమతలు మరిచి ఎదురు తిరిగితే..

నువ్వెక్కడ?? నీ పరువెక్కడ?

నీ చోటెక్కడ??

తెలుసుకో ఈ జీవిత సత్యం

జరిగేదే ఇది ప్రతి నిత్యం.


చరణం : 2

తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం...

బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం..

తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం...

బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం..

ఆ ఉబలాటం ఆ అనురాగం కరువైపోతే..

నువ్వెక్కడ?? నీ పరువెక్కడ?

నీ తోడెక్కడ?? నీ నీడెక్కడ?